Isha Movie: మా అంచనాల్ని నిజం చేసే ఈషా

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఈ ఏడాది తాము విడుదల చేసిన ‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాల తరహాలోనే ‘ఈషా’ తమ అంచనాల్ని తప్పక నిజం చేస్తుందన్నారు వంశీ నందిపాటి, బన్నీ వాస్. ఆ ఇద్దరూ కలిసి ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న చిత్రమే ‘ఈషా’. అఖిల్‌రాజ్, త్రిగుణ్ కథానాయకులు. హెబ్బా పటేల్ కథానాయిక. శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించారు. చిత్రం విడుదలను పురస్కరించుకుని వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.
‘‘ఒకపక్క భయపెడుతూ, మరోపక్క థ్రిల్‌ని పంచే చిత్రమిది. తొలి పది నిమిషాల తర్వాత ఈ సినిమాని మేం ఎందుకు తీసుకున్నామో అందరికీ అర్థం అవుతుంది. గతంలో మేం విడుదల చేసిన ‘లిటిల్‌హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రాల కథలకీ, ‘ఈషా’ కథకీ ఏమాత్రం పొంతన ఉండదు. భిన్నమైన జానర్స్. అయితే మేం ఆ రెండు చిత్రాల కంటెంట్ విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నామో, ఈ సినిమా విషయంలోనూ అంతే! సినిమాని చూడగానే నచ్చేసింది. కథపై నమ్మకంతోనే విడుదల చేయాలని నిర్ణయించాం. మేం ఇద్దరం కలిసి విడుదల చేసిన సినిమాలన్నీ విజయవంతమయ్యాయి. ‘ఈషా’ కూడా మా అంచనాల్ని నిజం చేస్తుంది. చివరి 20 నిమిషాల సన్నివేశాలు ఈ సినిమా ప్రత్యేకమైన అనుభూతిని పంచుతుంది’’.
‘‘సొంతంగా నిర్మించే సినిమాల విషయంలో కొన్నిసార్లు జరిగిందేమో కానీ, పంపిణీదారుగా మాత్రం ఎప్పుడూ మావైపు నుంచి తప్పు జరగలేదు. సినిమా దాదాపుగా పూర్తయ్యాక చూసినప్పుడు దానిపై ఓ కచ్చితమైన అంచనాకి వస్తుంటాం. అందుకే మేం విడుదల చేసే సినిమాల గురి తప్పలేదు. ‘ఈషా’ని కూడా తొలి కాపీ చూసే తీసుకున్నాం. మేం తీసుకునే సినిమాలతో మా ప్రయాణం ఎడిట్ రూమ్ దగ్గర్నుంచి మొదలవుతుంది. నిర్మాణానంతర పనులు ఎలా జరుగుతున్నాయో చూసుకుంటూ, పక్కా ప్రణాళికలతో సినిమాని మార్కెట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. పంపిణీదారుల్ని మించిన బాధ్యతలు మావి. మాదొక కొత్త ట్రెండ్ అని చెప్పొచ్చు. ఇకపై కూడా ఇలాగే మా ప్రయాణం కొనసాగుతుంది. ఈటీవీ విన్‌తో కలిసి భవిష్యత్తులోనూ సినిమాలు చేస్తాం’’.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- అదే బాధగా అనిపిస్తుంది ‘‘మంచి వినోదంతో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన సినిమా ‘హే బల్‌వంత్’’ అన్నారు హీరో సుహాస్. ఇది తన కెరీర్‌లోనే చాలా వేగంగా పూర్తి చేసిన చిత్రమని.. దీనితో తాను ఎదురు చూస్తున్న విజయం అందుకుంటాననే నమ్మకముందని ధీమా వ్యక్తం చేశారు.
- ప్రియమణి.. ఇండో-హాలీవుడ్ చిత్రం తెరపై వైవిధ్యమైన పాత్రలతో భావోద్వేగాలను పంచడంతోపాటు.. యాక్షన్ సన్నివేశాలతోనూ అదరగొడుతుంది నటి ప్రియమణి. ఇప్పుడామె ఖాతాలో ఓ హాలీవుడ్ నిర్మాణసంస్థ రూపొందించనున్న కొత్త ప్రాజెక్ట్ చేరింది.
- బాలీవుడ్ వైపు తొలి అడుగు? గతేడాది ‘మదరాసి’, ‘కాంతార 2’ లాంటి చిత్రాలతో మంచి విజయాన్ని అందుకుంది కథానాయిక రుక్మిణీ వసంత్. చిత్రపరిశ్రమకు వచ్చిన తక్కువ రోజుల్లోనే భాషతో సంబంధం లేకుండా అవకాశాల్ని అందుకుంటోన్న ఈ భామ..
- జోడీ కుదిరేనా! గతేడాది ‘జాక్’, ‘తెలుసు కదా’ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడు మరో కొత్త సినిమాని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
- మరకతమణి 2కి శ్రీకారం ఆది పినిశెట్టి నుంచి వచ్చిన ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ ‘మరకతమణి’ 2017లో విడుదలై.. ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా ‘మరకతమణి 2’ని పట్టాలెక్కించారు ఆది.
- ఆ పాటలు వాడొద్దు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. సరిగమ సంగీత సంస్థకు, ఆయనకు కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ కేసుకు సంబంధించి దిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
- వెబ్‌సిరీస్ కోసం! ‘క’, ‘కె-ర్యాంప్’ విజయాలతో జోరు మీదున్నారు యువ హీరో కిరణ్ అబ్బవరం. ఇప్పుడాయన ఓటీటీలోకి తొలి అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘డియర్ కామ్రేడ్’ ఫేమ్ భరత్ కమ్మ దర్శకత్వంలో ముస్తాబు
- గ్రామీణ కథ ‘సెయాన్’ ‘సెయాన్’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు శివ కార్తికేయన్. ‘అమరన్’ విజయం తర్వాత ఆయన.. కమల్‌హాసన్ సొంత నిర్మాణ సంస్థలో చేస్తున్న రెండో చిత్రమిది. శివకుమార్ మురుగేశన్ తెరకెక్కిస్తున్నారు.
- అలియాకు బాఫ్టా గౌరవం ప్రముఖ బాలీవుడ్ కథానాయిక అలియా భట్‌కు మరోసారి అంతర్జాతీయ గౌరవం దక్కింది. బాఫ్టా(బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్) 79వ ఎడిషన్ పురస్కారాలను అందించే ప్రెజెంటర్ల జాబితాను ప్రకటించింది.
- సంక్షిప్త వార్తలు (5) ప్రముఖ హిందీ సినీ రచయిత, నటుడు, సల్మాన్‌ఖాన్ తండ్రి సలీం ఖాన్(90) అనారోగ్య పరిస్థితుల కారణంగా మంగళవారం ముంబయిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. జావేద్ అక్తర్‌తో కలిసి ఆయన రచన చేసిన ‘షోలే’, ‘దీవార్’, ‘డాన్’ చిత్రాలు భారతీయ చిత్రసీమలో నిలిచిపోయాయి.
English Translation

This year they released 'Little Hearts', 'Raju Vamsi Nandipati and Bunny Vaas said that 'Esha' will definitely live up to their expectations just like 'Weds Rambai'. The film 'Esha' is being brought to the audience on 25th of this month together. Akhilraj and Trigun are the protagonists. Hebba Patel is the heroine. Directed by Srinivas Manne. Vamsi Nandipati and Bunny Vas interacted with reporters in Hyderabad on Sunday to celebrate the release of the film.
''This is a film that is both scary and thrilling. After the first ten minutes, everyone will understand why we took this movie. The stories of 'Littlehearts', 'Raju Weds Rambai' and the story of 'Esha', which we have released in the past, are not at all comparable. Different genres. But as confident as we are about the content of those two films, we are equally confident about this film! Loved the movie as soon as I saw it. We decided to release it with faith in the story. All the films released by both of us were successful. 'Esha' also lives up to our expectations. The last 20 minutes of the scenes give the film a special feel."
''It has sometimes happened in the case of self-produced films, but as a distributor, there has never been a mistake from our side. We will come to an accurate estimate of the film when we see it almost completed. That's why the movies we release are not out of the question. We also took the first copy of 'Esha'. Our journey with the films we make starts from the edit room. We will take care of how the post-production works are going and market the film with firm plans and bring it to the audience. We have responsibilities beyond distributors. We can say that we are a new trend. Our journey will continue like this. We will make films with ETV Win in the future as well.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different
It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/
OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no need for correspondence in this matter.
"Hey Balwant is a movie full of good entertainment and strong emotions," said hero Suhas. Dhima confidently expressed that this is the fastest film she has completed in her career. She is confident that she will get the success she is waiting for.
Apart from sharing emotions with various roles on screen, actress Priyamani also entertains with action scenes. Now a new project to be made by a Hollywood production company has been added to her account.