Starlink-Russia: స్టార్‌లింక్‌కు ‘మిల్లీమీటర్’ గండం.. రష్యా అన్నంత పని చేస్తుందా?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: అంతరిక్ష రంగంలో పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని అడ్డుకోవాలని చూస్తోన్న రష్యా.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్టార్‌లింక్’ ఉపగ్రహాలను (Starlink Satellite) లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. కక్ష్యలోనే ఈ ఉపగ్రహాలను పేల్చే విధంగా సరికొత్త యాంటీ-శాటిలైట్ ఆయుధాన్ని (Anti-Satellite Weapon) అభివృద్ధి చేస్తోందని పశ్చిమ దేశాల నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ సందేహాలు నిజమైతే మాత్రం అంతరిక్ష రంగానికి పెను ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నాయి.
ఈ వ్యవహారంపై నాటో, పశ్చిమ దేశాల ఇంటెలిజెన్స్ వర్గాల అధ్యయనాలను ఆధారంగా చేసుకుని అసోసియేటెడ్ ప్రెస్ కథనం రాసింది. దీంతో రష్యా ( Russia) యాంటీ-శాటిలైట్ ఆయుధానికి సంబంధించి కీలక విషయాలు బయటికొచ్చాయి. రష్యా అభివృద్ధి చేస్తోన్న ఈ ఆయుధాన్ని ‘జోన్-ఎఫెక్ట్’గా పేర్కొంటున్నారు. అంటే ఒక ఉపగ్రహాన్ని మాత్రమే కాకుండా.. కక్ష్యలోని ఎక్కువ భాగాన్ని లక్ష్యంగా చేసుకోవడమే దీని ఉద్దేశం. ఒకేసారి వేల సంఖ్యలో పెల్లెట్లను కక్ష్యలోకి పంపించి అనేక స్టార్‌లింక్ ఉపగ్రహాలను కూల్చేసే విధంగా దీన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.
- ఆ ఉపగ్రహాలు కూలితే ఏమవుతాయ్?
‘మిల్లీమీటర్’తో భారీ ముప్పు..
ఈ పెల్లెట్లు చాలా చిన్నగా, మిల్లీమీటర్ పరిమాణంలో మాత్రమే ఉంటాయని నిఘా వర్గాలు తమ అధ్యయనంలో పేర్కొన్నాయి. వీటిని భూమ్మీద గానీ.. అంతరిక్షంలో గానీ గుర్తించడం కష్టతరమని తెలిపాయి. వీటిని ట్రాక్ చేసే అవకాశం లేకపోవడంతో ముప్పును ముందే పసిగట్టలేమని అంచనా వేశాయి. అయితే, వీటితో ప్రమాదం మాత్రం తీవ్రంగానే ఉంటుందని హెచ్చరించాయి. ఇలాంటి చిన్న పరిమాణంలో ఉండే శకలం కారణంగా ఇటీవల చైనాకు చెందిన ఓ వ్యోమనౌక దెబ్బతింది. దీంతో భూమ్మీదకు రావాల్సిన ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు.
అంతేకాదు.. ఒకవేళ రష్యా ఈ దాడికి పాల్పడితే కక్ష్యలోని ఇతర వ్యవస్థలకూ ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. దాడి అనంతరం పెల్లెట్లు, ఉపగ్రహ శకలాలు భూమి దిశగా కిందకు జారుతాయి. ప్రస్తుతం ఈ స్టార్‌లింక్ ఉపగ్రహాలు భూమికి 550 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలో ప్రయాణిస్తున్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, చైనా అంతరిక్ష కేంద్రం దీని కంటే తక్కువ ఎత్తులో ఉండే కక్ష్యలో తిరుగుతున్నాయి. ఒకవేళ శకలాలు కిందకు పడే సమయంలో వీటిని ఢీకొనే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
స్టార్‌లింకే ఎందుకు..?
స్టార్‌లింక్ ఉపగ్రహాలను రష్యా తమ దేశానికి తీవ్ర ముప్పుగా పరిగణిస్తోంది. యుద్ధంలో ఉక్రెయిన్ నిలదొక్కుకునేందుకు అవి సహకరిస్తున్నట్లు అనుమానిస్తోంది. ఈ స్టార్‌లింక్ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను ఉక్రెయిన్ దళాలు యుద్ధ క్షేత్రంలో తమ కమ్యూనికేషన్స్, శత్రుస్థావరాలను గుర్తించడం కోసం వినియోగిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే రష్యా అనేకసార్లు హెచ్చరికలు చేసింది కూడా..! ఉక్రెయిన్‌కు సాయం చేసే కమర్షియల్ శాటిలైట్లను కూడా తాము లక్ష్యంగా చేసుకుంటామని మాస్కో బెదిరించింది. ఈ క్రమంలోనే ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్తగా మోహరించిన ఎస్-500 క్షిపణి వ్యవస్థతో.. తక్కువ ఎత్తు కలిగిన కక్ష్యలో ఉండే లక్ష్యాలను కూడా ఛేదించగలమని తెలిపింది.
రష్యాకు ముప్పేనా..?
అయితే, ఇలాంటి అయుధంతో అంతరిక్షంలో తీవ్ర గందరగోళం తలెత్తితే.. అది రష్యాకు కూడా ప్రతికూలంగానే మారుతుందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రష్యా, దాని మిత్ర దేశం చైనా సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, అనేక కంపెనీలు తమ కమ్యూనికేషన్స్, రక్షణ అవసరాల కోసం వేలాది శాటిలైట్లపై ఆధారపడుతున్నాయి. అందువల్ల ఈ ఆయుధాన్ని మాస్కో వినియోగించకుండా అంతర్జాతీయ సమాజం నిరోధించే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 16:17 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- అమెరికా పౌరహక్కుల నేత జెస్సీ జాక్సన్ మృతి అమెరికాలో శ్వేతజాతి దురహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ అనుచరుడు, రెండుసార్లు దేశాధ్యక్ష పదవికి పోటీచేసిన మానవ హక్కుల ఉద్యమ ప్రముఖుడు రెవరెండ్ జెస్సీ ఎల్.జాక్సన్ మంగళవారం మరణించారు.
- భారత్ సాయం మాకు అత్యంత కీలకం అంతర్జాతీయ సమాజ అభ్యున్నతి కోసం శాశ్వత ప్రాతిపదికన భారత్ అందిస్తున్న సాయం తమకెంతో కీలకమని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ స్పష్టం చేశారు.
- బంగ్లా ప్రధానిగా రహమాన్ ప్రమాణం బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా బీఎన్‌పీ నేత తారిఖ్ రహమాన్ (60) మంగళవారం పదవీ ప్రమాణం చేశారు.
- సౌదీలో దర్శనమిచ్చిన రంజాన్ నెలవంక సౌదీ అరేబియాతో సహా పలు గల్ఫ్ దేశాల్లో రంజాన్ నెలవంక దర్శనమిచ్చింది. దీంతో ఉపవాసాలు, భక్తిశ్రద్ధలకు ప్రత్యేకమైన పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైనట్లయింది.
- విన్యాసాలకు హర్మూజ్ జలసంధి తాత్కాలిక మూసివేత అస్త్ర ప్రయోగాలతో కూడిన సైనిక విన్యాసాలు జరగకుండా హర్మూజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
- అమెరికా ఐస్ హాకీ ప్రాంగణంలో కాల్పులు ఐస్ హాకీ క్రీడా ప్రాంగణంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందిన ఘటన ఇక్కడి పాటుకెట్‌లోని డెన్నిస్ ఎం.లించ్ ఎరీనాలో జరిగింది.
- శ్రీలంక సర్కారు కీలక నిర్ణయం.. ఎంపీల పెన్షన్లు రద్దు SriLanka: పొరుగు దేశం శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీల పెన్షన్లను పూర్తిగా రద్దు చేసింది. దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంట్‌లో మంగళవారం ఆమోదం పొందింది.
- ఆ యుద్ధ నౌకలు మునిగిపోవచ్చు! ట్రంప్‌నకు ఖమేనీ హెచ్చరికలు అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు.
English Translation
Starlink-Russia: Will Starlink's 'millimeter' work as well as Russia?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Internet Desk: It seems that Russia, which is trying to stop the dominance of the West in the field of space, has targeted the 'Starlink' satellites belonging to Elon Musk. Western intelligence agencies suspect that a new anti-satellite weapon is being developed to detonate these satellites in orbit. If these doubts are true, they warn that there is a great threat to the space sector.
The Associated Press has written an article on this matter based on the studies of the intelligence groups of NATO and Western countries. This has revealed key facts regarding Russia's ( Russia) anti-satellite weapon. This weapon being developed by Russia is called 'Zone-Effect'. That means targeting not just one satellite, but a larger part of the orbit. It is reported that it is being designed in such a way that thousands of pellets can be sent into orbit at the same time and destroy many Starlink satellites.
- What will happen if those satellites fall?
A huge threat with 'millimeter'..
The intelligence agencies stated in their study that these pellets are very small, only a millimeter in size. They said that it is difficult to detect these on earth or in space. As there is no possibility to track these, it is estimated that the threat cannot be sensed in advance. However, they warned that the danger with these would be serious. A Chinese spacecraft was recently damaged by such a small fragment. As a result, the three astronauts who were supposed to come to Earth were trapped in space.
Moreover, if Russia carries out this attack, there is a possibility that other systems in the orbit will also be in danger. After the attack, the pellets and satellite fragments slide down towards the earth. At present, these Starlink satellites are traveling in an orbit at an altitude of 550 km above the earth. The International Space Station and the China Space Station orbit at a lower altitude than this. Intelligence sources estimate that there is a risk of colliding with the fragments when they fall down.
Why Starlink..?
Russia considers Starlink satellites as a serious threat to their country. They are suspected of helping to sustain Ukraine in the war. These Starlink high-speed internet services are used by Ukrainian forces in the battlefield for their communications and locating enemy positions. Russia has already warned many times about this..! Moscow has also threatened to target commercial satellites that help Ukraine. It is in this order that it has recently made key comments. It is said that with the newly deployed S-500 missile system, it can also destroy targets in low altitude orbits.
Is Russia a threat?
However, if a serious chaos arises in space with such a weapon, it will also become negative for Russia. Some analysts predict that Many countries and companies around the world, including Russia and its ally China, rely on thousands of satellites for their communications and defense needs. Therefore, it is believed that there are chances of the international community preventing Moscow from using this weapon.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 16:17 ISTNote:Advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Death of American civil rights leader Jesse Jackson Reverend Jesse L. Jackson, a follower of Martin Luther King who fought against white supremacy in America, and a leader of the human rights movement who ran for the post of President twice, died on Tuesday.
- India's help is very important for us United Nations (UN) Secretary General Antonio Guterres has made it clear that India's assistance on a permanent basis is very important for the development of the international community. BNP leader Tariq Rahman (60) was sworn in as the Prime Minister of Bangladesh on Tuesday.
- Ramadan crescent seen in Saudi Arabia Ramadan crescent has been seen in many Gulf countries including Saudi Arabia. This marks the beginning of the special holy month of Ramadan for fasting and devotion.
- Temporary closure of Strait of Hormuz for maneuvers Iran has announced that it is temporarily closing the Strait of Hormuz to prevent military exercises involving missile launches. The incident in which three people were killed in the shooting at the ice hockey stadium took place at the Dennis M. Lynch Arena in Harukatte.
- The key decision of the Sri Lankan government.. Cancellation of pensions of MPs SriLanka: The government of the neighboring country Sri Lanka has taken a crucial decision. Pensions of MPs have been completely cancelled. The bill in this regard was approved in Parliament on Tuesday.
- Those warships may sink! Khamenei's Warnings to Trump Ayatollah Ali Khamenei, the supreme leader of Iran, made important comments while the tension between America and Iran continues.