Rohit Sharma: ఆస్ట్రేలియాలో అంత ఈజీ కాదు.. ఇంగ్లాండ్‌పై రోహిత్ వ్యంగ్యాస్త్రాలు

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ పేలవ ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లాండ్ ఓటమిపాలై సిరీస్‌ను చేజార్చుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లిష్ జట్టు వరుసగా నాలుగోసారి సిరీస్‌ను కోల్పోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ టీమ్‌పై భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. గురుగ్రామ్‌లో జరిగిన మాస్టర్స్ యూనియన్ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ‘హిట్‌మ్యాన్’ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తన క్రికెట్ కెరీర్‌లో మరపురాని విజయాలను గుర్తుచేసుకున్నాడు.
2021లో గబ్బా టెస్టులో భారత్ చారిత్రాత్మక విజయాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలవడం అంత ఈజీ కాదు.. కావాలంటే ఇంగ్లాండ్ ఆటగాళ్లను అడగండి చెబుతారు’ అంటూ రోహిత్ ( Rohit Sharma) వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘ఆస్ట్రేలియాలో 2021లో గబ్బాలో జరిగిన మ్యాచ్‌లో మేం (భారత్) గెలిచాం. రిషభ్ పంత్ అద్భుతంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. మేం గెలుస్తామని ఎవరూ నమ్మలేదు. అలాంటి స్థితి నుంచి టీమ్ఇండియా పుంజుకుని గెలిచింది. ఆ మ్యాచ్‌లో మా ఫస్ట్ ఛాయిస్ ఆటగాళ్లందరూ గాయాలు, వివిధ కారణాల వల్ల అందుబాటులో లేరు. ఆ సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ కొన్ని కామెంట్స్ చేయడం నాకు ఇంకా గుర్తుంది.
- జితేశ్ ఏం తప్పు చేశాడు.. అన్యాయంగా అతడిపై వేటు
ఆ కామెంట్స్‌లో ఒకటి మమ్మల్ని ఆలోచనలో పడేసింది. మ్యాచ్ ప్రారంభమైనప్పుడు తుది జట్టులో ముగ్గురు అరంగేట్ర ఆటగాళ్లున్నారు. గబ్బా ఆస్ట్రేలియాకు కంచుకోట. అప్పటివరకు వారికి అక్కడ ఓటమి అనేదే తెలీదు. కానీ, గెలుపుపై ఆశలు లేని స్థితి నుంచి మేం గొప్పగా పుంజుకుని ఆ మ్యాచ్ గెలిపించాం. అయితే, టెస్ట్ క్రికెట్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఇందులో ఆడటం అంత సులభం కాదు. ఆస్ట్రేలియాలో ఆడటం కఠినమైన సవాలు. కావాలంటే మీరు ఇంగ్లాండ్ ఆటగాళ్లను అడగండి. గబ్బాలో విజయం సాధించి ఆ తర్వాత ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవడం మాకు గ్రేట్ అచీవ్‌మెంట్’ అని రోహిత్ పేర్కొన్నాడు.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- వచ్చాడో బేబీ యువరాజ్ అతడి దేశంలో క్రికెట్‌కు అనుకూలమైన పరిస్థితుల్లేవ్.. ఏడాదికి మూడు నెలలే ఆట. అలాంటి చోట నుంచి క్రికెట్లో ఎదిగి జాతీయ జట్టుకు ఆడడమే గొప్ప. అలాంటిది ప్రపంచకప్‌లో బరిలో దిగే అవకాశం వచ్చింది.
- అజేయమేనా? హ్యాట్రిక్ విజయాలు.. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారీ గెలుపు.. టోర్నీలో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా అత్యధిక నెట్ రన్‌రేట్.. ఇలా టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా హవా మామూలుగా లేదు.
- ఆస్ట్రేలియా ఔట్ మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు షాక్. మంగళవారం జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య గ్రూప్-బి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో కంగారూ జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిన ఆసీస్..
- కివీసూ ముందుకు టీ20 ప్రపంచకప్‌లో సమీకరణాలతో పని లేకుండా న్యూజిలాండ్ సూపర్-8కు దూసుకెళ్లింది. మంగళవారం గ్రూప్-డి పోరులో కివీస్ 8 వికెట్ల తేడాతో కెనడాను చిత్తు చేసింది. మొదట కెనడా 4 వికెట్లకు 173 పరుగులు చేసింది.
- కంగారు పడింది.. ఎన్నోసార్లు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఆస్ట్రేలియా, ప్రపంచకప్ అనగానే టాప్ ఫామ్‌ను అందుకునే జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి ఇంత త్వరగా నిష్క్రమించడం ఏమాత్రం ఊహించనిదే.
- పాక్ నిలుస్తుందా? టీ20 ప్రపంచకప్ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా నిష్క్రమించింది. మరో పెద్ద జట్టు భవితవ్యం బుధవారం తేలిపోనుంది. గత మ్యాచ్‌లో భారత్ చేతిలో గట్టి దెబ్బ తిన్న పాకిస్థాన్.. తన చివరి గ్రూప్ పోరులో నమీబియాను ఢీకొనబోతోంది.
- ముగింపులో నేపాల్ మెరుపు పెద్ద జట్టు ఇంగ్లాండ్‌పై విజయానికి అత్యంత చేరువగా వెళ్లి, త్రుటిలో ఓడిన నేపాల్.. టీ20 ప్రపంచకప్‌ను అదిరే విజయంతో ముగించింది. గ్రూప్-సిలో తొలి మూడు మ్యాచ్‌లూ ఓడి సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించిన ఆ జట్టు.. స్కాట్లాండ్‌తో మంగళవారం చివరి పోరులో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
- సంక్షిప్త వార్తలు (5) రంజీ ట్రోఫీలో జమ్ముకశ్మీర్ చరిత్రకు చేరువైంది. బ్యాటింగ్.. బౌలింగ్‌లో స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో సత్తాచాటుతున్న ఆ జట్టు రంజీ చరిత్రలో తొలిసారిగా ఫైనల్ దిశగా అడుగులేస్తోంది.
- శర్మా.. మొదట నువ్వు సింగిల్ తీసుకో: సునీల్ గావస్కర్ టీమ్ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్‌లో తడబడుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అతడు ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడితే రెండింట్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
- యువరాజ్ సింగ్ పేరు.. శతకంతో రికార్డ్: కెనడా ‘యువీ’ సెన్సేషన్ Yuvraj Samra: ప్రస్తుతం పొట్టి ప్రపంచకప్‌లో ఓ కుర్రాడి పేరు నెట్టింట మార్మోగుతోంది. అతి చిన్న వయసులో టీ20 ప్రపంచకప్‌లో శతకంతో అదరగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.