వరంగల్:మాజీ మావోయిస్ట్, సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యపై నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు కేసు నమోదు చేశారు. జాఫర్‌ఘడ్‌లోని ఇన్నయ్యకు చెందిన మా ఇల్లు అనాథాశ్రమంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఇన్నయ్యను అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నయ్య ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఇన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేయబోతున్నారంటూ వార్తలు రావటం చర్చనీయాంశంగా మారింది.
భావోద్వేగ ప్రసంగం..
మావోయిస్టు నేత హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత గాదె ఇన్నయ్య ఛత్తీష్‌గడ్ వెళ్లారు. హిడ్మా తల్లిని కలిశారు. అక్కడున్న నేషనల్, స్టేట్ మీడియాతో పాటు యూట్యూబ్ ఛానళ్లతో హిడ్మా మరణంపై ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. ఈ సమయంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా మాట్లాడారు. అమిత్ షా తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై ఎన్ఐఏ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే చాలా సార్లు నోటీసులు పంపింది. తాజాగా, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఇన్నయ్యపై కేసు నమోదు చేసింది. కాగా, ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో 200 మంది అనాథ పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు.
ఇవి కూడా చదవండి
English Translation
Warangal:National Intelligence Agency officials have registered a case against former Maoist and social activist Gade Inaiah. Officials conducted searches at Ma Illu Orphanage, belonging to Innayya in Zafarghad. It is reported that Innaya is ready to be arrested. It seems that there is a possibility of arresting him on the charges of having links with Maoists. Inaiah recently spoke against Union Home Minister Amit Shah. It is in this background that the news that Innaya is going to be arrested by the NIA officials has become a topic of discussion. Gade Inaiah went to Chhattisgarh after the Hidma encounter. Met Hidma's mother. He gave an emotional speech on Hidma's death to the national and state media and YouTube channels there. It was at this time that he spoke against Union Home Minister Amit Shah. Amit Shah's behavior was wrong. It is in this background that NIA focused on him. Already sent many notices. Recently, a case has been registered against Inaiah for alleged links with Maoists. Meanwhile, 200 orphans are taking shelter in the orphanage run by Innaya.
Also read