Indian Army: ఆర్మీకి ‘అశనీ దళం’ వెన్నుదన్ను.. సైన్యం చేతికి మట్టి అంటకుండా..!

Eenadu icon
By National News Team Updated : 21 Dec 2025 19:51 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత అమ్ముల పొదిలోకి మరిన్ని అధునాతన సాంకేతిక ఆయుధాలు చేరనున్నాయి. 850 ఆత్మాహుతి డ్రోన్ల (kamikaze) (కాముకాజి) కొనుగోలు ప్రక్రియ తుదిదశలో ఉంది. డిసెంబర్‌ చివరి వారంలో జరగనున్న రక్షణ మంత్రిత్వశాఖ ఉన్నతాధికారుల సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పహల్గాం ఘటన నేపథ్యంలో.. భారత్‌ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సాంకేతికను అందిపుచ్చుకుంటూ ప్రాణనష్టం జరగకుండా.. శత్రు మూకల్ని అంతం చేసేందుకు వీలుగా ఆత్మాహుతి డ్రోన్లను సమకూర్చుకుంటోంది. కేవలం ఆర్మీలోనే ( Indian Army) కాకుండా నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లోనూ ఈ తరహా డ్రోన్ల వాడకాన్ని మరింత పెంచుకోవాలన్న లక్ష్యంతో మొత్తం 30 వేల డ్రోన్లను సమకూర్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే తొలి విడతగా 850 డ్రోన్ల కొనుగోలు ప్రక్రియ ఊపందుకుంది.

ఏంటీ ఆత్మాహుతి డ్రోన్లు?

ఈ ఆత్మాహుతి డ్రోన్లను నేషనల్‌ ఏరోస్పేస్‌ లేబొరేటరీస్‌ (NAL) అభివృద్ధి చేస్తోంది. వెయ్యి కిలోమీటర్ల దాకా ఎగరగలవు. రాడార్ల కళ్లుగప్పి.. లక్ష్యాలను ఛేదించగలవు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలోనూ ఇలాంటి డ్రోన్లను వినియోగిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, దాని మిత్రదేశాల నౌకా దళాలపై దాడులకు జపాన్‌ తన యుద్ధవిమానాలను ఆత్మాహుతి దాడులకు వాడింది. వారిని కాముకాజి ఆత్మాహుతి దళాలుగా పిలిచేవారు. ఈ తరహాలోనే డ్రోన్‌లు పనిచేయనున్నాయి.

ఆర్మీకి వెన్నుదన్నుగా అశనీ దళం!

భారత పదాతి దళం ఈ రకం డ్రోన్ల వినియోగాన్ని గణనీయంగా పెంచాలని భావిస్తోంది. క్రమంగా వీటిని ఎయిర్‌ఫోర్స్‌, నేవీలోనూ వినియోగించేందుకు అవకాశాలను పరిశీలిస్తోంది. అయితే వీటిని ఒక్కొక్కటిగా ప్రయోగిస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. ఒక్కో ప్లాటూన్‌లో కనీసం 10 డ్రోన్లు ఉంటాయి. దీనిని అశనీ  (Ashni) దళంగా ఆర్మీ చెబుతోంది. వీటన్నింటినీ ఒకేసారి గుంపుగా ప్రయోగిస్తారు. వీటిలో కొన్ని నిఘా కోసం పని చేయగా.. మిగతా డ్రోన్లు శత్రు లక్ష్యాలను ఛేదిస్తాయి. పేలుడు పదార్థాలు మోసుకెళ్తున్న డ్రోన్లు.. శత్రు రాడార్లకు దొరక్కుండా నిఘా డ్రోన్లు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తాయి. సరైన అవకాశం లభించే వరకు వేచి చూసి దాడి చేయడం ఈ డ్రోన్ల ప్రత్యేకత. వీటి పని తీరును తెలుసుకునేందుకు అరుణాచల్ ప్రదేశ్‌లోని కమెంగ్‌ సెక్టార్‌లో సైన్యం ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరిశీలించింది.

ఆపరేషన్‌ సిందూర్‌ ప్రేరణగా..

ఏప్రిల్‌ 22న జరిగిన పహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన భారత్.. క్షిపణులతో పాక్‌ భూభాగంపై విరుచుకుపడింది. పలు స్థావరాలను నేలమట్టం చేసింది. దాడికి పాల్పడినట్లు భావించిన 9 మంది ఉగ్రవాదుల్లో ఏడుగురిని ఒకే రోజు హతమార్చింది. భారత్‌ను అడ్డుకునే సత్తా లేని పాకిస్థాన్‌.. సామాన్యులే లక్ష్యంగా పెద్ద సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది. వీటిని భారత్‌ సమర్థంగా అడ్డుకున్నప్పటికీ.. భవిష్యత్‌లో వాటి ముప్పును అధిగమించేందుకు వీలుగా డ్రోన్‌ శక్తిని గణనీయంగా పెంచుకుంటోంది.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 18:50 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఐఎన్‌ఎస్‌ కృష్ణ జలప్రవేశం తొలి స్వదేశీ కేడెట్‌ శిక్షణ నౌక (సీటీఎస్‌) ఐఎన్‌ఎస్‌ కృష్ణ జలప్రవేశం చేసినట్టు నేవీ వర్గాలు మంగళవారం తెలిపాయి. చెన్నైలోని కట్టుపల్లి వద్ద లార్సన్‌ అండ్‌ టుబ్రో యార్డులో ఈ కార్యక్రమం జరిగినట్లు వెల్లడించాయి.
  • కర్ణాటకలో హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌ కర్ణాటకలోని కోలారు జిల్లా వేమగల్‌లో భారత తొలి ప్రైవేటురంగ హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌ ‘ఫైనల్‌ అసెంబ్లీ లైన్‌’ (ఎఫ్‌ఏఎల్‌)ను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తో కలిసి ముంబయి నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.
  • నూరుకోట్లకు బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారుల సంఖ్య దేశంలో బ్రాడ్‌ బ్యాండ్‌ వినియోగదారుల సంఖ్య గత పదేళ్లలో ఆరు కోట్ల నుంచి వంద కోట్లకు చేరిందని కేంద్ర కమ్యూనికేషన్లశాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. 2014-2025 మధ్యకాలంలో ఈ గొప్ప మైలురాయిని దాటడం సాధ్యమైందని చెప్పారు.
  • శ్రీపెరుంబుదూర్‌లో అతిపెద్ద కార్మిక ఆసుపత్రి తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్‌లో కార్మికుల కోసం దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి నిర్మించనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి తంగం తెన్నరసు ప్రకటించారు. 18,720 పడకల ఈ ఆసుపత్రి నిర్మాణానికి రూ.706 కోట్లు కేటాయించారు.
  • ఫ్రాన్స్‌తో భాగస్వామ్యం ఇక ప్రత్యేకం తమ మధ్య సంబంధాలను ‘ప్రత్యేక ప్రపంచవ్యాప్త వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచాలని భారత్‌-ఫ్రాన్స్‌ నిర్ణయించాయి.
  • పిటిషన్లలో ఏఐ వినియోగం ఆందోళనకరం కృత్రిమ మేధ సాధనాల సాయంతో రూపొందించిన పిటిషన్లను న్యాయస్థానాలకు సమర్పించే వైఖరి న్యాయవాదుల్లో ప్రబలడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
  • కొంకణ్‌ తీర పర్యాటకులకు డాల్ఫిన్ల గుంపు కనువిందు మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లా పరిధిలో గల కొంకణ్‌ తీరంలో పర్యాటకులకు డాల్ఫిన్లు గుంపుగా కనిపించి కనువిందు చేశాయి.
  • వైద్యుడి ఫోన్‌ నంబరు కోసం గూగుల్‌లో వెదికితే.. ఖాతా ఖాళీ సైబర్‌ కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో ప్రజల ఖాతాలను గుల్ల చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని శహడోల్‌ జిల్లాలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది.
  • కాంగ్రెస్‌ మనుగడకు మూలం అసమ్మతే అసమ్మతిని సహించలేని పరిస్థితిలో కాంగ్రెస్‌ ఉంటే అది ఆ పార్టీ వినాశనానికే దారి తీస్తుందని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు మణిశంకర్‌ అయ్యర్‌ అభిప్రాయపడ్డారు.
  • అదో తుగ్లకీయ కమిషన్‌ ఎన్నికల సంఘం ‘‘తుగ్లకీయ కమిషన్‌’’లా వ్యవహరిస్తోందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఆరోపించారు.
  • బెంగాల్, తమిళనాడుల్లో ఏప్రిల్‌లో ఎన్నికలు! నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలను ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అధికారులు మంగళవారం వెల్లడించారు.
  • రైళ్ల మరుగుదొడ్లలో జెట్‌ స్ప్రేలు రైలు బోగీల్లోని మరుగుదొడ్లలో కొళాయి, చైన్‌తో కూడిన స్టీలు మగ్గుల స్థానంలో జెట్‌ స్ప్రేలు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
  • ఆసక్తికరమైన ఏఐ ప్రాజెక్టులు ప్రదర్శించిన ఎల్‌పీయూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఇండియా-ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పోలో లవ్లీ ప్రొఫెషనల్‌ విశ్వవిద్యాలయ (ఎల్‌పీయూ) ప్రాజెక్టులు అందరి మన్ననలు పొందాయని వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
  • మాకు పెన్షన్లు వద్దు శ్రీలంక చట్టసభ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పదవీకాలం ముగిశాక పెన్షన్లు తీసుకోరాదని నిర్ణయించారు.
  • కె2 విటమిన్‌తో ఎముకలు బలోపేతం డి విటమిన్‌ క్రియాశీల రూపమైన కాల్సిట్రియోల్‌గా మారేందుకు మెగ్నీషియం చాలా అవసరం.
  • గేట్స్‌ హాజరుపై సందిగ్ధం! ఏఐ సమిట్‌కు బిల్‌ గేట్స్‌ హాజరవుతారా లేదా అన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ఆయన హాజరుకాబోవడం లేదని తొలుత ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.
  • చదరపు మీటరు ఉష్ణమండల అడవితో ఏటా 240 లీటర్ల వర్షపాతం ఉష్ణమండల ప్రాంతాల్లో ప్రతి చదరపు మీటరు అడవి వల్ల ఏటా దాదాపు 240 లీటర్ల వర్షపునీరు లభ్యమవుతోందని తాజా అధ్యయనం పేర్కొంది.
  • బైకర్‌ను ఢీకొన్న కారు.. వైరల్‌గా మారిన వీడియో దేశరాజధాని దిల్లీలో ఒక మైనర్‌ బాలుడు(17) తన స్కార్పియో వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి బైక్‌పై ప్రయాణిస్తున్న 23 ఏళ్ల సాహిల్‌ ధానేశ్ర అనే వ్యక్తి మృతికి కారణమయ్యాడు.
  • కేంద్ర మంత్రి పురీ రాజీనామా చేయాలి: కాంగ్రెస్‌ జెఫ్రీ ఎప్‌స్టీన్‌ ఫైళ్ల వ్యవహారంపై కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ వరుసబెట్టి అబద్ధాలాడుతున్నారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండు చేసింది.
  • వనవటు దేశమా.. అలాంటిదేదీ లేదే!: సుప్రీం వనవటు అనే దేశమేదీ లేదే అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

English Translation

Indian Army: 'Ashani Dal' backs the army.. Army's hands are not soiled..!

Eenadu icon
By National News Team Updated : 21 Dec 2025 19:51 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

InternetDesk: More advanced technological weapons are coming to Indian consumers' wallets. The procurement of 850 suicide drones (kamikaze) is in the final stage. A final decision on this will be taken in the defense ministry's meeting to be held in the last week of December. In the wake of the Pahalgam incident in April this year.. India is acting more alert. Providing technology and providing suicide drones to eliminate the enemy group without loss of life. Not only in the Army (Indian Army) but also in the Navy and Air Force, plans are being made to provide a total of 30 thousand drones with the aim of increasing the use of these types of drones. As a part of this, the process of purchasing 850 drones in the first phase has gained momentum.

What suicide drones?

These suicide drones are being developed by the National Aerospace Laboratories (NAL). Can fly up to a thousand kilometers. The eyes of the radars can penetrate the targets. Similar drones are being used in the Russia-Ukraine war. In World War II, Japan used its warplanes for suicide attacks against the naval forces of Britain and its allies. They were called the Kamukazi Suicide Squad. Drones will work in the same way.

Ashani Dal as the backbone of the army!

Indian infantry is expected to significantly increase the use of this type of drones. Gradually, the possibilities of using these in Air Force and Navy are being considered. But applying these individually will not be of much benefit. Each platoon consists of at least 10 drones. Army calls it Ashni force. All of these are applied simultaneously as a group. While some of these work for surveillance, the rest of the drones attack enemy targets. Drones carrying explosives.. Surveillance drones provide information from time to time without being detected by enemy radars. The specialty of these drones is to wait until the right opportunity and attack. The Army has already conducted a test in the Kameng sector of Arunachal Pradesh to find out how they work.

Inspired by Operation Sindoor..

In retaliation for the Pahalgam attack on April 22, India launched Operation Sindoor.. and fired missiles at Pakistani territory. Many settlements were razed to the ground. It killed 7 out of 9 terrorists believed to be involved in the attack in one day. Pakistan, which does not have the power to stop India, launched a large number of drones targeting common people. Although India has effectively prevented them, it is increasing its drone power significantly to overcome their threat in the future. href="https://www.facebook.com/eenaduonline/" target="_blank" rel="noopener">Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 18:50 IST

Note:Advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • INS Krishna Jalpravesam Navy sources said on Tuesday that the first indigenous Cadet Training Ship (CTS) INS Krishna has entered the water. The event was held at the Larson and Toubro yard at Kattupally, Chennai.
  • A helicopter assembly unit in Karnataka. India's first private helicopter assembly unit 'Final Assembly Line' (FAL) at Vemagal in Kolaru district of Karnataka was inaugurated virtually from Mumbai on Tuesday by Prime Minister Narendra Modi and French President Emmanuel Macron. Union Minister of State for Communications Pemmasani Chandrasekhar said that the number of broadband users in the country has increased from six crore to one hundred crore in the last ten years. It is possible to cross this great milestone between 2014-2025.
  • Largest labor hospital in Sriperumbudur Finance Minister Thangam Thennarasu has announced that the country's largest hospital for workers will be built at Sriperumbudur in Kancheepuram district of Tamil Nadu. 706 crores have been allocated for the construction of this 18,720-bed hospital.
  • Partnership with France is now special. India-France have decided to elevate their ties to the level of a 'Special Global Strategic Partnership'.
  • Use of AI in petitions is a concern The Supreme Court has expressed deep concern over the prevailing attitude among lawyers to submit petitions prepared with the help of artificial intelligence tools to the courts. Tourists were spotted by a group of dolphins on the Konkan coast of Sindhudurg district in Maharashtra.
  • If you search for the doctor's phone number on Google, the account is empty. Cyber crooks are constantly hacking people's accounts in new ways. Another incident came to light in Shahdol district of Madhya Pradesh.
  • Dissent is the source of survival of Congress. Senior Congress leader Mani Shankar Iyer opined that if the Congress is in a situation where dissent cannot be tolerated, it will lead to the destruction of the party.
  • That is the Tughlaqiya Commission. West Bengal Chief Minister Mamata Banerjee on Tuesday accused the Election Commission of acting like a "Tughlaqiya Commission".
  • Elections in Bengal and Tamil Nadu in April! The Central Election Commission (EC) officials revealed on Tuesday that the assembly elections for four states and one union territory will be held in April.
  • Jet sprays in train toilets. The railway department has decided to install jet sprays in the toilets of train coaches instead of steel faucets with taps and chains.
  • LPU has demonstrated interesting AI projects. Lovely Professional University's (LPU) projects were well received at the India-AI Impact Expo inaugurated by Prime Minister Narendra Modi, the varsity said in a statement.
  • We don't want pensions. Sri Lankan lawmakers took a crucial decision. It has been decided that pensions will not be drawn at the end of the tenure.
  • Strengthen bones with K2 vitamin. Magnesium is essential for the conversion of vitamin D into calcitriol, the active form. There is doubt whether Bill Gates will attend the AI ​​Summit or not. At first the government sources announced that he was not going to attend.
  • Square meter of tropical forest with 240 liters of annual rainfall. According to a recent study, every square meter of forest in tropical areas is getting about 240 liters of rainwater annually. A minor boy (17) recklessly drove his Scorpio vehicle and killed a 23-year-old cyclist Sahil Dhanesra in Delhi.
  • Union Minister Puri should resign: Congress The Congress Party has demanded that Union Minister Hardeep Singh Puri should resign immediately on the issue of Jeffrey Epstein files. The Supreme Court commented that there is no such country as Vanuatu.