Stock market: భారీ లాభాల్లో సూచీలు.. మళ్లీ 26వేల ఎగువకు నిఫ్టీ

Eenadu icon
By Business News Team Published : 22 Dec 2025 16:08 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Stock market | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ బలపడడం, వచ్చే ఏడాది అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మరోసారి వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు దీనికి తోడయ్యాయి. దీంతో రెండు ప్రామాణిక సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. ముఖ్యంగా ఐటీ, మెటల్‌ స్టాక్స్‌ సూచీలకు దన్నుగా నిలిచాయి. భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం కూడా పాజిటివ్‌ సెంటిమెంట్‌కు కారణమైంది.

సెన్సెక్స్‌ ఉదయం 85,145.90 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 84,929.36) లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 85,601.33 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 638.12 పాయింట్ల లాభంతో 85,567.48 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 206 పాయింట్ల లాభంతో 26,172.40 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 89.70గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ట్రెంట్‌, ఇన్ఫోసిస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టెక్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌ పాసింజర్‌ వెహికల్స్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫైనాన్స్‌ మాత్రమే నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 61.20 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్స్‌ ధర 4, 411 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

English Translation

Stock market: Indices on huge gains.. Nifty again above 26k

Eenadu icon
By Business News Team Published : 22 Dec 2025 16:08 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Stock market | Mumbai: Domestic stock market indices ended in gains on positive signals from international markets. The strengthening of the rupee against the dollar and expectations that the US Federal Reserve will once again cut interest rates next year added to this. With this, both the benchmark indices gained for the second day in a row. Especially IT and metal stocks were good for the indexes. The free trade agreement signed between India and New Zealand also contributed to the positive sentiment.

Sensex opened the morning at 85,145.90 points (previous close 84,929.36) in gains. Profits continued throughout the day. It touched an intraday high of 85,601.33. Finally settled at 85,567.48 with a gain of 638.12 points. The Nifty closed at 26,172.40 with a gain of 206 points. The rupee is at 89.70 against the dollar. Shares of Trent, Infosys, Bharti Airtel, Tech Mahindra and Tata Motors Passenger Vehicles were the major gainers in the Sensex 30 index. State Bank of India, Kotak Mahindra Bank, L&T and Bajaj Finance were the only losers. While the price of Brent crude is trading at $61.20 per barrel in the international market, the price of gold continues at $4,411 per ounce. Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :