హైదరాబాద్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి):సమైక్యాంధ్రలో మహబూబ్‌నగర్ జిల్లా వివక్షకు గురైందని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Kalvakuntla Chandrasekhar Rao)సంచలన వ్యాఖ్యలు చేశారు. సమైక్యాంధ్రలో కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు కలిసి మహబూబ్‌నగర్ ప్రాజెక్టుకు ద్రోహం చేశాయని ధ్వజమెత్తారు. తెలంగాణ నదీ జలాలకు బీఆర్ఎస్ మాత్రమే శ్రీరామరక్ష అని వ్యాఖ్యానించారు. తెలంగాణపై ఆర్తి బీఆర్ఎస్‌కు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు మరో ఉద్యమం చేపడదామని పిలుపునిచ్చారు. ఇవాళ(ఆదివారం) తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నేతలకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు కేసీఆర్.
ఈ సమావేశంలో పాలమూరుకు జరిగిన ద్రోహంపైనే చర్చించామని అన్నారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, 20 ఏళ్లు పాలించిన టీడీపీ.. మహబూబ్‌నగర్ జిల్లాకు ద్రోహం చేశాయని ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లో కృష్ణా నది 300 కిలోమీటర్లు ప్రవహిస్తోందని వివరించారు. 174 టీఎంసీలు మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులకు రావాల్సి ఉందని తెలిపారు. విభజనతో మహబూబ్‌నగర్‌కు చాలా నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రతిపాదిత ప్రాజెక్టులను మార్చొద్దని SRCలో స్పష్టంగా ఉందని తెలిపారు. ఈ విషయంపై బ్రిజేష్ ట్రైబ్యునల్‌కి కూడా అనేకసార్లు విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు కేసీఆర్.
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీని అసెంబ్లీ వేదికగా ప్రశంసించామని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ మొత్తాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచానని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్ కిట్ పథకాన్ని కూడా కాంగ్రెస్ సర్కార్ ఎందుకు నిలిపివేసిందని నిలదీశారు. బస్తీ దవాఖానాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రైతులను రాచి రంపాన పెడుతోందని మండిపడ్డారు. రైతులకు నీళ్లు ఇచ్చే చెక్ డ్యామ్‌లను పేల్చివేయడం దారుణమని వాపోయారు. తాము అధికారంలోకి వచ్చాక కూల్చినవాళ్లు పాతాళంలో ఉన్నా పట్టుకువస్తామని హెచ్చరించారు కేసీఆర్.
తమ హయాంలో పాలమూరు, నల్లగొండ జిల్లాలను అద్భుతంగా తీర్చిదిద్దామని వ్యాఖ్యానించారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పడావు పెట్టారు? అని ప్రశ్నించారు. ఇంకా ఎందుకు పూర్తి చేయలేదని.. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని నిలదీశారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుపై మండల, జిల్లాస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. కృష్ణా జలాల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆవేశంగా ఉన్నారని అన్నారు. ప్రతిపక్షంగా మన బాధ్యతను నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. మరో 20 రోజుల్లో పాలమూరులో భారీ బహిరంగ సభ పెడతామని కేసీఆర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read LatestTelangana NewsandNational News
English Translation
Hyderabad, December 21 (Andhra Jyoti):BRS chief Kalvakuntla Chandrasekhar Rao has made disturbing comments that Mahbubnagar district has been discriminated against in Samaikyandhra. In Samaikyandhra, the central and state governments have jointly betrayed the Mahabubnagar project. He commented that BRS is only Sri Ramaraksha for Telangana river waters. He said that only BRS will have Aarti on Telangana. He called for another movement to protect the interests of the state. Today (Sunday) KCR held a wide-scale meeting with BRS leaders at Telangana Bhavan. In this meeting, the leaders were given directions on several key issues. Later, KCR spoke to the media.
He said that the betrayal of Palamuru was discussed in this meeting. The Congress which ruled for 50 years and the TDP which ruled for 20 years.. were accused of betraying Mahabubnagar district. It is explained that Krishna river is flowing 300 kilometers in Mahabubnagar. He said that 174 TMCs have to come for the projects of Mahabubnagar district. It is said that Mahbubnagar has suffered a lot due to partition. He said it was clear in the SRC not to change the proposed projects. KCR stated that he has appealed to the Brijesh Tribunal several times on this matter. He reminded that Arogyashri has been praised as a venue for the assembly. He said that the amount of Arogyashri has been increased from Rs.2 lakh to Rs.5 lakh. What is the Congress government doing now? They showered questions. Why did the Congress government stop the KCR kit scheme also? He expressed his concern that Basti hospitals are being weakened. They said that the Congress is exploiting the farmers. They complained that blowing up the check dams that provide water to the farmers is atrocious. KCR warned that once he came to power, those who destroyed him would be caught even if they were in the underworld. Why was the Palamuru-Ranga Reddy project shelved? He asked. Why has it not been completed yet? Why are they neglecting it? He said that meetings will be held at mandal and district level on the Palamuru-Ranga Reddy project. He criticized the Congress government for compromising on the issue of Krishna waters. He said that people are angry with the Congress government. He called us to fulfill our responsibility as opposition. KCR said that he will hold a huge public meeting in Palamuru in next 20 days.
Read this news also..
Read LatestTelangana NewsandNational News