ధమాకాకు సిద్ధం!

Eenadu icon
By Telangana Dist. Desk Updated : 22 Dec 2025 05:45 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఈనాడు - హైదరాబాద్‌: కళాశాల కుర్రాళ్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ధనిక్‌ భారత్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ప్రెజెంట్స్‌ ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌-2025’ క్రికెట్‌ టోర్నీకి సమయం ఆసన్నమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కళాశాలల జట్లు బరిలో దిగే ఈఎస్‌ఎల్‌ క్రికెట్‌ కప్‌ సోమవారమే ఆరంభం కాబోతోంది. ఈసారి రెండు రాష్ట్రాల నుంచి వెయ్యికి పైగా జట్లు టోర్నీలో బరిలోకి దిగుతుండడం విశేషం. మొదట జిల్లా స్థాయిలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అనంతరం ప్రాంతీయ స్థాయి టోర్నీ జరుగుతుంది. ప్రాంతీయ విజేతలు అంతర్‌ రాష్ట్ర స్థాయి లీగ్‌లో తలపడతాయి. సీనియర్స్, జూనియర్స్‌ విభాగాల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు గ్రాండ్‌ ఫైనల్స్‌లో పోటీపడతాయి. హైదరాబాద్‌లో తొలి రోజు 18 జూనియర్‌ కళాశాలల జట్ల మధ్య తొమ్మిది మ్యాచ్‌లు జరగనున్నాయి. ఉదయం 9కి మ్యాచ్‌లు మొదలవుతాయి. ఈ మ్యాచ్‌లన్నీ పిర్జాదిగూడ బాబూరావు సాగర్‌ గ్రౌండ్స్‌లో జరుగుతాయి. ఈసారి విజేతలు, రన్నరప్‌లకు ట్రోఫీలకు తోడు టోర్నీలో బ్యాటుతో, బంతితో అసాధారణ ప్రతిభ కనబరిచే క్రికెటర్లకు బైక్‌లు బహమతులుగా దక్కనున్నాయి. సీనియర్స్, జూనియర్స్‌ విభాగాల్లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’లుగా నిలిచే ఆటగాళ్లకు చెరో బైక్‌ లభించనుంది.

నేటి మ్యాచ్‌లు

  • భవన్స్‌ శ్రీ అరబిందో జూనియర్‌ కళాశాల, సైనిక్‌పురి × మహవీర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, బండ్లగూడ (ఉదయం 9 నుంచి)
  • వెస్లీ బాయ్స్‌ జూనియర్‌ కళాశాల, సికింద్రాబాద్‌ × చైతన్య  జూనియర్‌ కళాశాల, శంకరపల్లి (మధ్యాహ్నం 12 నుంచి)
  • సెయింట్‌ మేరీస్‌ జూనియర్‌ కళాశాల, మాదాపూర్‌ × శ్రీ ఆదర్శ్‌ జూనియర్‌ కళాశాల, సికింద్రాబాద్‌ (మధ్యాహ్నం 2 నుంచి)
  • డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జూనియర్‌ కళాశాల, బాగ్‌లింగంపల్లి  × శ్రీ అమృత జూనియర్‌ కళాశాల, వెంగళరావు నగర్‌ (ఉదయం 9 నుంచి)
  • గ్లోబల్‌ జూనియర్‌ కళాశాల, తార్నాక × ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, విద్యానగర్‌ (మధ్యాహ్నం 2 నుంచి)
  • బన్సల్‌ జూనియర్‌ కళాశాల, హబ్సిగూడ × గౌతమి జూనియర్‌ కళాశాల, జీడిమెట్ల (మధ్యాహ్నం 2 నుంచి)
  • లయోలా అకాడమీ జూనియర్‌ కళాశాల, అల్వాల్‌ × వేద జూనియర్‌ కళాశాల, చంపాపేట (ఉదయం 9 నుంచి)
  • సక్సెస్‌ జూనియర్‌ కళాశాల, సంతోష్‌ నగర్‌ × సంకల్ప్‌ జూనియర్‌ కళాశాల, బాలాపూర్‌ (మధ్యాహం్న 12 నుంచి)
  • సెయింట్‌ మేరీస్‌ జూనియర్‌ కళాశాల, బషీర్‌బాగ్‌ × శ్రీ ఆదర్శ్‌ జూనియర్‌ కళాశాల, కూకట్‌పల్లి (మధ్యాహ్నం 2 నుంచి)
► Read latest Hyderabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 02:31 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి [ 18-02-2026] షాద్‌నగర్‌లో మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.
  • మా పూర్వీకులు తప్పు చేశారు.. క్షమించండి: విజయేంద్రప్రసాద్‌ [ 18-02-2026] ‘మాది సంపన్న కుటుంబం.. అయితే నాకు తెలిసీ ఎప్పుడూ తప్పు చేయలేదు.. మా పూర్వీకులు అంటరానితనం పేరుతో నోటితో చెప్పలేని భయంకరమైన దారుణాలు చేశార’ని ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు.
  • నిరీక్షణ జాబితాలో ఉన్నా.. టికెట్‌ పక్కా! [ 18-02-2026] రైల్వే ప్రయాణికుల ‘బెర్త్‌ కన్ఫర్మేషన్‌’ అవకాశాలు పెంచే ‘వికల్ప్‌’ని ఎక్కువ మంది వినియోగించుకోవాలని రైల్వే సూచిస్తోంది.
  • పీఠముడి [ 18-02-2026] 24 వార్డులున్న ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో భారాస 13 స్థానాలు, కాంగ్రెస్‌ 8, భాజపా 2 స్థానాల్లో గెలవగా.. ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. సోమవారం 23 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు.
  • రీల్స్‌తో ఆకట్టు.. ఖాతాలు కొల్లగొట్టు [ 18-02-2026] చేతిలో సెల్‌ఫోన్‌ ఉంటే చాలు.. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, టెలిగ్రామ్, ఎక్స్, వాట్సప్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టే అంశాలను వెతుకుతారు. ఇన్‌ఫ్ల్యూయెన్సర్ల వీడియోలు.. ప్రముఖులు పంచుకునే అంశాల్లో మునిగిపోతుంటారు.
  • అంధులకు ఆసరా... గర్భిణులకు భరోసా [ 18-02-2026] మాదాపూర్‌ హైటెక్స్‌లో మంగళవారం ప్రారంభమైన బయోఏషియా-2026 సదస్సులో పలు ఆవిష్కరణలు ఆసక్తి రేకెత్తించాయి. రోడ్డు దాటేందుకు అంధులకు ఉపయోగపడేలా, గర్భంలో శిశువు ఎదుగుదలను తెలియజెప్పి గర్భిణులకు భరోసాగా నిలిచేలా..
  • సోషల్‌ మీడియా మత్తులో పడి.. పోలీసులకు చిక్కి [ 18-02-2026] సోషల్‌ మీడియా మత్తులో పడి లైక్‌ల కోసం దేవుడి ముందు మత్తు పదార్థాలను ప్రసాదంగా చూపుతూ రీల్స్‌ చేసిన ఇద్దరు యువకులు పోలీసులకు చిక్కారు.
  • కడుపులో రాడ్లు దిగిన వ్యక్తికి పునర్జన్మ [ 18-02-2026] ప్రమాదవశాత్తు మేడపై నుంచి కిందపడిన వ్యక్తి కడుపులో రెండు ఇనుపచువ్వలు గుచ్చుకున్నాయి. అరుదైన శస్త్రచికిత్స చేసి ఆ వ్యక్తికి పునర్జన్మను ప్రసాదించారు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు.
  • ఏఐ.. ఆటొమేషన్‌తో వైద్య రంగంలో పెనుమార్పులు [ 18-02-2026] ‘ప్రపంచ ఆరోగ్య ముఖచిత్రం వేగంగా మారిపోతోంది. నిన్నటి వరకూ అసాధ్యమనుకున్న చికిత్సలు నేడు ‘టెక్‌-బయో’ విప్లవంతో సుసాధ్యమవుతున్నాయి.
  • చింతల్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు [ 18-02-2026] జీహెచ్‌ఎంసీ చింతల్‌ సర్కిల్‌ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వాహీద్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.
  • 36.8 కి.మీ దూరం.. 25 నిమిషాలు [ 18-02-2026] హైదరాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి  ఊపిరితిత్తుల మార్పిడి కోసం మంగళవారం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి బేగంపేట వరకు మంగళవారం సాయంత్రం ఆర్జీఐఏ ట్రాఫిక్‌ పోలీసులు గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేశారు.
  • పైప్‌లైన్‌ ధ్వంసం.. సెల్లార్లలోకి నీరు [ 18-02-2026] మణికొండలో భారీ పైప్‌లైన్‌ ధ్వంసం కావడంతో పలు కాలనీల్లోని అపార్టుమెంట్ల సెల్లార్లలోకి పెద్దఎత్తున వరదనీరు చేరింది.
  • మరో ప్రీలాంచ్‌ మోసం [ 18-02-2026] రాజధానిలో భారతి బిల్డర్స్‌ సంస్థ మరో ప్రీలాంచ్‌ మోసం బయటపడింది. ‘రెండేళ్లలో మీ పెట్టుబడి రెట్టింపు చేసుకోండి..’అంటూ భారతి బిల్డర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.5.39 కోట్ల డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసింది.
  • భవనాలకూ ఆధార్‌ [ 18-02-2026] ప్రతి మనిషికీ విశిష్ట గుర్తింపు సంఖ్యతో ఆధార్‌కార్డు జారీ అయినట్లు.. నగరంలోని ప్రతి భవనానికి కూడా క్యూఆర్‌ కోడ్, విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ కాబోతుంది.
  • హోర్డింగ్‌లపై నిషేధం ఎత్తివేత! [ 18-02-2026] నగరంలో మళ్లీ హోర్డింగ్‌లు ఏర్పాటు కాబోతున్నాయి. ప్రజల భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయనే కారణంతో గత సర్కారు..
  • త్వరలో జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో.. ఏఐ చాట్‌బాట్‌ [ 18-02-2026] నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకోవడం ఎలా, జనన, మరణ ధ్రువపత్రాలు పొందాలంటే ఏయే పత్రాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి తదితర సందేహాలను నివృత్తి చేసుకునేందుకు అధికారుల వద్దకు వెళ్లనక్కర్లేదు.
  • నిబంధనలకు విరుద్ధంగా అధిక బిల్లు [ 18-02-2026] కొవిడ్‌-19 చికిత్స పేరుతో అధిక బిల్లు వసూలు చేసిన  ఓల్డ్‌ బోయిన్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌-2 మందలించింది.
  • భార్య చికెన్‌ వండలేదని విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్య [ 18-02-2026] అతడో డిఫెన్స్‌ విశ్రాంత ఉద్యోగి.. చికెన్‌ తీసుకుని ఇంటికెళ్లాడు.. ఘుమఘుమలాడే చికెన్‌ కూర వండాలని భార్యకు చెప్పాడు.. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.
  • సిటీ ఏసీ బస్సుల్లో 30% ఛార్జీల తగ్గింపు! [ 18-02-2026] నగరంలో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. మార్చి నుంచి ఎండలు తీవ్రం కానున్న నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు ఛార్జీల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.