హైదరాబాద్, డిసెంబర్ 21:తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తి స్థాయి ఛార్జిషీట్‌కు సిట్ చీఫ్, హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశించారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్‌లో సిట్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారించాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉందని.. ఈ నేపథ్యంలో అందరూ జవాబుదారితనంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు.
మరో వైపు ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావును గత 10 రోజులుగా కస్టోడియల్ విచారణలో ఉన్నారు. ఈ విచారణలో ఆయన నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు సిట్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. తొలుత చార్జీషీట్ వేసి.. అనంతరం కేసుతో సంబంధమున్న వారందరిని విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకులతో పాటు ఉన్నతాధికారులను సైతం విచారించేందుకు సిట్ తగిన ఏర్పాట్లు చేస్తోంది.
ఈ కేసులో నిందితుడు ప్రభాకర్ రావును సిట్ చీఫ్ ప్రభాకర్ రావు విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు నిందితులను ఏసీపీ, డీసీపీ, జాయింట్ సీపీ స్థాయి అధికారులు మాత్రమే విచారించారు. కమిషనర్ స్థాయిలో అధికారి.. నిందితుడిని విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
For MoreTG NewsAndTelugu News
English Translation
Hyderabad, December 21:SIT Chief, Hyderabad CP Sajjanar has ordered a full charge sheet in the phone tapping case that created a sensation in Telangana. He had a meeting with SIT officials at Command Control in Banjara Hills on Sunday. On this occasion, he directed the higher officials to investigate everyone involved in the phone tapping. It is clear that this case is under the jurisdiction of the Supreme Court.. In this context, everyone should act with accountability.
On the other hand, Prabhakar Rao, who is a key player in this case, has been under custodial investigation for the last 10 days. The SIT officials have already found that they have obtained vital information from him in this investigation. It seems that the stage is being prepared to first file the charge sheet and then to interrogate all those related to the case. SIT is making adequate arrangements to interrogate political leaders as well as high officials.
It seems that SIT chief Prabhakar Rao is likely to interrogate accused Prabhakar Rao in this case. But in this case till now the accused have been interrogated only by ACP, DCP and Joint CP level officials. It is reported that the commissioner level officer is preparing to investigate the accused.
Also read this news..
For MoreTG NewsAndTelugu News