విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 17.651 శాతం డీఏను ఖరారు చేసింది. 2025 , జూలై 1వ తేదీ నుంచి ఈ డీఏ అమలు కానుంది. డీఏ పెంపు ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆమోదం తెలిపారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఉద్యోగులందరికీ డీఏ వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మొత్తం 71,387 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. అంతేకాకుండా విద్యుత్ సంస్థలపై నెలకు 9.39 కోట్ల రూపాయల అదనపు ఆర్థిక భారం పడనుంది.
English Translation
The Telangana state government has given good news to the electricity workers. 17.651 percent of the DA has been finalized. This DA will be implemented from July 1, 2025. Deputy CM Bhatti Vikramarka approved the DA hike proposals. DA is applicable to all employees under Transco, Genco, SPDCL, NPDCL. A total of 71,387 employees, artisans and pensioners will benefit from this decision taken by the state government. In addition, an additional financial burden of 9.39 crore rupees per month will fall on the electricity companies.