Is Brooklyn Beckham Blocked parents David Victoria their family feud

డేవిడ్‌ బెక్‌హామ్‌.. ఈ పేరకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇంగ్లండ్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజాల్లో ఒకడైన ఈ మాజీ సారథికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మాంచెస్టర్‌ యునైటెడ్‌, రియల్‌ మాడ్రిడ్‌, పారిస్‌ సెయింట్‌- జెర్మేన్‌.. ఇలాంటి ప్రతిష్టాత్మక జట్టకు ప్రాతినిథ్యం వహించిన డేవిడ్‌.. మూడు ప్రపంచకప్‌ టోర్నీల్లోనూ భాగమయ్యాడు.

పాతికేళ్ల కాపురం
ఇక వ్యక్తిగత జీవితంలోనూ డేవిడ్‌ బెక్‌హామ్‌ సక్సెస్‌ఫుల్‌ ఫ్యామిలీమేన్‌గా కొనసాగుతున్నాడు. మాజీ పాప్‌ స్టార్‌ విక్టోరియా ఆడమ్స్‌తో ప్రేమలో పడ్డ డేవిడ్‌ బెక్‌హామ్‌.. 1999లో ఆమెను పెళ్లాడాడు. ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో గల లట్రెల్స్‌టౌన్‌లో అత్యంత వైభవోపేతంగా వీరి వివాహం జరిగింది.

ఇప్పటికి పాతికేళ్లకు పైగా వైవాహిక బంధంలో కొనసాగుతూ ఆదర్శంగా నిలుస్తున్న డేవిడ్‌- విక్టోరియా జంటకు.. నలుగురు సంతానం. ముగ్గురు కుమారులు బ్రూక్లిన్‌ బెక్‌హామ్‌, రోమియో బెక్‌హామ్‌, క్రూజ్‌ బెక్‌హామ్‌.. కుమార్తె హార్పర్‌ సెవెన్‌ బెక్‌హామ్‌. 26 ఏళ్ల బ్రూక్లిన్‌ ఫొటోగ్రాఫర్‌, మోడల్‌, చెఫ్‌.

ఇక 2002లో జన్మించిన రోమియో ఫుట్‌బాలర్‌గా అదృష్టం పరీక్షించుకుంటుండగా.. ఇరవై ఏళ్ల క్రూజ్‌ తల్లి మాదిరి సంగీత రంగంలో ఉన్నాడు. పద్నాలుగేళ్ల హార్పర్‌ పాఠశాల విద్య ఇంకా పూర్తి కాలేదు. కాగా పెళ్లైన తర్వాత విక్టోరియా వ్యాపారవేత్తగా, ఫ్యాషన్‌ డిజైనర్‌గా కెరీర్‌ కొనసాగిస్తోంది.

పెద్ద కుమారుడి వివాహం.. కోడలి రాకతో
అమెరికా బిలియనీర్‌ కుమార్తె, నటి నికోలా పెల్ట్జ్‌ను 2022లో పెళ్లి చేసుకున్నాడు బ్రూక్లిన్‌. అప్పటి నుంచే తల్లిదండ్రులతో అతడికి విభేదాలు తలెత్తినట్లు సమాచారం.

పెళ్లిలో వేసుకునేందుకు విక్టోరియా.. కోడలు నికోలా కోసం గౌన్‌ డిజైన్‌ చేయగా.. ఆమె దానిని ధరించేందుకు నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయం గురించి నికోలా స్పందిస్తూ.. విక్టోరియా డిజైన్‌ చేసిన డ్రెస్‌ తనకు సరిపడలేదని అందుకే వేరే గౌను వేసుకోవాల్సి వచ్చిందని స్పష్టతనిచ్చింది.

అన్‌ఫాలో చేశాడు 
అయినప్పటికీ అత్తా-కోడలి మధ్య గొడవ అన్న వదంతికి చెక్‌పడలేదు. చినికి చినికి గాలివానలా మారిన ఈ వివాదం బ్రూక్లిన్‌ తన తల్లిదండ్రులతో విడిపోయేదాకా చేరిందనే రూమర్లు వినిపిస్తున్నాయి. తాజాగా.. తన తల్లిదండ్రులను బ్రూక్లిన్‌ సోషల్‌ మీడియాలో అన్‌ఫాలో చేశాడన్న వార్తలు ఇందుకు కారణం.

తండ్రి పుట్టినరోజున రాలేదు.. మామకు విషెస్‌
అంతేకాదు గత కొంతకాలంగా బ్రూక్లిన్‌.. డేవిడ్‌- విక్టోరియాలతో పాటు తన తమ్ముళ్లు, చెల్లెలికి కూడా దూరంగా ఉంటున్నాడు. ముఖ్యంగా కుటుంబమంతా కలిసి చేసుకునే వేడుకలక అతడు గైర్హాజరు అవుతున్నాడు. డేవిడ్‌ బెక్‌హామ్‌ ఇటీవలే 50వ పుట్టినరోజు జరుపుకోగా.. బ్రూక్లిన్‌- నికోలాలకు ఆహ్వానం ఇచ్చినా వారు రాలేదు.

అంతేకాదు.. ఇటీవల న్యూయార్క్‌లో బ్రూక్లిన్‌- నికోలా మరోసారి పెళ్లినాటి ప్రమాణాలు చేయగా.. ఈ వేడుకలో బెక్‌హామ్‌ ఫ్యామిలీ కనిపించనే లేదు. ఇక క్రీడారంగంలో సేవలు అందించినందుకు గానూ.. కింగ్‌ చార్లెస్‌ III ఈ ఏడాది నవంబరులో డేవిడ్‌ బెక్‌హామ్‌కు ‘సర్‌’ బిరుదును ప్రదానం చేశారు.  ఈ నైట్‌హుడ్‌ సెర్మనీకి కూడా బ్రూక్లిన్‌ రాలేదు.

ఈ ఏడాది క్రిస్‌మస్‌ సెలవులను కూడా బ్రూక్లిన్‌.. నికోలా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తన పుట్టినరోజు(మే 2)న బ్రూక్లిన్‌ను మిస్‌ అయినట్లు తండ్రి డేవిడ్‌ పోస్ట్‌ పెట్టాడు. అయితే, ఫాదర్స్‌ డే సందర్భంగా బ్రూక్లిన్‌ తన తండ్రికి కనీసం విషెస్‌ కూడా చెప్పలేదు. అయితే, తన మామగారి (భార్య) తండ్రి ఫొటో పంచుకుంటూ హ్యాపీ ఫాదర్స్‌ డే అంటూ అతడి పట్ల అభిమానం చాటుకున్నాడు. 

భార్యనే సర్వస్వం
అదే విధంగా.. తన భార్యనే తనకు సర్వస్వం అని.. ప్రపంచంలో ఆమె కంటే తనకు ఎక్కువ ఎవరూ కాదంటూ పోస్ట్‌ పెట్టాడు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా బ్రూక్లిన్‌ తల్లిదండ్రులను అన్‌ఫాలో చేయడం గమనార్హం. 

ఏదేమైనా కోడలి గౌన్‌ గొడవతో మొదలైన వివాదం.. బెక్‌హామ్‌ కుటుంబం నుంచి పెద్ద కొడుకు విడిపోయేదాకా చేరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డేవిడ్‌- విక్టోరియా- కోడలు నికోలా మధ్య సత్సంబంధాలు లేకపోవడమే ఇందుకు కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఏదేమైనా దిగ్గజ ఆటగాడి కుటుంబం ఇలా చీలిపోతుండటం పట్ల అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా డేవిడ్‌- విక్టోరియా బెక్‌హామ్‌ల నికర ఆస్తుల విలువ రూ. 8 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

చదవండి: వాషీ, ఇషాన్‌ కిషన్‌ దండగ!.. ప్రపంచకప్‌ జట్టులో అవసరమా?


English Translation
Is Brooklyn Beckham Blocked parents David Victoria their family feud

David Beckham.. this name needs a special introduction. No. One of the legends of England football, this former captain has fans all over the world. Manchester United, Real Madrid, Paris Saint-Germain.. David represented such prestigious teams.. He was a part of all three World Cup tournaments. David Beckham fell in love with former pop star Victoria Adams and married her in 1999. Their wedding took place in the most glorious way in Luttrellstown, Dublin, Ireland.

David-Victoria, who has been in a married relationship for more than a year now, is an ideal. The couple has four children. Three sons Brooklyn Beckham, Romeo Beckham, Cruz Beckham.. Daughter Harper Seven Beckham. A 26-year-old Brooklyn photographer, model, and chef.

And Romeo, born in 2002, is trying his luck as a footballer. Twenty-year-old Cruz is in the music industry like his mother. Fourteen-year-old Harper's schooling was not yet complete. After marriage, Victoria is continuing her career as a businessman and fashion designer.

Eldest son's marriage.. With the arrival of daughter-in-law
Brooklyn married actress Nicola Peltz, daughter of an American billionaire, in 2022. Since then, it is reported that he had a conflict with his parents.

Victoria designed a gown for her daughter-in-law Nicola to wear in her wedding. She reportedly refused to wear it. However, in response to this matter, Nicola made it clear that the dress designed by Victoria did not suit her and therefore she had to wear a different gown. The rumor that there was a quarrel between the aunt and the sister-in-law was not verified. Rumors have it that the conflict escalated to the point where Brooklyn split up with her parents. Recently.. the news that Brooklyn has unfollowed his parents on social media is the reason for this.

He didn't come on his father's birthday.. Wishes to his uncle
Moreover, Brooklyn has been staying away from David-Victoria and his younger brothers and sisters for some time now. He is absent especially from family gatherings. David Beckham celebrated his 50th birthday recently.. Brooklyn-Nicolas were invited but they did not come.

Moreover.. Recently Brooklyn-Nicolas took wedding vows in New York.. Beckham family was not seen in this ceremony. And for his services in the field of sports.. King Charles III awarded the title of 'Sir' to David Beckham in November this year.  Brooklyn didn't come to this knighthood ceremony either.

It is reported that Brooklyn will celebrate the Christmas holidays this year with Nicola's family members. Meanwhile, father David posted that he misses Brooklyn on his birthday (May 2). However, Brooklyn didn't even wish his father on Father's Day. However, he shared a photo of his father-in-law's (wife's) father and expressed his affection for him by saying Happy Father's Day. 

Wife is everything
Similarly.. his wife is everything to him.. there is no one in the world more than her. In the background of these developments, it is noteworthy to unfollow the parents of Brooklyn. 

Anyway, the controversy that started with the daughter-in-law gown dispute.. It seems that the eldest son joined the Beckham family until he was separated. Especially the news is that the reason for this is the lack of good relations between David - Victoria - daughter-in-law Nicola.

Anyway, the fans are saddened that the legendary player's family is being split like this. While David-Victoria Beckham's net worth is Rs. It is estimated to be more than 8 thousand crores.

Read: Vashi, Ishan Kishan Dandaga!.. Needed in World Cup Team?