Dhurandhar collection: బాక్సాఫీస్‌ లెక్క మార్చిన ‘ధురంధర్‌’.. రణ్‌వీర్‌ ఆ రికార్డు అధిగమిస్తాడా?

Eenadu icon
By Entertainment Team Updated : 24 Jan 2026 15:28 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: వారం పది రోజులకే అగ్ర కథానాయకుల సినిమాలు సైతం కలెక్షన్స్‌ లేక చతికల పడుతుంటే, ‘ధురంధర్‌’ (dhurandhar) మాత్రం బాక్సాఫీస్‌ వద్ద  దూసుకుపోతున్నాడు. మూడు వారాలు ముగిసినా వసూళ్ల విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. గత ఒక్క వారమే సుమారు రూ.100 కోట్లు వసూలు చేసిందంటే మాస్‌లో ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకూ రూ.800 కోట్లకు (గ్రాస్‌) పైగా వసూళ్లు (dhurandhar box office collection) సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి.  ఒక పక్క జేమ్స్‌ కామెరూన్‌ ‘అవతార్‌3’ హవా నడుస్తున్నా, ధురంధరుడి జోరు మాత్రం తగ్గడం లేదు. ఈ హవా ఇలాగే మరో రెండు వారాలు కొనసాగితే, రూ.1000 కోట్లు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.

అత్యధిక వసూళ్లతో మరో రికార్డు..

క్రికెట్‌లో ఆఖరి బంతి సిక్స్‌ కొట్టి విజయం సాధిస్తే వచ్చే మజానే వేరు. ఇప్పుడు బాలీవుడ్‌ పరిస్థితి ఇదే. గత కొన్నేళ్లుగా హిట్‌లు లేక ఆపసోపాలు పడుతున్న హిందీ చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది ఆరంభంలో ‘ఛావా’ విజయోత్సాహాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఆఖరి నెలలో వచ్చిన ‘ధురంధర్‌’ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది. 2025లో రూ.500 కోట్లు మార్కును దాటిన సినిమాలు ఐదు మాత్రమే ఉండగా అందులో ‘ధురంధర్‌’ నెం.1లో నిలిచాడు. దాని తర్వాతి స్థానాల్లో ‘కాంతార: చాప్టర్‌1’ (రూ.850 కోట్లు), ఛావా (రూ.797 కోట్లు), సయారా (రూ.579 కోట్లు) కూలీ, (రూ.514) ఉన్నాయి.

రణ్‌వీర్‌ వేగంగా వాళ్లను అధిగమిస్తాడా?

ప్రస్తుతం రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలు మొత్తం 8 ఉన్నాయి. వీటిలో తెలుగు నుంచి నాలుగు (బాహుబలి-2, పుష్ప-2, ఆర్‌ఆర్‌ఆర్‌, కల్కి 2898 ఏడీ), హిందీ నుంచి మూడు (దంగల్‌, జవాన్‌, పఠాన్‌), కన్నడ నుంచి ఒక్కటి (కేజీయఫ్‌: చాప్టర్‌2) ఉన్నాయి. ‘ధురంధర్‌’ హవా ఇలాగే కొనసాగితే, ఈ క్లబ్‌లో చేరిన 9వ చిత్రమవుతుంది. అంతేకాదు, టాలీవుడ్‌ రికార్డును బాలీవుడ్‌ సమం చేస్తుంది. ‘ధురంధర్‌’తో రణ్‌వీర్‌ మరో రికార్డును కూడా సృష్టించడానికి రెడీగా ఉన్నాడు. ‘ధురంధర్‌2’ను మార్చి 19, 2026న విడుదల చేస్తామని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఎలాంటి అవాంతరాలు లేకపోతే, ఈ డేట్‌కు సినిమా రావడం ఖాయం. తొలి భాగం చూసిన వారందరూ పార్ట్‌2 ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా ఎలా ఉన్నా, మొదటి భాగం తెచ్చిన బజ్‌తో ఆరంభంలోనే అదిరే వసూళ్లు రాబట్టడం ఖాయమని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలా వస్తే, అతి తక్కువ సమయంలో రూ.1000కోట్లు రాబట్టిన కథానాయకుడిగా రణ్‌వీర్‌ రికార్డు సృష్టిస్తాడు. ప్రభాస్‌ (బాహుబలి-2, కల్కి) ఈ ఫీట్‌ చేయడానికి చాలా సమయం తీసుకోగా, షారుక్‌ (జవాన్‌, పఠాన్‌)కు ఏడాది సమయం పట్టింది. ఈ లెక్కన రణ్‌వీర్‌ మూడు, నాలుగు నెలల వ్యవధిలోనే ఈ రికార్డు సృష్టించనున్నాడు.

  • ఈ ఏడాదికి ఇవే చివరి సినిమాలు..

తెలుగులో వచ్చేనా?

సాధారణంగా ఒక భాషలో విడుదలై విజయవంతమైన చిత్రాన్ని వీలైనంత త్వరగా ఇతర భాషల్లోకి డబ్‌ చేసి, విడుదల చేయడం ఇటీవల సర్వ సాధారణమైపోయింది. మరి, ‘ధురంధర్‌’ విషయంలో ఈ అడుగు పడిందా? లేదా? అన్నది తెలియటం లేదు. మొదటి వీకెండ్‌ తర్వాత తెలుగులోనూ మూవీ వస్తుందని టాక్‌ వినిపించింది. అయితే, మేకర్స్‌ నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. హిందీలోనే ఈ మూవీకి మంచి ఆదరణ వస్తున్న నేపథ్యంలో డబ్బింగ్‌ జోలికి వెళ్లకూడదని భావిస్తున్నారట. అయితే, ‘ధురంధర్‌2’ని మాత్రం హిందీతో పాటు ఇతర భాషల్లో విడుదల చేయాలని అందుకు తగినట్లుగా మార్పులు చేసుకుంటోంది చిత్ర బృందం.


► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 14:56 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • విడుదలకు ముందు ‘పేరు’ మార్పు.. మేకర్స్‌ నిట్టూర్పు! సినిమా పేరు మార్పు ఇటీవల ఎక్కువగా కనిపిస్తోంది. ఆ చిత్రాల వివరాలివీ..
  • అగ్ర హీరోలు కలిసి.. అంచనాలు పెంచుతూ.. క్రేజీ సినిమాలివే! అగ్ర హీరోలు కలిసి నటిస్తున్న  సినిమాలు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతున్నాయి. అవేంటంటే..?
  • ఫిబ్రవరి 3.. దుల్కర్‌, శివకార్తికేయన్‌కెంతో స్పెషల్‌.. అలా మొదలైంది జర్నీ దుల్కర్‌ సల్మాన్‌, శివకార్తికేయన్‌లకు ఈరోజు (ఫిబ్రవరి 3) ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే?
  • వయసు పైబడినా.. స్ఫూర్తినింపే ‘డైరెక్షన్‌’.. ఇక్కడ సింగీతం.. అక్కడ గోపాలకృష్ణన్‌ సీనియర్‌ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, అడూర్‌ గోపాలకృష్ణన్‌పై ప్రత్యేక కథనం..
  • డీఎస్పీ To లోకేశ్‌ కనగరాజ్‌.. హీరోలుగా తెరపైకొస్తున్నారు హీరోలుగా పరిచయం అవుతున్న సాంకేతిక నిపుణులు, దర్శకులపై ప్రత్యేక కథనం. ఏ సినిమాతో ఎవరు కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్నారంటే..?
  • ఆస్కార్‌ నామినేషన్స్‌.. పిన్న వయస్కుడిగా రికార్డు.. ఎవరీ తిమోతి? ఆస్కార్‌ నామినేషన్స్‌లో పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పిన తిమోతీ చాలమేట్‌ గురించి కొన్ని విశేషాలివి..
  • చిరు రికార్డుల వెనుక చరణ్‌, సుస్మిత.. ‘..వరప్రసాద్‌గారు’కు ముందు ఇన్ని జరిగాయా! బాక్సాఫీస్‌ వద్ద ‘మన శంకర వరప్రసాద్‌గారు’ (mana shankara vara prasad garu) రికార్డులు సృష్టిస్తోంది.
  • వీళ్లు సంక్రాంతికి వస్తారు.. హిట్టు కొడతారు.. రిపీట్‌ సంక్రాంతికి వచ్చి హిట్‌ కొట్టిన హీరో శర్వానంద్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడిపై ప్రత్యేక కథనం..
  • ప్రమోషన్స్‌లో ప్రేమ.. సక్సెస్‌ ఇచ్చిన అమ్మ మాట.. ‘ధురంధర్‌’ దర్శకుడి విశేషాలివీ! ‘ధురంధర్‌’తో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు ఆదిత్యధర్‌. ఆయన గురించి కొన్ని విశేషాలివీ..
  • బైసెప్స్‌.. బిగ్‌బాస్‌.. బాక్సాఫీస్‌.. బాలీవుడ్‌ ‘భాయ్‌’ సల్మాన్‌కు 60 ఏళ్లు.. ఇప్పటికీ మోస్ట్‌ ‘వాంటెడ్‌’ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌. వినోదాలు, వివాదాలతో సల్మాన్‌ జీవితం సమతూకం. 60వ పడిలో అడుగు పెట్టిన సల్మాన్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు...
  • ‘మైసా జనార్ధనా’.. వెండితెరపై పారుతున్న రక్తపుటేర్లు ‘కాలే మంటల్లో ఉండే ఎరుపు కన్నా.. పారే రక్తంలో ఉండే ఎరుపే అందంగా ఉంటుంది’ అంటాడు ‘సలార్‌’లో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌.
  • ‘అవతార్‌’.. అప్పుడొక విజువల్‌ వండర్‌.. ఆ క్రేజ్‌ ఇప్పుడు ఉందా? అవతార్‌: ఫైర్‌ అండ్ యాష్‌’ పేరుతో డిసెంబరు 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో అసలు ‘అవతార్‌’ కథేంటి? అందులో పాత్రలేంటి?
  • కుగ్రామం నుంచి బాలీవుడ్‌ వరకు.. ధర్మేంద్ర ప్రయాణమిదీ భారతీయ చిత్ర పరిశ్రమలో ధర్మేంద్ర (Dharmendra)ది ప్రత్యేక స్థానం. ఆయన నట ప్రయాణం వైవిధ్యం. రొమాంటిక్‌ హీరోగా, యాక్షన్‌ కింగ్‌గా, హీ మ్యాన్‌గా తిరుగులేని స్టార్‌డమ్‌ సొంతం చేసుకున్నారు.
  • ‘వారణాసి’ గ్లింప్స్‌.. రాజమౌళి విజన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. ఇవి గమనించారా? ‘వారణసి’.. ఒక్క మాట లేకుండా తాను తీయబోయే సినిమా స్థాయి ఏంటో యావత్‌ సినీ ప్రపంచానికి మరోసారి చూపించారు దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి (SS Rajamouli). మహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ ఇది.
  • ‘వారణాసి’.. టైటిల్‌ లోగోలోనే కథా నేపథ్యం! రాజమౌళి- మహేశ్‌బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘వారణాసి’. ఈ సినిమా టైటిల్‌ లోగోను గమనించారా..?
  • అదిగో పెళ్లి.. ఇదిగో గర్భం.. సినీ తారలకు తలనొప్పులు సినీ తారల సంగతులతో సోషల్‌మీడియా ఎప్పుడూ తీరిక లేకుండా ఉంటుంది. అందుకే ఆ తారలు సైతం తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
  • 27 ఏళ్లు ఆడిన సినిమా.. టీవీలోనూ రికార్డు: ‘డీడీఎల్‌జే’ విశేషాలివీ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు, రికార్డుల వివరాలివీ..
  • ఫస్ట్‌ ‘ఏఐ ఫిల్మ్‌ స్టార్‌’గా!.. ఎవరీ టిల్లీ నార్వుడ్‌ ప్రపంచంలోనే తొలి ఏఐ ఫిల్మ్‌ స్టార్‌గా టిల్లీ నార్వుడ్‌ నిలవనుంది. ఆ విశేషాలివీ..
  • కత్తులు.. తుపాకులు.. బాంబులు.. ఓ పవన్‌కల్యాణ్‌ పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా సుజీత్‌ దర్శకత్వంలో రూపొందిన ‘ఓజీ’ విడుదల కానున్న సందర్భంగా ఆసక్తికర విషయాలు ఇవే..
  • మోహన్‌లాల్‌ సమ్మోహన నట శిఖరం.. ఆ ఒక్క ఏడాది 36 సినిమాలు.. మోహన్‌లాల్‌కు కేంద్ర ప్రభుత్వం ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ అవార్డు ప్రకటించిన సందర్భంగా మోహన్‌లాల్‌ గురించి ఆసక్తికర విశేషాలు..