ఢాకా:భారత్ అంటే విద్వేషం కలిగిన ఇంకిలాబ్ మోంచో విద్యార్థి నేత షరీప్ ఉస్మాన్ హాదీ (Sharif Osman Hadi) మరణాంతరం బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింసాకాండ తగ్గుముఖం పట్టలేదు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) నేత బేలాల్ హొస్సేన్ ఇంటికి దుండగులు నిప్పుపెట్టడంతో ఆయన ఏడేళ్ల కుమార్తె మంటల్లో సజీవదహనమైంది. శనివారం తెల్లవారుజాము ఒంటిగంట ప్రాంతంలో దుండగులు బేలాల్ హొస్సేన్ ఇంటికి బయట నుంచి తాళం వేసి పెట్రోల్ పోసి తగులబెట్టారని, మంటల్లో చిక్కుకున్న ఏడేళ్ల చిన్నారి అయేషా అక్తర్ సజీవ దహనమైందని 'డైలీ స్టార్' పత్రిక వెల్లడించింది.


బెలాల్‌తో పాటు ఆయన మరో ఇద్దరు కుమార్తెలు సల్మా అక్తర్ (16), సమియా అక్తర్ (14) తీవ్రంగా గాయపడటంతో వారిని ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని బర్న్ యూనిట్‌కు తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది. దుండగులు తమ ఇంటి తలుపులకు తాళాలు వేసి పెట్రోల్‌తో తగులబెట్టినట్టు బెలాల్ తల్లి ధ్రువీకరించారు.


రెచ్చగొట్టిన యూనస్

ఒస్మాన్ హాదీ మరణాంతరం ఢాకా సహా పలు ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో అల్లర్లు చెలరేగాయి. నిరసనకారులు 'డైలీ స్టార్', 'ప్రొథోమ్ అలో' పత్రికా కార్యాలయాల వెలుపల తీవ్ర నిరసనలకు దిగారు. హాదీకి అంతిమవీడ్కోలు పలికేందుకు పెద్దఎత్తున జనం ఢాకాకు చేరుకోవడంతో భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మమహ్మద్ యూనస్ సైతం ఈ అంత్యక్రియలకు హాజరై సంచలన వ్యాఖ్యలు చేసారు. బంగ్లాదేశ్ ఉన్నంత కాలం హాజీ జీవించే ఉంటారని, దేశం మర్చిపోలేని మంత్రానికి హాజీ అందరికీ అందించారని, అది ఎప్పటికీ తమ చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని అన్నారు.


ఇవి కూడా చదవండి..


English Translation

Dhaka:The violence that broke out in Bangladesh after the death of Inquilab Moncho student leader Sharif Osman Hadi, who has hatred for India, has not abated. Bangladesh Nationalist Party (BNP) leader Belal Hossain's seven-year-old daughter was burnt alive after miscreants set fire to his house. 'Daily Star' magazine revealed that the miscreants locked Belal Hossain's house from outside and poured petrol on it and set it on fire. Seven-year-old Ayesha Akhtar was burnt alive.


Besides Belal, his two other daughters Salma Akhtar (16) and Samia Akhtar (14) were seriously injured. He was shifted to the burn unit of Dhaka Medical College Hospital. Dhaka Tribune said that their condition is alarming. Belal's mother confirmed that the assailants locked the doors of their house and set it on fire with petrol.


Provoked Yunus

After the death of Osman Hadi, widespread riots broke out in many areas including Dhaka. Protesters protested outside 'Daily Star' and 'Prothom Alo' press offices. The last rites of Hadi were held amid heavy security arrangements as large crowds flocked to Dhaka to pay their last respects. Mohammad Yunus, Advisor to the Interim Government of Bangladesh, also attended the funeral and made sensational comments. He said that Haji will live as long as there is Bangladesh and Haji has given everyone a mantra that the country will never forget and it will continue to echo in their ears forever. Read..