Crime news: మెదక్ జిల్లాలో దారుణం.. మూడేళ్ల కుమారుడిని చంపిన తండ్రి

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

మెదక్ రూరల్: మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనకు పుట్టలేదన్న అనుమానంతో తండ్రే.. కుమారుడిని హత్య చేసిన విషాద ఘటన మెదక్ మండలంలోని పెద్దబాయి తండాలో ఆదివారం చోటు చేసుకుంది. మెదక్ గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దబాయి తండాకు చెందిన బదావత్ భాస్కర్‌కు అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది.
దంపతులిద్దరూ కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. భార్యభర్తల మధ్య తరచూ కుటుంబ గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో శుక్రవారం భాస్కర్ తన భార్యను కొట్టాడు. దీంతో ఆమె మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. కుమారుడు రెండ్రోజులుగా తండ్రి వద్దే ఉన్నాడు. బాబు తనకు పుట్టలేదనే అనుమానంతో తాడుతో గొంతు బిగించి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న గ్రామీణ ఠాణా పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. భాస్కర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :English Translation
Crime news: Atrocity in Medak district.. Father kills three-year-old son

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Medak Rural: Atrocity in Medak district took place. The tragic incident of a father killing his son on the suspicion that he was not born took place on Sunday in Peddabai Tanda of Medak Mandal. According to the details of the Medak rural police, Badawat Bhaskar of Peddabai Tanda was married to a young woman from a village in the same mandal six years ago.
Both the couple are making a living by doing labour. They have a three-year-old son. There are frequent family quarrels between husband and wife. Bhaskar beat his wife on Friday. So she got treated at Medak Government Hospital and went home. The son stayed with his father for two days. Babu suspected that he was not born and strangled him with a rope. The Gramin Thana Police came to know about the matter and shifted the boy's body to Medak Area Hospital for post-mortem. Bhaskar has been detained and is being interrogated.
► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :