Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్న గిల్, అభిషేక్, అర్ష్‌దీప్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) డిసెంబరు 24 నుంచి మొదలుకానుంది. ఈ టోర్నీ కోసం పంజాబ్ 18 మందితో జట్టును ప్రకటించింది. టీమ్ఇండియా ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, అర్ష్‌దీప్ సింగ్, అభిషేక్ శర్మలకు ఇందులో అవకాశం కల్పించారు. వికెట్ కీపర్, బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌తో పాటు ఆల్‌రౌండర్లు నమన్ ధీర్, అన్మోల్‌ప్రీత్ సింగ్, రమణ్‌దీప్ సింగ్, సన్వీర్ సింగ్‌ను ఎంపిక చేశారు. అయితే, కెప్టెన్ ఎవరనేది మాత్రం వెల్లడించలేదు.
పంజాబ్ తమ ఏడు లీగ్ దశ మ్యాచ్‌లను జైపూర్‌లో ఆడనుంది. ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, గోవా, ముంబయితో తలపడనుంది. ఈ మ్యాచ్‌లు జనవరి 8న ముగుస్తాయి. జనవరి 11 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌లో గిల్, అభిషేక్, అర్ష్‌దీప్ ఎంపికైతే.. విజయ్ హజారే ట్రోఫీకి వారు ఎన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారో చూడాలి.
- అప్పుడు తీవ్రంగా కుంగిపోయా.. క్రికెట్‌ను వదిలేద్దామనుకున్నా : రోహిత్ శర్మ
విజయ్ హజారే ట్రోఫీకి పంజాబ్ జట్టు:శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్‌కీపర్), హర్నూర్ పన్ను, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఉదయ్ సహారాన్, నమన్ ధీర్, సలీల్ అరోరా, సన్వీర్ సింగ్, రమణ్‌దీప్ సింగ్, జషన్‌ప్రీత్ సింగ్, గుర్నూర్ బ్రార్, హర్‌ప్రీత్ బ్రార్, రఘు శర్మ, క్రిష్ భగత్, గౌరవ్ చౌదరి, సుఖదీప్ బజ్వా.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- వచ్చాడో బేబీ యువరాజ్ అతడి దేశంలో క్రికెట్‌కు అనుకూలమైన పరిస్థితుల్లేవ్.. ఏడాదికి మూడు నెలలే ఆట. అలాంటి చోట నుంచి క్రికెట్లో ఎదిగి జాతీయ జట్టుకు ఆడడమే గొప్ప. అలాంటిది ప్రపంచకప్‌లో బరిలో దిగే అవకాశం వచ్చింది.
- అజేయమేనా? హ్యాట్రిక్ విజయాలు.. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారీ గెలుపు.. టోర్నీలో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా అత్యధిక నెట్ రన్‌రేట్.. ఇలా టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా హవా మామూలుగా లేదు.
- ఆస్ట్రేలియా ఔట్ మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు షాక్. మంగళవారం జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య గ్రూప్-బి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో కంగారూ జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిన ఆసీస్..
- కివీసూ ముందుకు టీ20 ప్రపంచకప్‌లో సమీకరణాలతో పని లేకుండా న్యూజిలాండ్ సూపర్-8కు దూసుకెళ్లింది. మంగళవారం గ్రూప్-డి పోరులో కివీస్ 8 వికెట్ల తేడాతో కెనడాను చిత్తు చేసింది. మొదట కెనడా 4 వికెట్లకు 173 పరుగులు చేసింది.
- కంగారు పడింది.. ఎన్నోసార్లు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఆస్ట్రేలియా, ప్రపంచకప్ అనగానే టాప్ ఫామ్‌ను అందుకునే జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి ఇంత త్వరగా నిష్క్రమించడం ఏమాత్రం ఊహించనిదే.
- పాక్ నిలుస్తుందా? టీ20 ప్రపంచకప్ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా నిష్క్రమించింది. మరో పెద్ద జట్టు భవితవ్యం బుధవారం తేలిపోనుంది. గత మ్యాచ్‌లో భారత్ చేతిలో గట్టి దెబ్బ తిన్న పాకిస్థాన్.. తన చివరి గ్రూప్ పోరులో నమీబియాను ఢీకొనబోతోంది.
- ముగింపులో నేపాల్ మెరుపు పెద్ద జట్టు ఇంగ్లాండ్‌పై విజయానికి అత్యంత చేరువగా వెళ్లి, త్రుటిలో ఓడిన నేపాల్.. టీ20 ప్రపంచకప్‌ను అదిరే విజయంతో ముగించింది. గ్రూప్-సిలో తొలి మూడు మ్యాచ్‌లూ ఓడి సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించిన ఆ జట్టు.. స్కాట్లాండ్‌తో మంగళవారం చివరి పోరులో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
- సంక్షిప్త వార్తలు (5) రంజీ ట్రోఫీలో జమ్ముకశ్మీర్ చరిత్రకు చేరువైంది. బ్యాటింగ్.. బౌలింగ్‌లో స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో సత్తాచాటుతున్న ఆ జట్టు రంజీ చరిత్రలో తొలిసారిగా ఫైనల్ దిశగా అడుగులేస్తోంది.
- శర్మా.. మొదట నువ్వు సింగిల్ తీసుకో: సునీల్ గావస్కర్ టీమ్ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్‌లో తడబడుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అతడు ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడితే రెండింట్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
- యువరాజ్ సింగ్ పేరు.. శతకంతో రికార్డ్: కెనడా ‘యువీ’ సెన్సేషన్ Yuvraj Samra: ప్రస్తుతం పొట్టి ప్రపంచకప్‌లో ఓ కుర్రాడి పేరు నెట్టింట మార్మోగుతోంది. అతి చిన్న వయసులో టీ20 ప్రపంచకప్‌లో శతకంతో అదరగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.