హైదరాబాద్, డిసెంబర్ 21:తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హీట్ పెరిగింది. ప్రభుత్వ విప్, కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పార్టీ కార్యాలయానికి రావడం కాదు, అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ - బీజేపీ మధ్య 'చీకటి దోస్తానా' ఉందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ కేసీఆర్‌కు ఒక 'చీటీ' పంపారని, ఆ పని చేయడానికే కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు.


'మునిగిపోతున్న పార్టీని కాపాడుకోవడం కోసమే కేసీఆర్ బయటకు వచ్చారు. ప్రజల కోసం కాదు. మోదీ.. కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీయడం దేనికి సంకేతం? ఇంకా ఎంతకాలం ఈ చీకటి దోస్తానా చేస్తారు?" అని ప్రశ్నించారు. గతంలో నల్ల చట్టాలకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని, ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగిస్తే బీఆర్ఎస్ నాయకులు నోరు మెదపకపోవడాన్ని విమర్శించారు.

KCR వస్తే అసెంబ్లీలో చర్చిద్దామని సవాల్ విసిరిన ఆది శ్రీనివాస్, ఎనిమిది లక్షల కోట్ల అప్పులు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోవడం వంటి అంశాలపై కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణా-గోదావరి జలాలను రాయలసీమకు మళ్లిస్తానని మాజీ మంత్రి రోజా ఇంటికి వెళ్లి కేసీఆర్ చెప్పారని, దీనికి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు.


ఇవి కూడా చదవండి


English Translation

Hyderabad, December 21:Heat has once again increased in Telangana politics. Government Whip and Congress leader Adi Srinivas criticized former Chief Minister KCR. He challenged KCR not to come to the party office, but to come to the assembly. He alleged that there is a 'dark nemesis' between BRS and BJP. He made sensational comments that Prime Minister Modi had sent a 'cheeti' to KCR and KCR has come out to do that.


'KCR has come out only to save the sinking party. Not for the people. Modi.. What is the sign of inquiring about KCR's health? How long will they do this dark dosta?" he asked. BRS had supported black laws in the past and BRS leaders criticized the fact that Gandhi's name was removed from the employment guarantee scheme.

Adi Srinivas, who challenged KCR to discuss in the assembly, demanded an apology from KCR on issues such as eight lakh crore debts and the collapse of the Kaleshwaram project. Krishna-Godavari waters. He said that former Minister Roja went to KCR's house and told him that he would be transferred to Rayalaseema, and KCR should apologize to the people of Telangana for this.


Also Read