ఇంటర్నెట్ డెస్క్:వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టు.. ఆ టోర్నీ తర్వాత తొలి పోరుకు సిద్ధమైంది. శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా హర్మన్ సేన తొలి మ్యాచ్ ఆడనుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో జట్టు కూర్పుపై అవగాహనకు రావడానికి ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత శ్రీలంక మహిళల జట్టు బ్యాటింగ్‌కి దిగనుంది.
బ్యాటింగ్‌లో హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తిశర్మ మంచి ఫామ్‌లో ఉన్నారు. జట్టులోకి కొత్తగా వచ్చిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వైష్ణవి శర్మ ఎలా ఆడతారో చూడాలి. అండర్-19 ప్రపంచకప్‌లో 17 వికెట్లు తీసిన వైష్ణవిపై మంచి అంచనాలున్నాయి. రాధ యాదవ్ గైర్హాజరీ నేపథ్యంలో వైష్ణవి కీలకం కానుంది.
భారత తుది జట్టు..
స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్), రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్, అరుంధతీ రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి.
శ్రీలంక తుది జట్టు..
విష్మి గుణరత్నే, చమరి అథాపత్తు(కెప్టెన్), హాసిని పెరెరా, హర్షిత సమర విక్రమ, నీలాక్షి డిసిల్వా, కౌషని నూత్యంగన(వికెట్ కీపర్), కవిషా దిల్హరి, మల్కీ మదార, ఇనోకా రణవీర, కావ్య కావింది, శశిని గిమ్హాని.
English Translation
Internet Desk:The Indian women's cricket team, which won the ODI World Cup, is ready for its first match after the tournament. Harman Sena will play the first match of the five T20 series against Sri Lanka. India hopes to use this series to get an understanding of the team composition ahead of next year's T20 World Cup. But team India won the toss and chose to field. With this, the Sri Lankan women's team will go into bat first.
Harmanpreet, Smriti Mandhana, Jemima Rodrigues and Deeptisharma are in good form in batting. It remains to be seen how Vaishnavi Sharma, the new left arm spinner in the team, will play. Vaishnavi, who took 17 wickets in the Under-19 World Cup, has good expectations. Vaishnavi will be crucial in Radha Yadav's absence.
India's final team..
Smriti Mandhana, Shafali Verma, Jemima Rodrigues, Harman Preet Kaur (captain), Richa Ghosh (wicket keeper), Deepti Sharma, Amanjot Kaur, Arundhani Reddy, Vaishnavi Sharma, Kranti Goud, Sri Charani.
Sri Lanka Final Team..
Vishmi Gunaratne, Chamari Athapattu(captain), Hasini Perera, Harshita Samara Wickrama, Neelakshi D'Silva, Kaushani Nutyangana(wicket keeper), Kavisha Dilhari, Malki Madara, Inoka Ranaweera, Kavya Kavindi, Shashini Gimhani.