• తీరు మారని వైద్యశాఖ

పెనమలూరు, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి):రాష్ట్రంలో ప్రభుత్వం మారినా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మా త్రం పాతవాసన పోలేదు. కృష్ణాజిల్లా పెనమలూరు పీహెచ్‌సీలో రోగులకు ఓపి పుస్తకాలను పాతవే కొనసాగించడంతోపాటు అప్పటి ముఖ్యమంత్రి జగన్‌, వైఎస్సార్‌ ఫొటోలున్న పుస్తకాలనే ఇస్తున్నారు. వైసీపీ నాయకుల ఫొటోలు ఎక్కడా లేకుండా చూడాలని కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరగా పదేపదే చెబుతున్నా వైద్యాధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.


English Translation
  • Medical department unchanged

Penamaluru, December 21 (Andhra Jyoti):Even though the government has changed in the state, the officials of the medical and health department have not lost their old smell. In Krishna District Penamalur PHC, OP books are being given to the patients and books with photos of the then Chief Minister Jagan and YSR are being given. Although the coalition government has been repeatedly saying for a year and a half that the photos of YCP leaders should be seen everywhere, there is widespread anger that the medical officers are not paying much attention.