Former Nickelodeon star Tylor Chase spotted homeless on California streets

కార్లూన్లతో పాపులర్‌ అయిన పిల్లల కామెడీషో నికెలోడియన్‌ లో నటించిన అలనాటి నటుడు ఇపుడు దీనమైన స్థితిలో కనిపించాడు. కాలిఫోర్నియా వీధుల్లో 36 ఏళ్ల టైలర్ చేజ్‌ కాలిఫోర్నియా వీధుల్లో నివసిస్తున్నట్లు కనిపించడం అభిమానులలో, సహనటులలో ఆందోళన రేకెత్తించింది.  తమకెంతో సుపరిచితమైన బాల నటుడిని ఇలా హృదయ విదారకమైన రీతిలో ఇంత క్లిష్ట పరిస్థితుల్లో చూడటం చూసి ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా బాల నటులు ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలు,  మత్తుమందులు, మానసిక ఆరోగ్యం సవాళ్లపై చర్చకు దారి తీసింది. 

2004-2007 మధ్య నెడ్ డిక్లాసిఫైడ్ స్కూల్ సర్వైవల్ గైడ్‌లో మార్టిన్ క్వెర్లీ పాత్ర పోషించాడు చేజ్‌. లాస్ ఏంజిల్స్‌లోని రివర్‌సైడ్‌లో సెప్టెంబర్‌లో  కనిపించిన వీడియో నెట్టింట వైరల్‌ గా మారింది. ఈ వీడియోలో మాసిపోయిన లాస్ ఏంజిల్స్ రైడర్స్ పోలో షర్ట్ జీన్స్‌  ధరించి కనిపించాడు. జీన్స్‌ ప్యాంట్‌ ఎగదోసుకుంటూ,మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా కనిపించడం, అభిమానులు దిగ్భ్రాంతికి గురిచేసింది. అపుడు వీడియో తీసిన వ్యక్తి అతని గురించి ప్రస్తావించినపుడు తాను నికెలోడియన్‌ బాల నటుడిని అని చేజ్ బదులిచ్చాడు. ఈ వీడియో వైరల్‌ కావడంతో చేజ్ పేరు మీద GoFundMe పేజీని ఏర్పాటు చేసి 1,200 డాలర్లకు పైగా నిధులను సేకరించారు. అయితే ఈ విరాళాలను చేజ్‌ తల్లి నిరాకరించారు. విరాళాల సేకరణను నిలిపివేయాలని కోరారు. టైలర్‌కు డబ్బు కాదు వైద్య సహాయం అవసరమని ఆమె  స్పష్టం చేశారు. ఎన్నోసార్లు చాలా ఫోన్లు  కొనిచ్చా. కానీ ఒకటి, రెండు రోజుల్లో వాటిని పోగొట్టుకుంటాడు. వైద్య ఖర్చుల కోసం మనీ మేనేజ్‌ చేయడం అతనికి తెలియదంటూ  వివరించారు. ఈ సందర్భంగా గోఫండ్‌మీ ద్వారా  విరాళాల సేకరణను అభినందించారు. కానీ నిజానికి ఈ డబ్బుతో లాభం లేదన్నారు.

మరోవైపు చేజ్ పరిస్థితి గురించి అతని మాజీ సహనటులు డెవాన్ వెర్క్‌హైజర్, లిండ్సే షా . డేనియల్ కర్టిస్ లీ కూడా నెడ్స్ డిక్లాసిఫైడ్ పాడ్‌కాస్ట్ సర్వైవల్ గైడ్ ఎపిసోడ్ సందర్భంగా బహిరంగంగా చర్చించారు. తమ సహనటుడి ప్రస్తుత పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు. టైలర్‌కు మళ్లీ మంచి రోజులు రావాలని ఆశించారు. కాగా చేజ్ 1989 సెప్టెంబర్ 6 న అరిజోనాలో జన్మించాడు. 2000ల ప్రారంభంలో బాలనటుడుగా తన నటనతో ఆకట్టుకున్నాడు. 2004 నుండి 2007 వరకు ‘నెడ్స్ డిక్లాసిఫైడ్ స్కూల్ సర్వైవల్ గైడ్’లో మార్టిన్ క్వెర్లీ పాత్రను పోషించాడు. వీటితోపాటు గుడ్ టైమ్ మాక్స్ (2007),  ఎవ్రీబడీ హేట్స్ క్రిస్ (2005)లలో కూడా కనిపించాడు.

ఇదీ చదవండి: రూ. 8.10 కోట్ల మోసం.. తుపాకీతో కాల్చుకున్న మాజీ ఐజీ
 


English Translation
Former Nickelodeon star Tylor Chase spotted homeless on California streets

Nickelodeon is a popular children's comedy show with children. The yesteryear actor who acted in is now seen in a poor condition. The sight of 36-year-old Tyler Chase living on the streets of California has sparked concern among fans and co-stars.  They were shocked to see their familiar child actor in such a heartbreaking situation. It led to a discussion on the financial hardships, drugs and mental health challenges faced by child actors in particular. 

Chase played Martin Querley in Ned's Declassified School Survival Guide from 2004-2007. The video, which was seen in Riverside, Los Angeles in September, went viral. In this video, he is seen wearing a faded Los Angeles Raiders polo shirt and jeans. His jeans were bulging and he looked like a deranged man, leaving fans in awe. Chase then replied that he was a Nickelodeon child actor when the videographer mentioned him. After the video went viral, a GoFundMe page was set up in Chase's name and raised more than $1,200. But Chase's mother refused these donations. He asked to stop the collection of donations. She made it clear that Tyler needed medical help, not money. I have bought many phones many times. But he loses them in a day or two. He explained that he did not know how to manage money for medical expenses. On this occasion, he appreciated the collection of donations through Gofundme. But in fact, there is no profit with this money.

On the other hand, his former co-stars Devon Werkheiser and Lindsey Shaw have talked about Chase's condition. Daniel Curtis Lee also discussed it publicly during an episode of Ned's Declassified Podcast Survival Guide. He expressed regret over the current condition of his co-star. Hope for better days to come again for Tyler. Kaga Chase was born on September 6, 1989 in Arizona. He impressed with his performance as a child actor in the early 2000s. From 2004 to 2007 he played the role of Martin Querley in Ned's Declassified School Survival Guide. Apart from these he also appeared in Good Time Max (2007) and Everybody Hates Chris (2005).

Read This: Rs. 8.10 crore fraud.. Former IG shot with a gun