Sayaji Shinde Nature Love And His Mothers Last Wish

'తిన్నమా పడుకున్నామా తెల్లరిందా' ఈ డైలాగ్ చెప్పగానే చాలామంది గుర్తొచ్చేది సాయాజీ షిండే. 'పోకిరి' మూవీలో పోలీస్‌ పాత్రలో తనదైన మేనరిజం, డైలాగ్ డెలివరీతో స్టార్‌డమ్ తెచ్చుకున్న ఇతడు.. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, మరాఠీ, కన్నడ భాషల్లో గత మూడు దశాబ్దాలుగా నటిస్తూనే ఉన్నాడు. తండ్రి, పోలీస్, విలన్.. ఇలా రకరకాలుగా మనందరికీ పరిచయమే. కానీ సాయాజీలో ఎవరికీ తెలియని మరో కోణం కూడా ఉంది. అదేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం పక్కా.

స్వతహాగా నటుడే అయినప్పటికీ సాయాజీ షిండే.. ప్రకృతిని విపరీతంగా ప్రేమిస్తారు. ఎంతలా అంటే తల్లికి ఇచ్చిన చివరిమాట కోసం లక్షలాది చెట్లు నాటారు. ఇప్పటికీ నాటుతూనే ఉన్నారు. ఓసారి తెలుగు యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా అమ్మ 97 ఏళ్లు బతికింది. ఆమెకు 93 ఏళ్ల వయసున్నప్పుడు ఓ నిర్ణయం తీసుకున్నాను. అమ్మ పేరుపై ఎప్పటికీ నిలిచిపోయే కార్యక్రమం ఏదైనా చేయాలనుకున్నా. అప్పుడే నాకు ఓ ఆలోచన వచ్చింది. త్రాసులో ఓవైపు అమ్మని కూర్చోబెట్టి.. మరోవైపు ఆమె బరువుకు సరితూగినన్నీ విత్తనాలతో ప్రపంచమంతా మొక్కలు నాటాలనుకున్నాను. ఎప్పుడైతే అవి చెట్లుగా మారి పూలు, పళ్లు వస్తే.. అందులో అమ్మని చూసుకోవచ్చని ఈ కార్యక్రమం చేపట్టాను. నాకు కన్నతల్లి, భూమాత ఇద్దరూ ఒకటే. ఎందుకంటే తల్లి మనల్ని నవమాసాలు కనిపెంచుతుంది. చెట్టు మనకు ప్రాణవాయువు ఇచ్చి బ్రతికిస్తుంది. కాబట్టి చెట్లకంటే సెలబ్రిటీలు ఎవరూ ఉండరు అని నేను నమ్ముతా అని అన్నారు.

సాయాజీ షిండే.. తల్లి మరణానంతరం ప్రకృతి ప్రేమికుడిగా మారారు. 'సహ్యాద్రి దేవరాయి' అనే సంస్థని 2015లో స్థాపించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా చెట్లు నాటడం, పర్యావరణాన్ని కాపాడటం తదితర కార్యక్రమాలు చేస్తున్నారు. తద్వారా పర్యావరణంతో అనుబంధాన్ని పెంచుకుంటున్నారు. ఇప్పటివరకు అయితే 29 ప్రాంతాల్లో ఏకంగా ఆరున్నర లక్షల వరకు విత్తనాలు, చెట్లు నాటినట్లు తెలుస్తోంది. గతంలో ఓసారి నాసిక్‌లో డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా 1800 చెట్లని కొట్టేందుకు సిద్ధమవగా షిండే విపరీతంగా పోరాడారు. చివరగా ఇందులో విజయం సాధించారు కూడా.

అలానే విద్యార్థుల్లోనూ పర్యావరణంపై అవగాహన కల్పించడంలో భాగంగా 'ఓ విద్యార్థి ఓ చెట్టు' అనే నినాదంతో పారశాలల్లో పిల్లలకు తన సంస్థ ద్వారా ప్రకృతి, చెట్ల పెంపకంపై షిండే అవగాహన కలిగిస్తున్నారు. ఏదేమైనా నటుడిగా ఎన్నో వైవిధ్య పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. రాబోయే తరాల కోసం ఇలాంటి ప్రయత్నం చేస్తుండటం నిజంగా మెచ్చుకోదగిన విషయం. అయితే తెలుగు రాష్ట్రాల్లో దీని గురించి చాలామందికి తెలియదనే చెప్పొచ్చు.


English Translation
Sayaji Shinde Nature Love And His Mothers Last Wish

'Have you eaten or slept?' One to remember is Sayaji Shinde. He got stardom with his unique mannerism and dialogue delivery as a policeman in the movie 'Pokiri'.. He has been acting in Telugu, Tamil, Hindi, Malayalam, Marathi and Kannada languages ​​for the last three decades. Father, Police, Villain... we all know him in different ways. But there is another side of Sayaji that no one knows about. You will be surprised to know that.

Though an actor by nature, Sayaji Shinde loves nature immensely. So much so that millions of trees were planted for the last words given to the mother. They are still planting. Once speaking in an interview given to a Telugu YouTube channel.. My mother lived for 97 years. I took a decision when she was 93 years old. If you want to do something that will remain forever in the name of Amma. Then I got an idea. I wanted to plant all the seeds in the whole world with my mother sitting on one side of the rope. I took up this program so that whenever they become trees and bear flowers and fruits... I can look after Amma in them. Both my mother-in-law and mother-in-law are the same. Because mother finds us navamasa. The tree gives us life. So I believe that there are no more celebrities than trees.

Sayaji Shinde became a nature lover after the death of his mother. An organization called 'Sahyadri Devarai' was founded in 2015. As part of this, programs like planting trees and protecting the environment are being done across the country. Thus increasing the connection with the environment. So far, it seems that up to six and a half lakh seeds and trees have been planted in 29 areas. In the past, Shinde fought hard to cut down 1800 trees as part of a development project in Nashik. Finally, they succeeded in this.

Similarly, as part of creating awareness among the students about the environment, Shinde is making the children aware of nature and tree planting through his organization in Parasalas with the slogan 'O Vidyarthi O Chettu'. However, he has gained recognition as an actor with many diverse roles.. It is really admirable that he is making such an effort for the coming generations. But it can be said that many people in Telugu states do not know about this.