
తెలుగు వారి మనస్సాక్షి… సాక్షి టీవీ కెనడాలో గ్రాండ్‌గా లాంచ్ అయింది. సరిహద్దులు దాటి భారతీయ పరిమళాలను ప్రపంచమంతా వెదజల్లుతూ…కెనడాలో మొట్టమొదటిసారిగా ఓ నూతన ఆధ్యాయానికి శ్రీకారం చుడుతూ సాక్షి టీవీ కెనడా ప్రారంభమైంది. టొరంటో, మిస్సిసాగాలోని హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.
భారత జాతీయగీతంతో కార్యక్రమం ప్రారంభమై ప్రవాసుల హృదయాల్లో దేశభక్తి స్ఫూర్తిని నింపింది. ఈ కార్యక్రమంలో సాక్షి టీవీ కెనడా హెడ్ కె.కె. రెడ్డి, సాక్షి టీవీ స్టాఫ్, బిజినెస్ ఓనర్స్, కమ్యూనిటీ లీడర్స్, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రదర్శించిన సాక్షి టీవీ కెనడా ప్రత్యేక AVను ప్రవాసులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. అనంతరం సాక్షి టీవీ కెనడాకు తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
నార్త్ అమెరికా వ్యాప్తంగా విస్తరిస్తూ, అమెరికాలో నెంబర్ వన్ నెట్‌వర్క్‌గా ఎదిగిన సాక్షి టీవీ, ఇప్పుడు కెనడాలో కూడా సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని కె.కె. రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. సాక్షిటీవీ కెనడా ద్వారా అందించబోయే ప్రత్యేక కార్యక్రమాలను నిశ్చల్ వివరించారు.
సాక్షి టీవీ నార్త్ అమెరికా చీఫ్ కరస్పాండెంట్ సింహా జూమ్ ద్వారా టొరంటోలో సాక్షి టీవీ కెనడా లాంచింగ్‌పై హర్షం వ్యక్తం చేశారు. కెనడాలోని తెలుగు ప్రజల గుండె చప్పుడును ప్రపంచానికి వినిపించబోయే గొప్ప అడుగు అని కొనియాడారు. మార్కెటింగ్ మేనేజర్ వెన్నెల రెడ్డి జూమ్ ద్వారా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రీనా హోస్ట్ గా వ్యవహరించారు.
ఈ సందర్భంగా పలువురు ప్రవాసులు తమ సూచనలు, సలహాలు అందించారు. సాక్షి టీవీ కెనడా లాంఛ్ ఈవెంట్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కె.కె.రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సాక్షి టీవీ కెనడాను ఆదరించి, ఆశీర్వదించాలని కోరారు.

ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రవాసులు :
వరాహసూరి అప్పారావు, ప్రవీణ్ నీలా,రాజ్ సజ్జా, విశ్వ శ్రీనివాసన్, వేణుగోపాల్ రోకండ్ల, ప్రదీప్ కుమార్ కనమర్లపూడి, మహమ్మద్ సిద్ధిఖీ, సుధాకర్ రెడ్డి సింగన, ర్యాన్ సెక్వేరా, రాజేష్ ప్రసాద్, రంజిత్ పింగిలేటి, భావన పగిదేల, మురళీధర్ పగిదేల, రుక్మిణి మద్దులూరి, మధుసూధన్ కొట్టురి, యశ్వంత్ వుమ్మనేని, సూర్య కొండేటి, ప్రసన్న తిరుచిరాపల్లి, విజయ్, లక్ష్మి రాయవరపు, శ్రీనివాసులు, నూర్ అహ్మద్,విజయ్ చేగిరెడ్డి,కౌశిక్ నారాల, శ్రీని ఇజ్జాడ, సౌజన్య కసుల, ప్రతాప్ బి, విద్యా సాహితి, శైలేష్ పాలెం, అల్లంపాటి కృష్ణా రెడ్డి, విజయ్ సేతుమాదవన్, షాలిని బెక్కం, యశ్వంత్ రెడ్డి నిమ్మకాయల, గుణశేఖర్ కోనపల్లి, శ్రీనివాసులు రెడ్డి మరిక్కగారి నరసింహారెడ్డి గుత్తిరెడ్డి , చెన్న కేశవరెడ్డి కుమ్మెత, వెంకట కృష్ణా రెడ్డి గోపిరెడ్డి ,అస్లాం బేగ్, శశివర్ధన్ పట్లోళ్ల, విష్ణు వంగల , సుబ్బారావు నాయక్ బాణావతు, కళ్యాణ్ జి, కాయం పురుషోత్తం రెడ్డి, వి వి ఎన్ మూర్తి, రామ్, రమేష్ తుంపెర ,భరత్ కుమార్ సత్తి, శ్రీకాంత్ బి, నరేన్ తాడి, స్వాతి మిరియాల, పావని పులివర్తి , రవి కాసుల, సౌజన్య కాసుల, రామ్ చిమట, సుధీర్ కుమార్ సూరు, శ్రీనివాస్ కస్తూరి, వలియుద్దీన్ , లక్ష్మీ రాయవరపు, రవీందర్, వెంకట్ రామ్ రెడ్డి పలిచెర్ల, గౌతమ్ కొల్లూరి, పృధ్వీ, మహేశ్వర కనాల, నాగ వెంకట చిరంజీవి చాడ, క్రాంతి ఆర్, జగపతి రాయల, నిశ్చల్ వి, అనంత్ కందసామి, నాగార్జున, కోటేశ్వర్ రావు, వేణుగోపాల్, మణిదీప్, పలువురు పాల్గొన్నారు

English Translation

Telugu Vari Manasakshi... Sakshi TV has launched grand in Canada. Spreading Indian fragrances across the borders to the world...Sakshi TV Canada started a new chapter for the first time in Canada. The event was held at the Heartfulness Meditation Center in Mississauga, Toronto.
The program started with the Indian National Anthem and infused the spirit of patriotism in the hearts of the diaspora. Sakshi TV Canada Head K.K. Reddy, Sakshi TV staff, business owners, community leaders, representatives of various associations and subject matter experts participated in large numbers. The special AV of Sakshi TV Canada shown on this occasion was watched with great interest by the expatriates. After that, he extended his best wishes to Sakshi TV Canada.
K.K. said that Sakshi TV, which has expanded across North America and grown to become the number one network in America, has now started a new chapter in Canada as well. Reddy said on this occasion. Nischal explained the special programs that will be offered by Sakshi TV Canada.
Simha Zoom, Chief Correspondent of Sakshi TV North America, expressed her joy on the launch of Sakshi TV Canada in Toronto. He hailed it as a great step to make the world hear the heartbeat of Telugu people in Canada. Marketing Manager Vennela Reddy thanked everyone through Zoom. Reena acted as the host for this program.
Many expatriates have given their suggestions and advice on this occasion. KK Reddy thanked everyone who made Sakshi TV Canada launch event a success. Sakshi TV Canada is asked to support and bless it. Praveen Neela, Raj Sazza, Vishwa Srinivasan, Venugopal Rokandla, Pradeep Kumar Kanamaralapudi, Mohammed Siddiqui, Sudhakar Reddy Singhana, Ryan Sekwera, Rajesh Prasad, Ranjith Pingileti, Bhavana Pagidela, Muralidhar Pagidela, Rukmini Maluri, Madhusuddhan Kotturi, Yashwant Vummaneni, Surya Kondeti, Prasanna Tiruchirappalli, Vijay, Lakshmi Rayavarapu, Srinivasulu, Noor Ahmed, Vijay Chegireddy, Kaushik Narala, Srini Izzada, Saujanya Kasula, Pratap B, Vidya Sahithi, Shailesh Palem, Allampathi Krishna Reddy, Vijay Sethumadavan, Shalini Bekkam, Yashwanth Reddy Nimmakayala, Gunasekhar Konapalli, Srinivasulu Reddy Marikkagari Narasimha Reddy Guthireddy, Chenna Keshavareddy Kummetha, Venkata Krishna Reddy Gopireddy, Aslam Baig, Shashivardhan Patholla, Vishnu Vangala, Subbarao Naik Banavatu, Kalyan G, Kayam Purushottam Reddy, VVN Murthy, Ram, Ramesh Thumpera, Bharat Kumar Satthi, Srikanth B, Naren Tadi, Swati Miriyala, Pavani Pulivarthy, Ravi Kasula, Saujanya Kasula, Ram Chimata, Sudhir Kumar Suru, Srinivas Kasturi, Valiuddin, Lakshmi Rayavarapu, Ravinder, Venkat Ram Reddy Palicherla, Gautham Kolluri, Pridhvi, Maheswara Kanala, Naga Venkata Chiranjeevi Chadha, Kranti R, Jagapathi Rayala, Nischal V, Ananth Kandasamy, Nagarjuna, Koteshwar Rao, Venugopal, Manideep and many others participated
