ఇదేం చలిరా బాబు..!

- A
- A+
- A++

ఈనాడు, హైదరాబాద్: నగరంలో చలి తీవ్రత కొనసాగుతోంది. రాత్రిపూట శివార్లు చలికి గజగజ వణుకుతున్నాయి. సాధారణం కంటే ఐదారు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. పటాన్‌చెరులో అత్యల్పంగా 7.2 డిగ్రీలు నమోదైంది. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 8.3, రాజేంద్రనగర్‌లో 9.0, మల్కాజిగిరిలో 9.1, అల్వాల్‌లో 10.3, చందానగర్‌లో 10.4, కుత్బుల్లాపూర్‌లో 10.7, గాజులరామారంలో 10.8, సికింద్రాబాద్‌లో 11.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నేటి నుంచి తగ్గే సూచన
సోమవారం నుంచి చలి తీవ్రత తగ్గే అవకాశం ఉందని తెలంగాణ ప్రణాళికాభివృద్ధి సొసైటీ(టీజీడీసీఎస్) తెలిపింది. రాగల మూడు రోజులు 10 నుంచి 12 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. సంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ శీతల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉన్ని దుస్తులకు పెరిగిన గిరాకీ
ఇళ్లలో వెచ్చదనం కోసం హీటర్లను కొనుగోలు చేస్తున్నారు. వేడుకల్లో సైతం ఆరు బయట హీటర్ల ఏర్పాటు అనివార్యంగా ఏర్పడటంతో వీటి గిరాకీ గతంలో కంటే పెరిగింది. ఆదివారం అంగడిలో ఉన్ని దుస్తుల కొనుగోలు, ఇయర్ మఫ్స్‌కి గిరాకీ పెరిగింది. చర్మం పొడిబారుతుండటంతో వైద్యుల సూచనల మేరకు మాయిశ్చరైజర్లు కొంటున్నారు. వీటన్నింటిని ఆన్‌లైన్‌లోనూ పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు.
► Read latest Hyderabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 06:36 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
English Translation
This is Chalira Babu..!

- A
- A+
- A++

Today, Hyderabad: Cold weather continues in the city. At night the suburbs are shivering with cold. Five or six degrees less than normal. Patancheru recorded a low of 7.2 degrees. Minimum temperatures were recorded at 8.3 degrees in Central University, 9.0 in Rajendranagar, 9.1 in Malkajigiri, 10.3 in Alwal, 10.4 in Chandanagar, 10.7 in Kuthbullapur, 10.8 in Gajularamaram and 11.2 in Secunderabad.
Forecast to decrease from today
The Telangana Planning Development Society (TGDCS) said that the cold intensity is likely to decrease from Monday. The minimum temperature is likely to be between 10 and 12 degrees for the next three days. Hyderabad Meteorological Center has said that cold winds are likely to blow here and there in Sangareddy district.
Increased demand for woolen clothes
Heaters are being bought for warmth in homes. The demand for these has increased more than before as the installation of six outdoor heaters is inevitable even during celebrations. Purchase of woolen clothes and ear muffs increased in Sunday market. Moisturizers are being bought as per doctor's instructions as the skin is getting dry. All these are being bought online in large scale.
► Read latest Hyderabad Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 06:36 ISTNote:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. No correspondence in this matter.