
హైదరాబాద్:కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి తెలంగాణకు తెచ్చింది ఏమైనా ఉందా? అని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ 12 ఏళ్ల పాలనపై రాష్ట్రంలోని మా రెండేళ్ల పాలనై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరాఉ. రాష్ట్ర అభివృద్ధికి కిషన్‌రెడ్డి మోకాలు అడ్డుతున్నారని, మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణలను కిషన్‌రెడ్డి అడ్డుకున్నారని మహేష్‌గౌడ్ మండిపడ్డారు. తాము ఇచ్చిన హామీల్లో మెజార్టీ హామీలను నెరవేర్చామన్నారు మహేష్‌గౌడ్.
కేసీఆర్ ప్రజా జీవితంలో ఉంటే సంతోషమే..
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా జీవితంలో ఉంటే సంతోషమేనన్నారు మహేష్ గౌడ్. కేసీఆర్, హరీష్ చేసిన తప్పిదాల వల్లే నదీజాలల సమస్యలు వచ్చాయన్నారు. వృథా ప్రాజెక్టుల కోసం కేసీఆర్ అనవరసరప ఖర్చు చేశాడని, తామ కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటన్నామన్నారు. అప్పులపై కేసీఆర్ ఏం సంజాయిషీ ఇస్తారో చూద్దామన్నారు. ప్రతిపక్షాలు ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తాము 70 శాతం సీట్లు గెలిచామని, మరి బీఆర్‌ఎస్ ఎక్కడుంది?అని ప్రశ్నించారు మహేష్ గౌడ్.
English Translation

Hyderabad: Union Minister, BJP MP TPCC chief Mahesh Goud flagged Kishan Reddy. Is there anything that Kishan Reddy has brought to Telangana as Union Minister? Criticized that. Are we ready to discuss BJP's 12-year rule at the center and our two-year rule in the state? He challenged that. Mahesh Goud said that Kishan Reddy is obstructing the development of the state, that Kishan Reddy has blocked the cleaning of the moose and metro expansion. Mahesh Goud said that he has fulfilled most of the promises he made.
KCR is happy if he is in public life..
BRS chief Mahesh Goud said that KCR is happy if he is in public life. He said that the problems of rivers have come due to the mistakes made by KCR and Harish. He said that KCR has spent inordinately on useless projects and he wants KCR to come to the assembly. Let's see what KCR will do on the debts. He said that Congress wants to have opposition parties. Mahesh Goud asked that they won 70 percent seats in the panchayat elections, where is BRS?