Actresses: మెరిశారు అందరూ... అదిరింది గ్లామరు...

Eenadu icon
By Cinema Desk Updated : 22 Dec 2025 03:49 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
5 min read

కథానాయికలంతా కళ్లముందుకొచ్చారు. అందంతో కవ్వించారు, కనువిందు చేశారు. కొద్దిమంది నటనతోనూ కట్టిపడేశారు. ఫలితాలతో సంబంధం లేకుండా ఇటు ప్రేక్షకుల్నీ... అటు పరిశ్రమనీ ఆకర్షించారు. అది అతిథి పాత్ర కావొచ్చు, పూర్తిస్థాయి కథానాయిక పాత్ర కావొచ్చు.... ఒకరిద్దరు మినహా ఎప్పట్నుంచో తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న కథానాయికలు సైతం ఈ ఏడాది తెరపై మెరిశారు.

ఇంతకుముందు ఒక భాష నుంచి అవకాశం వచ్చిందంటే... మరో భాషకు దూరం కావల్సి వచ్చేది. దాంతో ఎక్కడ మంచి అవకాశం వచ్చిందనిపిస్తే అక్కడ సినిమాలు చేస్తూ కథానాయికలు బిజీ అయిపోయేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏ భాషలో సినిమా చేసినా సరే, అది రెండు మూడు భాషల్లో విడుదల కావడం ఇప్పుడు చాలా సాధారణమైన విషయంగా మారింది. పాన్‌ ఇండియా ట్రెండ్‌ పుణ్యమే అదంతా. అందుకే కథానాయికలు ఎక్కడ సినిమా చేసినా సరే... పొరుగు భాషలోనూ వాళ్ల హాజరు పడిపోతుంటుంది. దాంతో 2025లో కథానాయికలంతా మన కళ్ల ముందు ఉన్నట్టే అనిపించారు.   

అందం... అభినయం

కొత్తతరం కథానాయికలైన శ్రీనిధిశెట్టి, మీనాక్షి చౌదరి, భాగ్యశ్రీ బోర్సే, ఐశ్వర్య రాజేశ్‌ ఈ ఏడాది పలు కీలకమైన సినిమాలతో మెరిశారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌  ‘సంక్రాంతికి వస్తున్నాం’తో విజయాన్ని సొంతం చేసుకున్నారు. కొత్త అవకాశాల్నీ అందుకున్నారు. శ్రీనిధి శెట్టి ‘హిట్‌ 3’, ‘తెలుసు కదా’ సినిమాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం వెంకటేశ్‌తో కలిసి ‘ఆదర్శకుటుంబం హౌస్‌ నెంబర్‌: 47’లో నటిస్తోంది. భాగ్యశ్రీ బోర్సే ‘కాంత’, ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ చిత్రాలతో అటు అందంతోనూ, ఇటు నటనతోనూ కట్టిపడేసింది.

ఈ ఏడాది ఎక్కువగా మాట్లాడుకునేలా చేసిన కథానాయిక రుక్మిణీ వసంత్‌. ‘కాంతార: చాప్టర్‌ 1’తో కట్టిపడేయడంతోపాటు, ఆమె తెలుగులో ఎన్టీఆర్‌ -  ప్రశాంత్‌ నీల్‌ కలయికలో వస్తున్న సినిమాలో నటిస్తుండడమే అందుకు కారణం. ఆమె శివకార్తికేయన్‌తో కలిసి నటించిన ‘మదరాసి’, విజయ్‌ సేతుపతితో చేసిన ‘ఏస్‌’ సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకూ వచ్చాయి. పవన్‌కల్యాణ్‌తో కలిసి ‘ఓజీ’లో నటించిన ప్రియాంక మోహన్‌ మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. సంయుక్త ‘అఖండ2: తాండవం’తో మెరిసింది. సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’తో సందడి చేయనున్న ఆమె ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో సినిమా చేస్తోంది. ‘మిరాయ్‌’ భామ రితికా నాయక్‌ ఓ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో ఆమెకు గుర్తింపు లభించినట్టైంది. ప్రస్తుతం వరుణ్‌తేజ్‌తోనూ, ఆనంద్‌ దేవరకొండతోనూ కలిసి నటిస్తోంది. నిధి అగర్వాల్‌ ‘హరి హర వీర మల్లు’తో సందడి చేసింది. కొన్నేళ్లుగా తెలుగుకు ప్రాధాన్యమిస్తూ ప్రయాణం చేస్తున్న కియారా ఈ ఏడాది ‘గేమ్‌ ఛేంజర్‌’తో తెలుగులో మెరిసింది. ఆమె హృతిక్, ఎన్టీఆర్‌ సినిమా ‘వార్‌ 2’తోనూ తెలుగు ప్రేక్షకులపై ప్రభావం చూపించింది. 

సీనియర్లంతా వచ్చారు... 

రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హిందీలోనే బిజీ కావడంతో ఈసారి తెలుగు తెరపై కనిపించలేదు కానీ, అనుష్క మాత్రం మళ్లీ తన మార్క్‌ సినిమా ‘ఘాటి’తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. చాలా రోజులుగా తెరపై కనిపించని సమంత ‘శుభం’ సినిమాలో అతిథి పాత్రతో సందడి చేసింది. ఆ చిత్రానికి ఆమే నిర్మాత. కాజల్‌ అగర్వాల్‌ ‘కన్నప్ప’లో పార్వతిగా నటించారు. సల్మాన్‌ఖాన్‌ ‘సికందర్‌’లో ఓ పాత్ర చేశారు. తమన్నా ‘ఓదెల 2’తో మెరిసింది. శ్రుతిహాసన్‌ ‘కూలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.

అందులోనే పూజా హెగ్డే ప్రత్యేక గీతం చేసి అలరించారు. ఆమె ఈ ఏడాది సూర్యతో కలిసి చేసిన ‘రెట్రో’ తెలుగులోనూ విడుదలైంది. నాయికా ప్రధానమైన కథలతో తెరకెక్కిన ‘రివాల్వర్‌ రీటా’, ‘ఉప్పు కప్పురంబు’ చిత్రాలతో కీర్తిసురేశ్‌ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో కలిసి నటిస్తున్నారు. ‘డాకు మహారాజ్‌’ చిత్రంతో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, కొన్ని అనువాద చిత్రాలతో నిత్యమేనన్‌ సందడి చేశారు. 

2025లో ఎక్కువ సినిమాలతో సందడి చేసిన కథానాయిక... రష్మిక. నేరుగా ఆమె తెలుగులో చేసిన సినిమాలు ‘కుబేర’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ చిత్రాలే అయినా, హిందీలో ఆమె చేసిన ‘ఛావా’ తెలుగు ప్రేక్షకుల్నీ అలరించింది. ‘సికందర్‌’, ‘థమ్మా’ చిత్రాలు కూడా తెలుగులో విడుదలయ్యాయి. ఇలా మొత్తం ఆమె ఖాతాలో ఈ ఏడాది ఐదు సినిమాలు పడిపోయాయి. ప్రస్తుతం తెలుగులో ‘మైసా’, హిందీలో ‘కాక్‌టెయిల్‌ 2’ సినిమాలు చేస్తున్నారు.

అలా సంఖ్య పరంగా చూస్తే ఆ తర్వాత స్థానం అనుపమ పరమేశ్వరన్‌ సొంతం. తెలుగులో ఆమె చేసిన ‘పరదా’, ‘కిష్కింధపురి’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అనువాదాలుగా విడుదలైన ‘డ్రాగన్‌’, ‘బైసన్‌’ చిత్రాలూ తెలుగు ప్రేక్షకుల దృష్టిని ప్రముఖంగా ఆకర్షించాయి. శ్రీలీల నేరుగా తెలుగులోనే మూడు సినిమాలు చేశారు. అందులో ఒకటి ‘రాబిన్‌హుడ్‌’, మరొకటి ‘మాస్‌ జాతర’. మూడవది ‘జూనియర్‌’. అంచనాల మేరకు ఫలితాలు రాకపోయినా శ్రీలీల అవకాశాల విషయంలో మాత్రం జోరును ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ఆమె హిందీలో ఎక్కువ అవకాశాల్ని సొంతం చేసుకొంటోంది.

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 02:41 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • అదే బాధగా అనిపిస్తుంది ‘‘మంచి వినోదంతో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన సినిమా ‘హే బల్‌వంత్‌’’ అన్నారు హీరో సుహాస్‌. ఇది తన కెరీర్‌లోనే చాలా వేగంగా పూర్తి చేసిన చిత్రమని.. దీనితో తాను ఎదురు చూస్తున్న విజయం అందుకుంటాననే నమ్మకముందని ధీమా వ్యక్తం చేశారు.
  • ప్రియమణి.. ఇండో-హాలీవుడ్‌ చిత్రం తెరపై వైవిధ్యమైన పాత్రలతో భావోద్వేగాలను పంచడంతోపాటు.. యాక్షన్‌ సన్నివేశాలతోనూ అదరగొడుతుంది నటి ప్రియమణి. ఇప్పుడామె ఖాతాలో ఓ హాలీవుడ్‌ నిర్మాణసంస్థ రూపొందించనున్న కొత్త ప్రాజెక్ట్‌ చేరింది.
  • బాలీవుడ్‌ వైపు తొలి అడుగు? గతేడాది ‘మదరాసి’, ‘కాంతార 2’ లాంటి చిత్రాలతో మంచి విజయాన్ని అందుకుంది కథానాయిక రుక్మిణీ వసంత్‌. చిత్రపరిశ్రమకు వచ్చిన తక్కువ రోజుల్లోనే భాషతో సంబంధం లేకుండా అవకాశాల్ని అందుకుంటోన్న ఈ భామ..
  • జోడీ కుదిరేనా! గతేడాది ‘జాక్‌’, ‘తెలుసు కదా’ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడు మరో కొత్త సినిమాని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
  • మరకతమణి 2కి శ్రీకారం ఆది పినిశెట్టి నుంచి వచ్చిన ఫాంటసీ కామెడీ థ్రిల్లర్‌ ‘మరకతమణి’ 2017లో విడుదలై.. ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా ‘మరకతమణి 2’ని పట్టాలెక్కించారు ఆది.
  • ఆ పాటలు వాడొద్దు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. సరిగమ సంగీత సంస్థకు, ఆయనకు కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ కేసుకు సంబంధించి దిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
  • వెబ్‌సిరీస్‌ కోసం! ‘క’, ‘కె-ర్యాంప్‌’ విజయాలతో జోరు మీదున్నారు యువ హీరో కిరణ్‌ అబ్బవరం. ఇప్పుడాయన ఓటీటీలోకి తొలి అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘డియర్‌ కామ్రేడ్‌’ ఫేమ్‌ భరత్‌ కమ్మ దర్శకత్వంలో ముస్తాబు
  • గ్రామీణ కథ ‘సెయాన్‌’ ‘సెయాన్‌’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు శివ కార్తికేయన్‌. ‘అమరన్‌’ విజయం తర్వాత ఆయన.. కమల్‌హాసన్‌ సొంత నిర్మాణ సంస్థలో చేస్తున్న రెండో చిత్రమిది. శివకుమార్‌ మురుగేశన్‌ తెరకెక్కిస్తున్నారు.
  • అలియాకు బాఫ్టా గౌరవం ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక అలియా భట్‌కు మరోసారి అంతర్జాతీయ గౌరవం దక్కింది. బాఫ్టా(బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌) 79వ ఎడిషన్‌ పురస్కారాలను అందించే ప్రెజెంటర్ల జాబితాను ప్రకటించింది.
  • సంక్షిప్త వార్తలు (5) ప్రముఖ హిందీ సినీ రచయిత, నటుడు, సల్మాన్‌ఖాన్‌ తండ్రి సలీం ఖాన్‌(90) అనారోగ్య పరిస్థితుల కారణంగా మంగళవారం ముంబయిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. జావేద్‌ అక్తర్‌తో కలిసి ఆయన రచన చేసిన ‘షోలే’, ‘దీవార్‌’, ‘డాన్‌’ చిత్రాలు భారతీయ చిత్రసీమలో నిలిచిపోయాయి.

English Translation

Actresses: everyone shined... there was glamour...

Eenadu icon
By Cinema Desk Updated : 22 Dec 2025 03:49 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
5 min read

All the heroines came forward. Enchanted with beauty, feasted the eyes. A few are also hooked on acting. Irrespective of the results, they attracted the audience and the industry. It may be a guest role, it may be a full-fledged heroine role.... Except for one or two heroines, who have been away from Telugu films since then, also shined on the screen this year.

Inearlier if there was an opportunity from one language... it would have required a distance to another language. If there was a good opportunity, the heroines would get busy making films there. Now that is not the case. No matter which language a film is made in, it has become very common for it to be released in two or three languages. All that is thanks to the Pan India trend. That's why, no matter where the heroines make a film...even in the neighboring language, their attendance drops. So in 2025, all the heroines seemed to be in front of our eyes.   

Beauty... acting

New generation heroines Srinidhishetty, Meenakshi Chaudhary, Bhagyashree Borse and Aishwarya Rajesh shone with many important films this year. Meenakshi Choudhary and Aishwarya Rajesh have won success with 'Sankranti Akanaam'. Received new opportunities. Srinidhi Shetty impressed with the movies 'Hit 3' and 'Telusu Kada'. Currently, she is acting in 'Aadharutumbam House No: 47' with Venkatesh. Bhagyashree Borse got hooked on her beauty and acting with the films 'Kanta' and 'Andhra King Taluka'.

This year's most talked about actress Rukmini Vasant. The reason for that is that besides being tied up with 'Kantara: Chapter 1', she is acting in a Telugu film with NTR-Prashanth Neel. She starred in 'Madarasi' with Sivakarthikeyan and 'Ace' with Vijay Sethupathi also came before the Telugu audience. Priyanka Mohan, who starred in 'Oji' with Pawan Kalyan, once again attracted the attention of the audience. Samyukta shone with 'Akhanda 2: Tandavam'. She is currently doing a film under the direction of Puri Jagannath, who is going to create buzz for Sankranti with 'Nari Naari Naduma Murari'. Ritika Naik, sister of 'Mirai', has a huge success in her account. With this movie, she got recognition at pan India level. Currently acting with Varun Tej and Anand Deverakonda. Nidhi Aggarwal created a buzz with 'Hari Hara Veera Mallu'. Kiara, who has been traveling by preferring Telugu for several years, shined in Telugu this year with 'Game Changer'. She also made an impact on the Telugu audience with Hrithik and NTR's movie 'War 2'. 

All the seniors have come...

Rakulpreet Singh is busy in Hindi but Anushka did not appear on Telugu screen this time. Again she came in front of the Telugu audience with her mark movie 'Ghati'. Samantha, who has not been seen on the screen for many days, made noise with a guest role in the movie 'Shubham'. She is the producer of that film. Kajal Aggarwal acted as Parvati in 'Kannappa'. Salman Khan played a role in 'Sikandar'. Tamannaah shone with 'Odela 2'. Shruti Haasan came in front of the audience with the film 'Coolie'.

Pooja Hegde entertained with a special song. This year her 'Retro' with Suriya was also released in Telugu. Keerthisuresh came in front of the audience with the films 'Revolver Rita' and 'Uppu Cupprambu', which were made with the heroine's main stories. Currently acting with Vijay Deverakonda. Pragya Jaiswal, Shraddha Srinath and Nithya Menon created buzz with the movie 'Daku Maharaj'. 

rounded">

2025's heroine with more movies... Rashmika. Although her direct films in Telugu were 'Kubera' and 'The Girlfriend', her Hindi film 'Chaava' entertained the Telugu audience. The films 'Sikandar' and 'Thamma' were also released in Telugu. In total, five films fell in her account this year. Currently, they are doing 'Maisa' in Telugu and 'Cocktail 2' in Hindi.

In terms of numbers, Anupama Parameswaran is next. Her films 'Parada' and 'Kishkindhapuri' in Telugu came before the audience. The films 'Dragon' and 'Bison', which were released as translations, also attracted the attention of the Telugu audience. Srileela did three films directly in Telugu. One of them is 'Robinhood' and the other is 'Mas Jatara'. The third is 'Junior'. Even if the results are not as expected, Srilila is showing strength in terms of opportunities. Especially she is getting more opportunities in Hindi.

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, href="https://www.instagram.com/eenadulivenews/?hl=en" target="_blank" rel="noopener">Instagram& Google News. Tags :Published : 22 Dec 2025 02:41 IST

Note:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no need for correspondence in this matter. "Hey Balwant is a movie full of good entertainment and strong emotions," said hero Suhas. Dhima confidently expressed that this is the fastest film she has completed in her career. She is confident that she will get the success she is waiting for. Apart from sharing emotions with various roles on screen, actress Priyamani also entertains with action scenes. Now a new project to be made by a Hollywood production company has been added to her account.

  • First step towards Bollywood? Last year, heroine Rukmini Vasant got good success with films like 'Madrasi' and 'Kanthara 2'. This Bhama who is getting opportunities regardless of language within few days of entering the film industry..
  • Jodi Kudirena! Last year, protagonist Sidhu Jonnalagadda greeted the audience with the films 'Jack' and 'Telusu Kada'. Now they are gearing up for another new movie.
  • Marakatamani 2 starts It is known that Adi Pinishetti's fantasy comedy thriller 'Marakathamani' was released in 2017 and entertained the audience. Now Adi has released 'Marakatamani 2' as a sequel to the movie.
  • Don't use those songs. Noted music director Ilayaraja was arrested in the court. For Sarigama Music Company, he has a dispute going on in the court. The Delhi High Court has issued an interim order in this case.
  • For the webseries! Young hero Kiran Abbavaram is on a roll with the success of 'Ka' and 'K-Ramp'. Now he is preparing to take his first step into OTT. Mustabu
  • rural story 'Sean' directed by Bharat Kamma of 'Dear Comrade' fame. Protagonist Siva Karthikeyan is preparing to entertain the audience with the movie 'Seyan'. After the success of 'Amaran', this is Kamal Haasan's second film under his own production house. Sivakumar Murugesan is directing.
  • BAFTA honor for Alia Popular Bollywood actress Alia Bhatt has once again received international recognition. BAFTA (British Academy of Film and Television Arts) has announced the list of presenters for the 79th edition of the awards.
  • News in Brief (5) Famous Hindi film writer, actor, Salman Khan's father Salim Khan (90) was admitted to a private hospital in Mumbai on Tuesday due to health conditions. His films 'Sholay', 'Deewar' and 'Don', which he wrote with Javed Akhtar, became a hit in the Indian cinema.