Andhra News: అనాథల చదువుకు చుక్కాని..‘హీల్‌’

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 22 Dec 2025 05:22 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: చదువుకునే వయసులో తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని.. లేదా ఇద్దరినీ కోల్పోవడం భరించలేని విషాదం. అలాంటి సందర్భాల్లో చదువు ఆపేయాల్సిన దుస్థితి కూడా చాలామందికి ఏర్పడుతుంది. ఇలాంటి నిరుపేద చిన్నారులు చదువుకు దూరం కాకూడదన్న ఉన్నత లక్ష్యంతో డాక్టర్‌ కోనేరు సత్యప్రసాద్‌ ఏర్పాటుచేసిన విద్యా సంస్థే.. హీల్‌ ప్యారడైజ్‌. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో 90 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉన్న ఈ పాఠశాలలో ఉచితంగా నాణ్యమైన విద్య, వసతి, భోజనం అందిస్తారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఆంగ్ల మాధ్యమంలో సీబీఎస్‌ఈ పాఠ్య ప్రణాళికతో కార్పొరేటు పాఠశాలలకు దీటుగా ఇక్కడ బోధిస్తున్నారు. ఇది గన్నవరం విమానాశ్రయానికి 12 కి.మీ. దూరంలో ఉంది.

పాఠశాలలో 15 వేల పుస్తకాలతో అతి పెద్ద గ్రంథాలయం అందుబాటులో ఉంది. విద్యార్థుల ఆసక్తి మేరకు కళల్లోనూ ప్రోత్సహిస్తున్నారు. త్రీడీ చిత్రలేఖనం, క్రాఫ్ట్, సంగీతం, నృత్యం, తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో 400 మీటర్ల ట్రాక్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, హ్యాండ్‌బాల్‌ కోర్టులూ ఉన్నాయి.

బాలబాలికలకు వేర్వేరుగా ఆధునిక హంగులతో వసతి గృహాలు ఉన్నాయి. విద్యార్థులకు అందించే భోజనానికి సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలను వినియోగిస్తున్నారు. విశాలమైన భోజనశాల, సోలార్‌ వంటగది, విద్యార్థులు తాగేందుకు ఆర్వో శుద్ధజలం, వేడినీరు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ గదుల్లో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్‌ బయాలజీ, ఆర్ట్స్, కంప్యూటర్‌ ల్యాబ్స్‌ ఉన్నాయి. అద్భుతమైన క్రీడా సౌకర్యాలు, ఇండోర్‌ స్టేడియం ఉన్నాయి. జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడల్లో విద్యార్థులు సత్తా చాటుతున్నారు. ఇన్నోవేషన్, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ కేంద్రం, ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ఎక్స్‌లెన్స్, సైబర్‌ సెక్యూరిటీ కేంద్రం, 3డీ ప్రింటింగ్, డిజైన్‌ థింకింగ్‌ ఉన్నాయి. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు మెడికల్, ఇంజినీరింగ్‌ ఇతర కోర్సుల్లో ఉన్నత చదువులకూ హీల్‌ సంస్థే సహకరిస్తుంది. విద్యార్థుల కోసం పాఠశాల ప్రాంగణంలోనే ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. అత్యుత్తమ అర్హత పొందిన ఉపాధ్యాయులు, అంతర్జాతీయ దూర విద్యా ఫ్యాకల్టీ ద్వారా శిక్షణ అందిస్తారు.

‘నిస్సహాయ స్థితిలో ఉన్న చిన్నారులకు సేవ చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాం. హీల్‌ ద్వారా చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే మా ధ్యేయం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా ఇక్కడ చేరవచ్చు’. అని హీల్‌ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.కోనేరు సత్యప్రసాద్, కార్యదర్శి తాతినేని లక్ష్మి, సీఈవో కె.అజయ్‌ కుమార్‌  తెలిపారు.

ఈ విద్యా సంవత్సరం ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు, 11వ తరగతి (ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం) ఎంపీసీ, బైపీసీ, ఎంఈఏ  కోర్సులకు, హీల్‌ అంధుల పాఠశాలలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

1-9 తరగతులకు..

  • తల్లిదండ్రులు ఇద్దరినీ, లేదా ఎవరినో ఒకరిని కోల్పోయి ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన 6 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్న విద్యార్థులు
  • మరణ ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, తెల్ల రేషన్‌ కార్డు తప్పనిసరి
  • హీల్‌ ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత తప్పనిసరి.

11వ తరగతి (ఎంపీసీ, బైపీసీ,ఎంఈఏ)లో 

  • ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు పదో తరగతిలో 480 మార్కులు, సీబీఎస్‌ఈ (లేదా) ఐసీఎస్‌ఈలో 400పైన మార్కులు సాధించిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • తెల్లరేషన్‌ కార్డు, ఆదాయ ధ్రువ పత్రం తప్పనిసరి.

అంధ పాఠశాలకు అర్హత ఇలా..

  • 1-8 తరగతుల విద్యార్థులు ప్రవేశాలకు అర్హులు
  • ఆర్థికంగా వెనుకబడి, 40శాతం కంటే ఎక్కువ అంధత్వ ధ్రువపత్రం ఉన్నవారు అర్హులు

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజా కిరణ్‌ అన్నారు.
  • రాంబిల్లిలో మెగా ఔషధ కంపెనీ అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో మెగా ఔషధ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు సాగుతున్నాయి.
  • విలేజ్‌ టు విరాట్‌ మీరు క్రికెట్‌ బాగా ఆడతారా..? మీ ప్రతిభకు తగిన గుర్తింపు, వేదిక కోసం చూస్తున్నారా..? అయితే.. మీ కోసమే ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ‘విలేజ్‌ టు విరాట్‌’ ట్యాగ్‌తో ‘రూరల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ప్రోగ్రాం’కు రూపకల్పన చేస్తోంది.
  • ‘ఆరెంజ్‌ ఎకానమీ’ అభివృద్ధికి త్వరలో వర్క్‌షాపులు సాంస్కృతిక, పర్యాటక, ఫిల్మ్‌ టూరిజం విభాగాల్ని సమన్వయం చేస్తూ ‘ఆరెంజ్‌ ఎకానమీ’ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ శాఖల మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. ఇందుకోసం జూన్‌ లేదా జులై నెలల్లో ప్రత్యేక వర్క్‌షాపులు నిర్వహిస్తామని తెలిపారు.
  • పర్యాటకానికి ‘స్వర్ణ’ కళ! వైకాపా హయాంలో నిర్లక్ష్యానికి గురైన రాష్ట్ర పర్యాటక రంగం తిరిగి గాడిలో పడుతోంది. కూటమి ప్రభుత్వం దానికి పారిశ్రామిక హోదా కల్పించి ప్రోత్సాహకాలు ప్రకటించడంతో పెద్ద ఎత్తున పెట్టుబడులొస్తున్నాయి.
  • వైద్యులకు ఏఐ ప్రత్యామ్నాయం కాదు ‘వైద్యరంగంలో కృత్రిమ మేధ విప్లవాత్మక మార్పులు తెస్తోంది. వ్యాధుల నిర్ధారణ, ఆరోగ్య సేవల్లో క్లిష్ట సమస్యలకు ఏఐ టూల్స్‌ పరిష్కారాలు చూపిస్తున్నాయి.
  • వైభవంగా నూకతాత జాతర అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో మంగళవారం నూకతాత జాతర వైభవంగా సాగింది. నూకతాత ప్రతిమకు పూజారులు, భక్తులు బోయపాడు తీరంలో ఉదయం స్నానం చేయించి పూజలు నిర్వహించారు.
  • నందీశ్వరుడిపై సర్వాంతర్యామి సర్వాంతర్యామి అయిన సోమస్కందమూర్తి ఆయనకు ప్రియమైన నందీశ్వరుడిపై, జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు కామధేనువుపై కొలువుదీరి శ్రీకాళహస్తి తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
  • శ్రీశైలంలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పూర్ణాహుతి, చండీశ్వరునికి అవబృధ స్నానం, వసంతోత్సవ క్రతువులు ఘనంగా నిర్వహించారు.
  • తుది దశలో మూలపేట పోర్టు నిర్మాణం ఉత్తరాంధ్రకు గేమ్‌ ఛేంజర్‌గా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణ పనులు 75 శాతం మేర పూర్తయినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
  • 12వ పీఆర్సీ ప్రకటించకపోతే ‘చలో సచివాలయం’ వేతన సవరణ కోసం 12వ పీఆర్సీ కమిషన్‌ను తక్షణమే నియమించి, ఐఆర్‌ను 29 శాతం ప్రకటించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కె.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.
  • అమరావతిలో క్యాట్‌ శాశ్వత బెంచ్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అమరావతిలో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ సర్క్యూట్‌(క్యాట్‌) శాశ్వత బెంచ్‌ ఏర్పాటుకు భూ కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని ఆ సంస్థ తెలిపింది.
  • బిల్‌గేట్స్‌ పర్యటన.. సీఎం విజన్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు గేట్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ అమరావతి పర్యటన.. సీఎం చంద్రబాబు విజన్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.
  • 21 రోజుల్లో జనన మరణాల నమోదు తప్పనిసరి రాష్ట్రంలో జనన మరణాల నమోదుకు కొత్త నిబంధనలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 21 రోజుల్లో నమోదు తప్పనిసరి చేసింది.
  • అమర్‌నాథ్‌ బృందాన్ని కలవని అంబటి! రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబు తమ పార్టీకే చెందిన కొందరు నేతలను ములాఖత్‌లో కలిసేందుకు ఇష్టపడలేదు.
  • ఏపీలో వేగవంతమైన అభివృద్ధి ‘ఎక్స్‌’లో బిల్‌గేట్స్‌ ఏఐ, సాంకేతికతను ఉపయోగించుకుని వ్యవసాయం, విద్య, ఆరోగ్యరంగాల్లో ఆవిష్కరణలతో ఆంధ్రప్రదేశ్‌ వేగవంతంగా అభివృద్ధి చెందుతోందని గేట్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ పేర్కొన్నారు.
  • మూలుగ మార్పిడి చికిత్స ఎప్పటికి వస్తుంది? రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో మూలుగ (బోన్‌మారో) మార్పిడి చికిత్స అందుబాటులో లేకపోవడాన్ని హైకోర్టు ఆక్షేపించింది.
  • అసెంబ్లీలో పని చేయని మైక్‌ సిస్టమ్‌ అసెంబ్లీలో మంగళవారం మైక్‌ సిస్టమ్‌ మొరాయించింది. శాసనసభలో ఉదయం 9 గంటలకు సమావేశాన్ని ప్రారంభించే సమయానికి ముందు సిబ్బంది పరిశీలించినపుడు మైకులు పని చేయడం లేదని గుర్తించారు. సాంకేతిక విభాగం హడావుడిగా సరిచేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు.
  • ప్రాజెక్టు కొట్టుకుపోయినా పట్టించుకోని జగన్‌ మామిడి రైతులకు కష్టం వస్తే స్థిరీకరణ నిధి ద్వారా నిధులు కేటాయించి ఆదుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తెదేపా ఎమ్మెల్యే కె.మురళీమోహన్‌ పేర్కొన్నారు. అందులో పూతలపట్టు నియోజకవర్గానికి అధిక మొత్తం నిధులు దక్కాయని చెప్పారు.
  • వైకాపా పాలనలో ఇష్టారీతిన విద్యుత్తు రాయితీ విధానం వైకాపా హయాంలో ఆక్వా రంగంలో విద్యుత్తు రాయితీని ఇష్టానుసారంగా ఒక్కో రైతుకు ఒక్కో విధంగా అమలు చేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైకాపా సర్కారు దుర్మార్గాలను సరిచేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

English Translation

Andhra News: 'Heal' for orphans' education

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 22 Dec 2025 05:22 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

Agiripalli, Newstoday: At the reading age Losing one or both parents is an unbearable tragedy. In such cases, the plight of having to stop studying also arises for many. Heal Paradise is an educational institution established by Dr. Koneru Sathyaprasad with the lofty goal of preventing such underprivileged girls from learning. Located in Totapalli, Agiripalli Mandal, Eluru District, this school is located in a spacious 90 acre campus and provides free quality education, accommodation and meals. From Class 1 to Intermediate, English medium with CBSE curriculum is taught here in addition to corporate schools. It is 12 km from Gannavaram Airport. away.

The school has the largest library available with 15 thousand books. Arts are also encouraged according to the interest of the students. Training is given in 3D painting, craft, music, dance, etc. There is a 400 meter track, basketball, kabaddi, kho-kho, volleyball and handball courts of international standards.

There are separate hostels for boys and girls with modern touches. Organically grown vegetables are used for meals served to students. There is a spacious canteen, solar kitchen, ARV clean water and hot water for students to drink. Online classes are conducted in smart rooms. Chemistry, Physics, Maths Biology, Arts, Computer Labs are there. There are excellent sports facilities and an indoor stadium. Students are showing their potential in national and state level sports. Innovation, Entrepreneurship Centre, AI (Artificial Intelligence) Excellence, Cyber ​​Security Centre, 3D Printing, Design Thinking. HEAL organization supports the students studied here in medical, engineering and other courses for higher studies. A hospital has been set up in the school premises for the students. The best qualified teachers provide training through international distance education faculty.

'We feel fortunate to be given the opportunity to serve the underprivileged children. Our mission is to light up the lives of children through Heal. Anyone from any part of the country can join here. Dr. Koneru Sathyaprasad, founder president of HEAL, secretary Tatineni Lakshmi, CEO K. Ajay Kumar said.

This academic year applications for admissions for classes one to nine, class 11 (intermediate first year) MPC, BIPC, MEA courses, classes one to eight in HEAL school for the blind. Inviting.

Classes 1-9..

  • Talented students aged 6 to 15 years who have lost both parents or one of them due to economic disadvantage
  • Death certificate, income proof, white ration card mandatory
  • Hail entrance test, pass interview Compulsory.

In class 11th (MPC, BIPC,MEA)

  • Students from economically backward families who have scored 480 marks in class 10th and above 400 marks in CBSE (or) ICSE should apply.
  • Tellation card, income proof. Compulsory.

Eligibility for blind school is as follows..

  • Students of classes 1-8 are eligible for admission
  • Economically backward and having more than 40 percent blindness certificate are eligible

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Family members should be clear about values and policies. Margadarshi Chitfunds MD Shailaja Kiran said that when all the family members have a clear understanding of the values and procedures to be followed in the construction of business enterprises, family businesses can survive for a long time. Preparations are underway for setting up a mega pharmaceutical manufacturing industry in Rambilli mandal of Anakapalli district.
  • Village to Virat Do you play cricket well? Are you looking for a platform and recognition for your talent? However.. Andhra Cricket Association (ACA) is designing a 'Rural Talent Search Program' with the tag 'Village to Virat' for you.
  • Workshops for the development of 'Orange Economy' will be held soon. Kandula Durgesh, Minister of Culture, Tourism and Film Tourism, said that the aim of the government is to develop 'Orange Economy' by coordinating the departments of culture, tourism and film tourism. He said that special workshops will be held in June or July for this purpose.
  • 'Golden' art for tourism! The state's tourism sector, which was neglected during Vaikapa's regime, is back in the groove. With the alliance government giving it industrial status and announcing incentives, large scale investments are being made.
  • AI is not a substitute for doctors. Artificial intelligence is revolutionizing the field of medicine. AI tools are showing solutions to difficult problems in disease diagnosis and health services. On Tuesday, Nukatatha fair was held in Rajayyapet of Nakkapalli mandal of Anakapalli district. The priests and devotees bathed in the morning at Boyapadu beach and performed puja to the image of Nukatatha. Sarvantyami Somaskandamurthy appeared to the devotees on his beloved Nandishvara and Gnanaprasunambika on Kamadhenu while strolling through the streets of Srikalahasti in Koluvudiri. As part of the Mahashivratri Brahmotsavam in Srisaila Mahakshetra, Poornahuti, Avabrdha bathing and Vasantotsava rituals of Chandiswara were held on Tuesday. As a game changer for Uttarandhra, the greenfield port being constructed at Moolpet of Santabommali mandal of Srikakulam district is going on actively. The construction company announced that 75 percent of the construction work has been completed. UTF state president and general secretaries N.Venkateshwarlu and K.S.N.Prasad demanded that the 12th PRC commission be appointed immediately for wage revision and declare the IR as 29 percent. The organization said that the state government has already started the process of allotment of land for the establishment of a permanent bench of the Central Administrative Tribunal Circuit (CAT) in Amaravati. Gates Foundation Chairman Bill Gates's visit to Amaravati..Tedpa State President Palla Srinivasa Rao said that CM Chandrababu's vision is a world class recognition.
  • Registration of births and deaths within 21 days is mandatory The government has brought new rules for registration of births and deaths in the state. Registration is mandatory within 21 days.
  • Ambati who did not meet Amarnath team! Former minister and Vikapa leader Ambati Rambabu, who is a remand prisoner in Rajamahendravaram Central Jail, did not want to meet some leaders of his own party in Mulakat. Gates Foundation Chairman Bill Gates said that Andhra Pradesh is developing rapidly with innovations in agriculture, education and health sectors using AI and technology.
  • When will transplant therapy come? The High Court objected to non-availability of bone marrow transplant treatment in government hospitals and medical colleges in the state.
  • Non-functioning mic system in assembly. The mic system blared in the assembly on Tuesday. When the staff checked before the session started at 9 am in the Legislative Assembly, they found that the microphones were not working. The technical department hastily tried to fix it but to no avail. TDEPA MLA K. Murali Mohan said that Chandrababu should be credited with allocating funds through the stabilization fund when mango farmers face difficulties. He said that Puthalapattu Constituency got the highest amount of funds. Sarvepalli MLA Somireddy Chandramohan Reddy said that during the Vaikapa regime, electricity subsidy was implemented in the aqua sector according to the will of each farmer. Vaikapa stated that it is necessary to correct the wrongdoings of the government.