ఇంటర్నెట్ డెస్క్:దేశీయ విమానయాన సంస్థ ఇండిగో(IndiGo)లో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల ప్రయాణికులకు రూ.10వేల వరకూ ట్రావెల్ ఓచర్(Travel Voucher) కల్పిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ఆఫర్‌ను చెల్లించేందుకు సిద్ధమైంది ఆ సంస్థ(IndiGo Offer). అయితే.. ఈ ఆఫర్ ఎవరెవరికి వర్తిస్తుంది. ఎలా పొందాలనే పూర్తి వివరాలు మీకోసం...


డిసెంబర్ 3, 4, 5 తేదీలలో తీవ్రంగా ప్రభావితమై విమానాశ్రయాలలో(Airport) ఇరుక్కుపోయిన ప్రయాణికులకు ఉపశమనం కల్పిస్తూ.. ఈ నెల 26 నుంచి రూ.10వేల ట్రావెల్ ఓచర్‌ను జారీ చేయనున్నట్టు ఇండిగో ప్రకటించినట్టు తెలుస్తోంది. విమానయాన సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఒక్కో టికెట్‌కు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పరిహారంగా(Exgratia) చెల్లిస్తామని ఆ కంపెనీ గతంలోనే తెలిపింది. అయితే.. ఈ చెల్లింపులు ఆలస్యం కాకుండా అర్హత ఉన్న ప్రయాణికులందరికీ చేరేలా చూడాలాని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో విమానయాన అధికారులు ఇండిగోకు సూచించినట్టు సమాచారం.


ఇండిగో వెబ్‌సైట్ ద్వారా నేరుగా టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికుల డేటా విమానయాన సంస్థ వద్ద ఉన్నందున... వారందరికీ చెల్లింపులు ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. మిగిలిన ప్రయాణికుల వివరాలను.. ట్రావెల్ ఏజెంట్లు, ఇతర ఆన్‌లైన్ ఏజెన్సీల నుంచి సేకరించి.. ప్రభావిత కస్టమర్లకు ఈ ఆఫర్ వర్తించేలా చేయనున్నారు. వీటి పర్యవేక్షణ బాధ్యతలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌(DGCA)కు అప్పగించగా.. వాటి ఫిర్యాదుల ఆధారంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ ప్రక్రియను పర్యవేక్షించనుంది.


ఇదిలా ఉండగా.. ఇండిగో విమానాలు రద్దయిన తర్వాత టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికుల్లో చాలా మందికి ఆయా ట్రావెల్ ఏజెన్సీల ద్వారా రీఫండ్ ప్రక్రియ ఇంకా పూర్తవలేదని సమాచారం. ఇది విమానయాన సంస్థలు, బుకింగ్ ప్లాట్‌ఫామ్‌ల మధ్య సమన్వయ లోపాన్ని సూచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. డీజీసీఏ ఆదేశానుసారం ఇండిగో చెల్లింపులకు ముందే MakeMyTrip ద్వారా సుమారు రూ.10 కోట్ల మేర రీఫండ్ అయినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.


రైలు టికెట్ల ధరల పెంపు!

బీజేపీ కళ్లద్దాలతో సంఘ్‌ను చూడొద్దు


English Translation

Internet Desk:It is known that in the background of the crisis situation in the domestic airline IndiGo, it has been recently announced that travelers will be provided with a travel voucher of up to Rs.10 thousand. The company is ready to pay that offer (IndiGo Offer). However.. this offer is applicable to whom. The complete details of how to get it are for you...


It seems that Indigo has announced that it will issue a travel voucher of Rs.10 thousand from the 26th of this month, giving relief to the passengers who were severely affected and stuck in the airports on December 3, 4, 5. The company has previously said that they will pay Rs.5 thousand to Rs.10 thousand as compensation (exgratia) for each ticket that complies with the rules of the airline. However, it is reported that in a recent meeting, the officials of the airline advised Indigo that these payments should be made to reach all the eligible passengers without delay.


Since the airline company has the data of the passengers who booked the ticket directly through the Indigo website, it was decided in the meeting to start payments to all of them. The details of the remaining passengers will be collected from travel agents and other online agencies and this offer will be applied to the affected customers. Directorate General of Civil Aviation (DGCA) has been entrusted with the responsibility of monitoring these. Based on their complaints, the Ministry of Civil Aviation will monitor this process.


Meanwhile, it is reported that many of the passengers who have booked tickets after the cancellation of Indigo flights have not yet completed the refund process through the respective travel agencies. This seems to indicate a lack of coordination between airlines and booking platforms. But.. Credible sources have revealed that MakeMyTrip has already refunded around Rs.10 crores before Indigo's payments as per DGCA's order.


Rail ticket price hike!

Don't look at the Sangh through BJP's glasses