దేశ రక్షణ కోసం శిక్షణ.. పైసా ఫీజు లేకుండా..!

Eenadu icon
By Features Team Published : 19 Dec 2025 16:49 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: సైనిక ఉద్యోగంలో చేరాలని, యూనిఫాం ధరించి దేశ సరిహద్దుల్లో గస్తీ కాయాలన్నది వేలాది మంది యువత కల. దీనికోసం వారు పడే కష్టం అంతాఇంతా కాదు. తెల్లవారకముందే కిలోమీటర్ల కొద్దీ పరుగులు తీస్తారు. కసరత్తులు చేస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్నచిన్న పట్టణాల్లో ఈ దృశ్యాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. అయితే, దేహదారుఢ్య పరీక్షల్లో నెగ్గినా.. సరైన అవగాహన, శిక్షణ కొరవడి.. చాలామంది పరీక్షల్లో విఫలం అవుతుంటారు. ఒకట్రెండుసార్లు ప్రయత్నించి.. వేరే ఉద్యోగాలు వెతుక్కుంటారు. అలాంటి వారికి మార్గనిర్దేశం చేస్తూ.. దిక్సూచీలా పని చేస్తోంది.. ఒడిశాలోని బాలాసోర్‌లో ఉన్న కళింగ ఉత్కల్‌ డిఫెన్స్‌ అకాడమీ. పైసా ఫీజు లేకుండా యువతకు శిక్షణ ఇస్తోంది.

ముగ్గురు ఆలోచనల నుంచి పుట్టింది

గ్రామీణ ప్రాంత యువత ఎదుర్కొన్న కష్టాలన్నీ అధిగమించి.. సైన్యంలో చేరినవారే అమూల్య బింధాని, మయూర్‌ దాస్‌, బిజయ్‌ ప్రధాన్‌. ఆ కష్టాలు వేరెవరూ పడకూడదన్న సంకల్పంతో 2021లో కళింగ ఉత్కల్‌ అకాడమీని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత యువతకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. తొలుత 40 మందితో అకాడమీని ప్రారంభించగా.. ఇప్పుడు 70 మంది యువతీయువకులు అక్కడ శిక్షణ పొందుతున్నారు. అయితే, దేహదారుఢ్య, రాత పరీక్షలకు సంబంధించి పూర్తి ఉచితంగా శిక్షణ ఇస్తారు. అయితే, భోజనానికి అయ్యే ఖర్చు మాత్రం వాళ్లే భరించుకోవాల్సి ఉంటుంది. అది కూడా కష్టమైన వారికి రాయితీ ఇస్తారు. 

షరతులు వర్తిస్తాయ్‌

అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు నలుగురు ఉపాధ్యాయుల్ని నియమించారు. రాత పరీక్షలకు సంబంధించి వీరు తర్ఫీదు ఇస్తారు. అంతేకాకుండా 14 మంది వ్యాయామ శిక్షకులు కూడా అందుబాటులో ఉంటారు. ఉదయం 5 గంటల నుంచే వీరి శిక్షణ మొదలవుతుంది. వ్యాయామం, తరగతులు, ప్రాక్టీస్‌ టెస్టులు ఇదే అక్కడి ప్రపంచం. ఉద్యోగంలో చేరినవాళ్లు.. సెలవులపై ఇంటికి వచ్చినప్పుడు అకాడమీని సందర్శించి.. అక్కడ శిక్షణ పొందుతున్న వారికి తమ సూచనలు, సలహాలు ఇస్తుంటారు. వారితో ఒకట్రెండు రోజులు ఉండి మెళకువలు నేర్పిస్తుంటారు. అంతేకాకుండా తమ జీతంలో ప్రతినెలా కొంత మొత్తం అకాడమీకి విరాళంగా ఇస్తుంటారు. వాటితోనే అకాడమీని నిర్వహిస్తున్నట్లు బిజయ్‌ ప్రధాన్ చెప్పుకొచ్చారు. ఇక్కడ శిక్షణ పొందిన 40 మంది ఇప్పటికే ఇండియన్‌ ఆర్మీ, బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, పోలీస్‌ విభాగాల్లో పలుచోట్ల విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇది అకాడమీ కాదు.. ఓ కుటుంబం

అక్కడికి వచ్చిన ప్రతి అభ్యర్థిదీ ఒక్కో కథ. సరైన శిక్షణ లేక పలుమార్లు విఫలమై అక్కడ చేరినవారు కొందరైతే.. పేదరికంతో శిక్షణ కోసం డబ్బులు ఖర్చు చేయలేక.. తమ కలలను సాకారం చేసుకోగలమో, లేదోనన్న.. సందిగ్ధంలో పడి ఇక్కడికి వచ్చినవారు కొందరు. అలాంటి వారందరినీ అక్కున చేర్చుకొని దిక్సూచీలా పని చేస్తోంది ఈ అకాడమీ. దీంతో వారందరికీ అకాడమీ మానసికంగా దగ్గరవుతోంది. కలల సాధనకు తోడ్పాటునందించిన అకాడమీని అమ్మలా భావించి.. ఇంటికి వచ్చిన ప్రతిసారీ అక్కడ సేదతీరేందుకు వస్తుంటారు. అక్కడ శిక్షణ పొందుతున్న వారికి మార్గనిర్దేశం చేస్తారు. ఒకట్రెండు రోజులు వారితో కలిసిఉండి.. సంతృప్తి పొందుతారు. దీంతో అక్కడ కుటుంబ వాతావరణం కనిపిస్తుంది. ఎంతో బాగుంది కదూ..!

► Read latest Explained Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • పేరుకే పెద్దమనిషి.. భారత్ అంటే నిలువెల్లా విద్వేషమే! ఆయన చేసింది బ్యాంకు వ్యాపారం.. గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీలు ఇచ్చి అయినకాడికి వసూలు చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి.
  • ప్రేమికుల రోజు సరదాలా?ఖర్చే లేకుండా రొమాంటిక్‌ అనుభవాలు పొందొచ్చు! ప్రేమికుల రోజు.. కేవలం ప్రేమ జంటలే కాదు, భార్యాభర్తలూ చేసుకోదగ్గ వేడుక. సాధరణంగా ఈ రోజున ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.
  • టెండర్లపై ‘ఏఐ’ నిఘా.. అక్రమాలు, సిండికేట్‌లు ఇకపై కుదరవు! రహదారులు, రైల్వే ప్రాజెక్టులు సహా అభివృద్ధి పనులు.. ఇలా ప్రభుత్వంలో ప్రధాన నిర్మాణ ప్రాజెక్టులకు టెండర్లు తప్పనిసరి.
  • విహారయాత్ర సరే.. బడ్జెట్‌ మాటేంటి? నెలవారీ ఖర్చులు, భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికల మధ్య విహారయాత్రకు ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయించడం కష్టమే. అయితే, చేసే ఖర్చుల్లోనే కొంత మొత్తం పొదుపు చేస్తే విహారానికి బడ్జెట్‌ పెద్ద సమస్యే కాదంటున్నారు ఆర్థిక నిపుణులు. మరి దానికి ఏం చేయాలంటే..
  • వద్దన్నా వస్తున్నారు.. యూరప్‌లో ట్రావెల్‌ ఓవర్‌క్రౌడింగ్‌! చాలా దేశాల ప్రభుత్వాలు తమ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ.. మా దేశంలో పర్యటించాలని ప్రకటనలు, ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. 
  • ‘మని’ ద్వీపకల్పం.. అక్కడ అంతా ఒకే సమూహం గ్రీసులో ఉన్న ఓ మానవ సమూహం తరతరాలుగా అనేక దాడులను ఎదుర్కొని నిలిచింది.
  • పిల్లల్ని కనబోతున్నారా.. మరి వీటి గురించి ఆలోచించారా? పెళ్లి చేసుకున్న యువజంటలతో బంధువులు అనే మొదటి మాట..‘పిల్లల్ని ఎప్పుడు కంటారు? తొందరగా కనేయండి’అని. వైవాహిక జీవితానికి తల్లిదండ్రులు అనే హోదానే పరిపూర్ణత ఇస్తుందని సమాజం నమ్ముతుంది.
  • మాటలెందుకు? మీమ్స్‌ ఉండగా.. జెన్‌ జీ లైఫ్‌స్టైల్‌ ఇదీ! ఎవరైనా బొద్దుగా ఉన్న వ్యక్తి తారసపడితే ‘ఒడియమ్మా బంటీ’ అంటున్నారు.. ఏదైనా పనిని ఆశ్చర్యపరిచేలా వేగంగా చేసినా, ఎవరూ చేయలేని పనిని చేసి చూపించినా ‘ఫ్లాష్‌మ్యాన్‌’ అని పిలుస్తున్నారు. ఎందుకు అంటారా? ఇటీవల సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అయినా మీమ్స్‌ అవి.
  • టైమ్‌కి పని అవ్వాలంటే.. ఈ టెక్నిక్స్‌ తెలిసుండాలి! అనుకున్న పనులు సమయానికి పూర్తి కావాలంటే సమయ పాలన చాలా ముఖ్యం. దీన్ని పట్టించుకోకపోతే పనులన్నీ గందరగోళంగా, అసంపూర్తిగా ఉంటాయి.
  • జిప్ కోడింగ్.. గల్లీ దాటని ప్రేమ! గతంలో ప్రేమ కోసం సప్తసాగారాలు దాటిన కథలు విన్నాం. ఈ టెక్నాలజీ యుగంలో ఎంత దూరమున్నా మొబైల్‌లో మాట్లాడుతూ, వీడియో కాల్స్‌తో నెట్టుకొస్తున్న లాంగ్‌ డిస్టెన్స్‌ ప్రేమలనూ చూస్తున్నాం. కానీ, ఇప్పుడు కాలంతోపాటు యువత ఆలోచనలూ మారుతున్నాయి.
  • గ్రీన్‌లాండ్‌లో స్థలాన్ని కొనలేం.. ఇల్లు కావాలంటే పదేళ్లు వేచి చూడాలి! గ్రీన్‌లాండ్‌.. డెన్మార్క్‌కు చెందిన స్వయంప్రతిపత్తి గల ప్రాంతం. ఇక్కడి భూచట్టాల ప్రకారం.. భూమి అనేది ఇక్కడి ప్రజల సామూహిక వనరు. అందుకే, వ్యక్తిగతంగా ఎవరికీ యాజమాన్య హక్కులుండవు.
  • నదిలో బంగారం.. అదే వారికి జీవనాధారం! హరియాణాలోని యమునానగర్‌ జిల్లాలో బోలి నది ప్రవహిస్తుంటుంది. ఆ నదీతీర ప్రాంతంలో నివసించే ప్రజలకు అది కేవలం నీటి వనరే కాదు.. జీవనాధారం కూడా. ఎందుకంటే ఆ నదీలో బంగారం ఉంది.
  • ఊరు మొత్తానికి ఒక్కటే వంటశాల.. వృద్ధుల కోసం వినూత్న ఆలోచన! చందంకి.. గుజరాత్‌లోని మారుమూల చిన్న గ్రామం. అన్ని ఊర్లలో ఉన్నట్టుగానే ఇరుకైన వీధులు, సాధారణ ఇళ్లు, గుడి, బడి అన్ని ఉంటాయి. కానీ, ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది.
  • పొట్ట నిండినా ఆహారంపైనే ధ్యాస.. పెరుగుతోన్న ఫుడ్‌ నాయిస్‌ ఆకలి వేస్తే భోజనం చేస్తాం. ఎప్పుడైనా అనుకోకుండా మంచి ఫుడ్‌ కనిపిస్తే జిహ్వా కోరికని తీర్చేస్తాం. కానీ, కొంతమందికి ఆకలి తీరినా, ఎన్ని రకాల రుచులు చూసినా ఇంకా ఏం తినాలి? ఎప్పుడు తినాలి? అని ఆహారం గురించే ఆలోచిస్తుంటారు.
  • ఇజ్రాయెల్‌ ఆర్మీలో అందమైన భామలు! Israeli Army: ప్రపంచంలోనే శక్తిమంతమైన ఆర్మీ కలిగిన దేశాల్లో ఇజ్రాయెల్‌ ఒకటి. అత్యాధునిక ఆయుధ, సాంకేతిక సంపత్తి ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (IDF) సొంతం.
  • ఇతరుల్ని అర్థం చేసుకునేవారు ఇలా ఉంటారట! మనుషులంతా ఒకేలా ఉండరు. కొందరికి ఎంత చెప్పినా అర్థం కాదు. మరికొందరు చెప్పకుండానే అర్థం చేసుకుంటారు. కానీ, చాలా కొంత మందికే ఇతరులను పూర్తిగా చదవగలిగే సామర్థ్యం ఉంటుంది.
  • ఈ ఆలయంలో మొక్కుకుంటే జుట్టు రాలదట! ఏ దేవాలయానికి వెళ్లినా సుఖఃసంతోషాలు కలిగించమని, ఆరోగ్యం కాపాడమని, సంపద పెరగాలని దేవుళ్లకు ప్రార్థించడం సహజం. వాళ్లు కరుణిస్తే మొక్కులు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అయితే, జపాన్‌లో ఓ విచిత్రమైన ఆలయం ఉంది. అక్కడ భక్తులు కేవలం తమ జుట్టు రాలిపోకూడదని, జుట్టు సమస్యలు తొలగిపోవాలని మాత్రమే ప్రార్థిస్తారు.
  • ఎగిరే గాలిపటం.. మెరుగయ్యే జీవనం! గాలిపటాలు ఎగరవేయడం అనేది కేవలం సంప్రదాయం, సరదా మాత్రమే కాదు.. మనుషులకు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాదు, ఎన్నో లాభాలు చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
  • ఒంటరితనానికి కారణం ఇతరులు కాదు, మన అలవాట్లే! కొంత మంది ఒంటరిగా మిగిలిపోయామని మథనపడుతుంటారు. తనకంటూ ఎవరూ లేరని, చుట్టూ ఉన్నవారు దూరం చేస్తున్నారని భావిస్తారు. నిజానికి మనలోని అలవాట్లు, ఆలోచన తీరు, మనస్తత్వాలే మనుషుల్ని మనకు దూరం చేస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.
  • అనగనగా ఓ గ్రామం.. అక్కడ ఒకే ఒక్క ఇల్లు! నిర్మానుష్య ప్రాంతంలో కాసేపు ఉండాలంటేనే భయంతో వణుకు వచ్చేస్తుంటుంది. అలాంటిది, కనుచూపుమేరలో మనుషులే కనిపించని ఓ మారుమూల గ్రామంలో ఓ కుటుంబం కొన్నేళ్లుగా నివసిస్తోంది.

English Translation

Training for national defense.. without paisa fee..!

Eenadu icon
By Features Team Published : 19 Dec 2025 16:49 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

Internet Desk: Join the army, wear uniform and cross borders Patrolling is the dream of thousands of youth. This is not all the trouble they go through. They run for kilometers before dawn. Exercises are done. Especially in rural areas and small towns we keep seeing these scenes. However, even if they pass the physical fitness tests, due to lack of proper understanding and training, many fail in the tests. After trying a couple of times.. they look for other jobs. The Kalinga Utkal Defense Academy in Balasore, Odisha is working like a compass to guide such people. Training the youth without paisa fees.

Born from three ideas

Amulya Bindhani, Mayur Das and Bijay Pradhan joined the army after overcoming all the difficulties faced by the rural youth. Kalinga Utkal Academy was started in 2021 with the determination that no one else should face that hardship. The youth of the rural areas are given high priority. The academy was started with 40 people, now 70 young people are receiving training there. However, training for physical fitness and written exams is provided free of cost. However, they have to bear the cost of food. It also gives concession to those who are in difficulty. 

conditions apply

Four teachers are appointed to train the candidates. They give guidance regarding the written exams. Besides, 14 exercise trainers are also available. Their training starts from 5 am. This is the world of exercises, classes and practice tests. Those who have joined the job... visit the academy when they come home on holidays... and give their suggestions and advice to those undergoing training there. They stay with them for a day or two and teach them techniques. Besides, they donate some amount of their salary to the academy every month. Bijay Pradhan said that he is running the academy with them. He said that 40 people who received training here are already serving in Indian Army, BSF, CRPF and Police Departments in various places. There are some who joined there after failing many times due to proper training or not being able to spend money for training due to poverty.. Some of them came here in doubt whether they will be able to realize their dreams or not. This academy is working like a compass by including all such people. With this, the academy is getting closer to all of them. Every time he comes home, he comes to rest there, considering the academy as his mother, who has helped him to achieve his dreams. The trainees are guided there. Stay with them for a day or two and you will be satisfied. There is a family atmosphere there. Sounds very good..!

► Read latest Explained Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

more

  • Gentleman in the name.. India is constant hatred! What he did was bank business.. There are allegations that he gave interest in rural areas and collected it. Valentine's Day is a celebration not only for couples but also for husband and wife. Usually on this day they exchange gifts to each other.
  • AI surveillance on tenders..Irregularities and syndicates are no longer possible! Development works including roads and railway projects...Tenders are mandatory for major construction projects in the government. Between monthly expenses and future financial plans, it can be difficult to budget specifically for a vacation. However, financial experts say that the vacation budget is not a big problem if you save some amount in the expenses. And what to do about it..
  • Vaddanna is coming.. Travel overcrowding in Europe! Governments of many countries are developing their tourism sector and are making advertisements and campaigns to visit our country. 
  • ‘Mani’ peninsula.. there everything is one group A human group in Greece has faced many attacks for generations.
  • Are you going to have children.. and have you thought about these? The first word of relatives with the married couple..'When will the children be born? Hurry up.' Society believes that the status of parenthood is what makes a married life perfect.
  • Why? While there are memes.. This is the lifestyle of Jen Z! If someone is chubby, they say 'Odiamma bunty'. Why do you say? Memes are the latest trend in social media.
  • If you want to work on time.. you should know these techniques! Time management is very important to complete the planned tasks on time. If you don't pay attention to this, all the work will be confused and incomplete.
  • Zip Coding.. Love that does not cross the street! In the past we have heard stories of crossing the seven oceans for love. In this age of technology, we are seeing long-distance love through video calls and talking on mobile phones. But, now the youth's thoughts are changing along with the times.
  • Can't buy land in Greenland.. If you want a house, you have to wait ten years! Greenland is an autonomous region of Denmark. According to the land laws here.. land is the collective resource of the people here. That is why, no one has ownership rights individually.
  • Gold in the river.. that is their livelihood! Boli river flows in Yamunanagar district of Haryana. It is not only a source of water for the people living in that riverside area, but also a source of livelihood. Because there is gold in that river.
  • Only one kitchen for the whole town.. An innovative idea for the elderly! Chandanki.. a remote small village in Gujarat. As in all towns, there are narrow streets, simple houses, temples and schools. But, this village has something special.
  • Dhyasa on food even if stomach is full. If we are hungry, we will eat. Whenever we find good food by chance, we satisfy the desire of Jihwa. But, even if some people are hungry, what else should they eat, no matter how many different flavors they see? When to eat? They think about food.
  • Beautiful women in the Israeli army! Israeli Army: Israel is one of the countries with the most powerful army in the world. Israel Defense Force (IDF) owns the latest weapons and technology.
  • People who understand others are like this! All people are not the same. No matter how much you say to some, it doesn't make sense. Others understand without being told. But, very few people have the ability to read others completely.
  • If you plant in this temple hair will fall! It is natural to pray to the gods to bring happiness, health and wealth to any temple. Devotees believe that if they show mercy, their prayers will be fulfilled. However, there is a strange temple in Japan. There the devotees only pray that their hair does not fall and hair problems get rid of it.
  • Flying Kite.. Better Life! Flying kites is not just a tradition, it is not just fun.. Experts say that it not only improves the physical and mental health of people, but also brings many benefits.
  • The cause of loneliness is not others, but our habits! Some people say that they are left alone. He feels that there is no one like him and that those around him are alienating him. In fact, psychologists say that it is our habits, thinking and mentality that keep people away from us.
  • A village is like a village. Staying in a deserted area for a while makes you shiver with fear. For example, a family has been living for years in a remote village where there are no people in sight.