Fact Check: ఆసుపత్రి కోసం ఆస్తి ధారపోసిన టెన్నిస్ స్టార్.. ఈ వార్తలో నిజమెంత?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ (Serena Williams) ఒక ఆసుపత్రి నిర్మాణం కోసం తన యావదాస్తిని ధారపోశారని, నిరాశ్రయులు, ఎలాంటి బీమా సదుపాయం లేని వారికి ఉచితంగా వైద్య సాయం అందించేలా 1200 పడకలతో అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌లో దాన్ని ఏర్పాటు చేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. అందుకోసం తన 500 మిలియన్ డాలర్ల సంపదను ఖర్చు చేశారనేది దాని సారాంశం. రెండోసారి గర్భవతిగా ఉన్న ఆమె.. 114 రోజులుగా టెంట్‌లోనే ఉంటూ ఆసుపత్రి పనులు పరిశీలిస్తున్నారని నిర్మాణ రంగ సిబ్బంది వెల్లడించినట్లు, ఎంఆర్‌ఐ మెషిన్లను కొనుగోలు చేసేందుకు ఫ్లోరిడాలో తనకున్న పెద్ద భవంతిని కూడా అమ్మేసినట్లు రాసేశారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ ప్రచారంలో నిజం లేదని తెలుస్తోంది.
వైరల్ అవుతున్న సోషల్‌మీడియా పోస్టులో వాడిన ఫొటోలో ఆమె ఆసుపత్రిని ప్రారంభించినట్లుగా ఉంది. కానీ నిర్మాణ సిబ్బంది మాత్రం ఆమె టెంట్‌లో ఉండి పనులు పరిశీలిస్తున్నట్టుగా చెప్పారు ( Fact Check). ఇక, ఆమె 2023లోనే రెండో బిడ్డకు జన్మనిచ్చారు. కానీ వార్తలో మాత్రం రెండోసారి గర్భవతిగా ఉన్న ఆమె నిర్మాణ పనుల్లో భాగమైనట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ మీడియా కథనాలను బట్టి సెరెనా, ఆమె భర్త అలెక్సిస్ ఒహానియన్ సంపద సుమారు 430 మిలియన్ డాలర్లుగా ఉంది. కానీ జరుగుతున్న ప్రచారంలో ఒక్క సెరెనా సంపదే 500 మిలియన్ డాలర్లుగా పేర్కొన్నారు. దీన్ని బట్టి ఇది పూర్తిగా ప్రచారం కోసం సృష్టించిన ఓ ఫేక్ పోస్ట్ అని అర్థమవుతోంది.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- అజేయమేనా? హ్యాట్రిక్ విజయాలు.. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారీ గెలుపు.. టోర్నీలో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా అత్యధిక నెట్ రన్‌రేట్.. ఇలా టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా హవా మామూలుగా లేదు.
- ఆస్ట్రేలియా ఔట్ మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు షాక్. మంగళవారం జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య గ్రూప్-బి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో కంగారూ జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిన ఆసీస్..
- కివీసూ ముందుకు టీ20 ప్రపంచకప్‌లో సమీకరణాలతో పని లేకుండా న్యూజిలాండ్ సూపర్-8కు దూసుకెళ్లింది. మంగళవారం గ్రూప్-డి పోరులో కివీస్ 8 వికెట్ల తేడాతో కెనడాను చిత్తు చేసింది. మొదట కెనడా 4 వికెట్లకు 173 పరుగులు చేసింది.
- కంగారు పడింది.. ఎన్నోసార్లు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఆస్ట్రేలియా, ప్రపంచకప్ అనగానే టాప్ ఫామ్‌ను అందుకునే జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి ఇంత త్వరగా నిష్క్రమించడం ఏమాత్రం ఊహించనిదే.
- పాక్ నిలుస్తుందా? టీ20 ప్రపంచకప్ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా నిష్క్రమించింది. మరో పెద్ద జట్టు భవితవ్యం బుధవారం తేలిపోనుంది. గత మ్యాచ్‌లో భారత్ చేతిలో గట్టి దెబ్బ తిన్న పాకిస్థాన్.. తన చివరి గ్రూప్ పోరులో నమీబియాను ఢీకొనబోతోంది.
- వచ్చాడో బేబీ యువరాజ్ అతడి దేశంలో క్రికెట్‌కు అనుకూలమైన పరిస్థితుల్లేవ్.. ఏడాదికి మూడు నెలలే ఆట. అలాంటి చోట నుంచి క్రికెట్లో ఎదిగి జాతీయ జట్టుకు ఆడడమే గొప్ప. అలాంటిది ప్రపంచకప్‌లో బరిలో దిగే అవకాశం వచ్చింది.
- ముగింపులో నేపాల్ మెరుపు పెద్ద జట్టు ఇంగ్లాండ్‌పై విజయానికి అత్యంత చేరువగా వెళ్లి, త్రుటిలో ఓడిన నేపాల్.. టీ20 ప్రపంచకప్‌ను అదిరే విజయంతో ముగించింది. గ్రూప్-సిలో తొలి మూడు మ్యాచ్‌లూ ఓడి సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించిన ఆ జట్టు.. స్కాట్లాండ్‌తో మంగళవారం చివరి పోరులో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
- ఫైనల్‌కు చేరువలో జమ్ముకశ్మీర్ రంజీ ట్రోఫీలో జమ్ముకశ్మీర్ చరిత్రకు చేరువైంది. బ్యాటింగ్.. బౌలింగ్‌లో స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో సత్తాచాటుతున్న ఆ జట్టు రంజీ చరిత్రలో తొలిసారిగా ఫైనల్ దిశగా అడుగులేస్తోంది.
- శర్మా.. మొదట నువ్వు సింగిల్ తీసుకో: సునీల్ గావస్కర్ టీమ్ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్‌లో తడబడుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అతడు ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడితే రెండింట్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
- యువరాజ్ సింగ్ పేరు.. శతకంతో రికార్డ్: కెనడా ‘యువీ’ సెన్సేషన్ Yuvraj Samra: ప్రస్తుతం పొట్టి ప్రపంచకప్‌లో ఓ కుర్రాడి పేరు నెట్టింట మార్మోగుతోంది. అతి చిన్న వయసులో టీ20 ప్రపంచకప్‌లో శతకంతో అదరగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.