IND vs SA Abhishek Fails To Break Kohli Calendar year runs record

టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఒకే టీ20 క్యాలెండర్‌ ఇయర్‌లో పదహారు వందల మార్కు చేరుకున్న రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. అంతకు ముందు టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి ఈ ఘనత సాధించాడు.

కాగా ఐపీఎల్‌-2025లో సన్‌రైజర్స్‌ తరఫున అదరగొట్టిన అభిషేక్‌ శర్మ 14 మ్యాచ్‌లలో కలిపి 439 పరుగులు సాధించాడు. అదే విధంగా.. దేశీ టీ20 టోర్నీలో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2025లో పంజాబ్‌ కెప్టెన్‌గా బరిలోకి దిగిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. ఆరు మ్యాచ్‌లలో కలిపి 304 పరుగులు సాధించాడు.

ఇక టీమిండియా తరఫున  ఈ ఏడాది అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లోనూ అభిషేక్‌ శర్మ దుమ్ములేపాడు. 21 మ్యాచ్‌లలో కలిపి 859 పరుగులు చేశాడు. ఈ క్రమంలో మొత్తంగా 2025లో టీ20లలో 1602 పరుగులు పూర్తి చేసుకున్న అభిషేక్‌ శర్మ.. కోహ్లి ఆల్‌టైమ్‌ రికార్డును సమం చేసేందుకు కేవలం పన్నెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.

2016లో విరాట్‌ కోహ్లి ఐపీఎల్‌, టీమిండియా తరఫున కలిపి 1614 పరుగులు చేయగా.. అభిషేక్‌ ఈ ఏడాది 1602 పరుగులతో ముగించాడు. ఈ జాబితాలో సూర్యకుమార్‌ యాదవ్‌ (2022లో 1503, 2023లో 1338 పరుగులు), యశస్వి జైస్వాల్‌ (2023లో 1297 పరుగులు) ఉన్నారు.

కాగా సౌతాఫ్రికాతో అహ్మదాబాద్‌ వేదికగా శుక్రవారం ఐదో టీ20లో టాస్‌ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో ఆదిలో ఆచితూచి ఆడిన అభిషేక్‌ శర్మ.. ఆ తర్వాత గేరు మార్చాడు. అయితే, ఆరో ఓవర్‌ నాలుగో బంతికి కార్బిన్‌ బాష్‌ బౌలింగ్‌లో అభిషేక్‌ శర్మ అవుటయ్యాడు. వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ 21 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌ బాది 34 పరుగులు సాధించి నిష్క్రమించాడు. 


English Translation
IND vs SA Abhishek Fails To Break Kohli Calendar year runs record

Team India's devastating opener Abhishek Sharma is rare. Accomplished. He became the second Indian player to reach the sixteen hundred mark in a single T20 calendar year. Before that, Team India's batting legend Virat Kohli achieved this feat.

While Abhishek Sharma, who played for Sunrisers in IPL-2025, scored a total of 439 runs in 14 matches. Similarly... this left-hander batsman, who entered the ring as the captain of Punjab in the Syed Mushtaq Ali Trophy-2025 in the domestic T20 tournament, scored a total of 304 runs in six matches. He scored a total of 859 runs in 21 matches. In this order, Abhishek Sharma, who has completed 1602 runs in T20s in 2025, is just twelve runs away from equaling Kohli's all-time record.

In 2016, Virat Kohli scored a combined 1614 runs for IPL and Team India.. Abhishek ended this year with 1602 runs. Suryakumar Yadav (1503 runs in 2022, 1338 runs in 2023) and Yashaswi Jaiswal (1297 runs in 2023) are on this list.

And the Indian team, who lost the toss against South Africa in Ahmedabad on Friday, batted first in the fifth T20I. In this sequence, Abhishek Sharma, who played in the beginning, changed gears. However, in the fourth ball of the sixth over, Abhishek Sharma was bowled by Corbin Bosch. Wicket keeper Quinton de Kock was caught and reached the pavilion. In this match, Abhishek Sharma scored 34 runs off 21 balls with six fours and one six.