అండాశయంలో సిస్ట్‌లు!
నాకు 30 ఏళ్లు. ఇటీవల పూర్తి బాడీ చెకప్ చేయించుకుంటే ఒక అండాశయంలో సిస్ట్‌లు ఉన్నాయని తేలింది. ఏంటివి? వీటివల్ల ఏమైనా సమస్యా?

- A
- A+
- A++
నాకు 30 ఏళ్లు. ఇటీవల పూర్తి బాడీ చెకప్ చేయించుకుంటే ఒక అండాశయంలో సిస్ట్‌లు ఉన్నాయని తేలింది. ఏంటివి? వీటివల్ల ఏమైనా సమస్యా?
మీ విషయంలో ఇది అనుకోకుండా తెలిసింది. ఏదైనా ఇబ్బంది వచ్చి, బయటపడలేదు కాబట్టి కంగారు అవసరం లేదు. మామూలుగా ఈ సిస్ట్‌లు 7 సెం.మీ. కంటే పెద్దగా ఉంటే సర్జరీ చేయాలి. 5 సెం.మీ. లోపు ఉంటే కొన్ని రోజులు మందులు వాడి చూడొచ్చు. తగ్గితే సరే! మందులతో తగ్గకపోతే వాటిని తరచూ స్కాన్ చేయించుకుంటూ గమనించుకోవాలి. అలాగే నొప్పి ఉన్నా వైద్యులను కలవాలి. అవి పగలడం, ఒకదానికొకటి ఒరుసుకోవడం వంటివి ఏమైనా జరిగితే తగిన చికిత్సని అందిస్తారు. సిస్ట్‌లు పెరగకుండా చిన్నగానే ఉండి, ఈ సమస్యలేమీ లేకపోతే పెద్దగా కంగారుపడాల్సిన పనిలేదు. మీవరకూ మందులు వాడితే సరిపోతుంది. నిజానికి ఈ చిన్న సిస్ట్‌లు చాలామందిలో కనిపించేవే. కాబట్టి, ఓసారి వైద్యులను సంప్రదించండి. వాళ్ల సూచన మేరకు తగిన చికిత్స తీసుకుంటే సమస్య తీరుతుంది.
