Varun Chakravarthy: మనల్ని మనమే ఛాలెంజ్‌ చేసుకోవాలి: వరుణ్‌ చక్రవర్తి

Eenadu icon
By Sports News Team Updated : 19 Dec 2025 16:38 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: రానున్న టీ20 వరల్డ్‌కప్‌ 2026 కోసం తన ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకుంటూ.. మ్యాచుల్లో తనను తానే ఛాలెంజ్‌ చేసుకుంటూ సన్నద్ధమవుతున్నట్లు టీమ్ఇండియా ( Team India) మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి  (Varun Chakravarthy) వివరించాడు. ఇప్పటివరకు 32 టీ20ల్లో అతడు 51 వికెట్లు పడగొట్టాడు. అలాగే టీమ్‌ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో 6 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం అతడు ఐసీసీ ( ICC) ర్యాంకింగ్స్‌లో వరల్డ్‌ నం.1 బౌలర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

‘సవాళ్లేమీ లేనప్పుడు మనల్ని మనమే ఛాలెంజ్‌ చేసుకోవాలి. ఏదైనా ఒక మ్యాచ్‌ తేలిగ్గా ఉన్నప్పటికీ దాన్ని కూడా ఛాలెంజింగ్‌గా తీసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో రైట్‌ లెన్త్‌ల్లో బౌలింగ్‌ వేయాలి. అలాగే ప్రత్యర్థులను అర్థం చేసుకోవడం కీలకం. వరల్డ్‌ కప్‌లో ఇదే ప్రధానాంశం. నేను ఈ విషయంలో రాణిస్తాననే అనుకుంటున్నా’ అని వరుణ్‌ చక్రవర్తి వివరించాడు.

  • ఆ ఒక్కటీ మెరుగుపడితే.. గిల్‌ పరుగులు చేయగలడు: సంజయ్‌ బంగర్‌

‘నా ప్రణాళిక చాలా తేలికగా ఉంటుంది. నా లెన్త్‌లో నేను బౌలింగ్‌ చేస్తా. కొన్నిసార్లు అది పనిచేస్తుంది. ముఖ్యంగా గత మూడు నెలల నుంచి అది బాగా వర్కౌట్‌ అవుతోంది. తర్వాతి మ్యాచ్‌లోనూ నేను ఇలాగే ప్రయత్నిస్తా. మనం ఎప్పుడైతే ఆత్మవిశ్వాసంతో ఉండమో.. అప్పుడు మన మైండ్‌సెట్‌ మన నైపుణ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే నిత్యం ఆత్మవిశ్వాసంతో ఉండటం కీలకం. అప్పుడే మనం అద్భుత ప్రదర్శనలు చేయగలం. నిలకడగా రాణించడంలో ఇదే అసలు రహస్యం’ అని వరుణ్‌ చక్రవర్తి అన్నాడు. 

అలాగే తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌ గురించి కూడా అతడు మాట్లాడాడు. ‘నేను నా తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడినప్పుడు కాస్త ఇబ్బందికి గురయ్యా. తర్వాత నేను అర్థం చేసుకున్నా. ప్రాక్టీస్‌ చేసి నా బౌలింగ్‌లో కొన్ని మార్పులు చేసుకున్నా. ఇది చాలా కీలకం’ అని వరుణ్‌ చక్రవర్తి అన్నాడు. 

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Dec 2025 15:51 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • రాణించిన అలీషన్‌ షరాఫు.. దక్షిణాఫ్రికా విజయ లక్ష్యం 123 పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా దిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా, యూఏఈ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది.
  • రంజీట్రోఫీ ఫైనల్స్‌కు జమ్మూకశ్మీర్‌ జట్టు .. 67 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్‌లో జమ్మూకశ్మీర్‌ జట్టు మాజీ ఛాంపియన్‌ బెంగాల్‌ జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో 67 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఫైనల్స్‌లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది.
  • నా కెరీర్‌లో అదే కీలక మలుపు: హార్దిక్‌ పాండ్య టీమ్‌ఇండియా (Team India) ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్య తన కెరీర్‌లో కీలకమైన విషయం గురించి మాట్లాడాడు. టీ20 వరల్డ్‌కప్‌ 2016లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను వేసిన చివరి ఓవర్ ఎంతో ప్రత్యేకమన్నాడు.
  • కోహ్లీతో బాబర్‌ను పోల్చడం అన్యాయం: దినేశ్‌ కార్తిక్‌ పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్‌ స్టేజిలో టీమ్ఇండియాతో (Team India) జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 61 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ బ్యాటర్‌ బాబర్‌ అజామ్‌ విఫలమయ్యాడు. 7 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు.
  • భారత్‌తో మ్యాచ్‌లో.. పాకిస్థాన్ చేసిన తప్పిదం అదే: రవిచంద్రన్‌ అశ్విన్‌ పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా టీమ్‌ఇండియా (Team India), పాకిస్థాన్‌ కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఆదివారం తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్‌ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
  • వచ్చాడో బేబీ యువరాజ్‌ అతడి దేశంలో క్రికెట్‌కు అనుకూలమైన పరిస్థితుల్లేవ్‌.. ఏడాదికి మూడు నెలలే ఆట. అలాంటి చోట నుంచి క్రికెట్లో ఎదిగి జాతీయ జట్టుకు ఆడడమే గొప్ప. అలాంటిది ప్రపంచకప్‌లో బరిలో దిగే అవకాశం వచ్చింది.
  • అజేయమేనా? హ్యాట్రిక్‌ విజయాలు.. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారీ గెలుపు.. టోర్నీలో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా అత్యధిక నెట్‌ రన్‌రేట్‌.. ఇలా టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా హవా మామూలుగా లేదు.
  • ఆస్ట్రేలియా ఔట్‌ మాజీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు షాక్‌. మంగళవారం జింబాబ్వే, ఐర్లాండ్‌ మధ్య గ్రూప్‌-బి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో కంగారూ జట్టు టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిన ఆసీస్‌..
  • కివీసూ ముందుకు టీ20 ప్రపంచకప్‌లో సమీకరణాలతో పని లేకుండా న్యూజిలాండ్‌ సూపర్‌-8కు దూసుకెళ్లింది. మంగళవారం గ్రూప్‌-డి పోరులో కివీస్‌ 8 వికెట్ల తేడాతో కెనడాను చిత్తు చేసింది. మొదట కెనడా 4 వికెట్లకు 173 పరుగులు చేసింది.
  • కంగారు పడింది.. ఎన్నోసార్లు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఆస్ట్రేలియా, ప్రపంచకప్‌ అనగానే టాప్‌ ఫామ్‌ను అందుకునే జట్టు టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇంత త్వరగా నిష్క్రమించడం ఏమాత్రం ఊహించనిదే.
  • పాక్‌ నిలుస్తుందా? టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా నిష్క్రమించింది. మరో పెద్ద జట్టు భవితవ్యం బుధవారం తేలిపోనుంది. గత మ్యాచ్‌లో భారత్‌ చేతిలో గట్టి దెబ్బ తిన్న పాకిస్థాన్‌.. తన చివరి గ్రూప్‌ పోరులో నమీబియాను ఢీకొనబోతోంది.
  • ముగింపులో నేపాల్‌ మెరుపు పెద్ద జట్టు ఇంగ్లాండ్‌పై విజయానికి అత్యంత చేరువగా వెళ్లి, త్రుటిలో ఓడిన నేపాల్‌.. టీ20 ప్రపంచకప్‌ను అదిరే విజయంతో ముగించింది. గ్రూప్‌-సిలో తొలి మూడు మ్యాచ్‌లూ ఓడి సూపర్‌-8 రేసు నుంచి నిష్క్రమించిన ఆ జట్టు.. స్కాట్లాండ్‌తో మంగళవారం చివరి పోరులో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
  • సంక్షిప్త వార్తలు (5) రంజీ ట్రోఫీలో జమ్ముకశ్మీర్‌ చరిత్రకు చేరువైంది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌లో స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో సత్తాచాటుతున్న ఆ జట్టు రంజీ చరిత్రలో తొలిసారిగా ఫైనల్‌ దిశగా అడుగులేస్తోంది.
  • శర్మా.. మొదట నువ్వు సింగిల్‌ తీసుకో: సునీల్‌ గావస్కర్‌ టీమ్ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్‌లో తడబడుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అతడు ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడితే రెండింట్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
  • యువరాజ్‌ సింగ్‌ పేరు.. శతకంతో రికార్డ్‌: కెనడా ‘యువీ’ సెన్సేషన్‌ Yuvraj Samra: ప్రస్తుతం పొట్టి ప్రపంచకప్‌లో ఓ కుర్రాడి పేరు నెట్టింట మార్మోగుతోంది. అతి చిన్న వయసులో టీ20 ప్రపంచకప్‌లో శతకంతో అదరగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.