కర్నూలు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి):వైసీపీ (YSRCP)లో మరోసారి నేతల మధ్య తీవ్ర విభేదాలు, కుమ్ములాటలు బయటపడ్డాయి. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)53వ పుట్టినరోజు వేడుకలను వైసీపీ నేతలు నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జరిగిన బర్త్‌డే వేడుకలు చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జరిగిన వివాదం వైసీపీ శ్రేణుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. జగన్ పుట్టినరోజు వేడుకను వేర్వేరుగా నిర్వహించడమే దీనికి కారణంగా తెలుస్తోంది.


వైసీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి రాజీవ్ రెడ్డి, కర్నూలు పార్లమెంటు సమన్వయకర్త బుట్టా రేణుక, ఆ పార్టీ సీనియర్ నాయకుడు రుద్ర గౌడ్‌లు వేర్వేరుగా పుట్టిన రోజు వేడుకలు జరిపారు. ఈ వివాదం ఇప్పుడు వైసీపీలో అంతర్గత విభేదాలకు నాంది పలికింది. ఫ్యాన్ పార్టీ నేతల మధ్య నెలకొన్న రగడ అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ కుమ్ములాటలతో వైసీపీ కార్యకర్తలు కూడా అయోమయంలో పడ్డారు.


పార్టీలో అగ్రనాయకులే ఇలా వేర్వేరుగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడమెంటనీ కార్యకర్తలు నిలదీస్తున్నారు. ఇలాంటి ఘటనలు పార్టీ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని వైసీపీ నేతలు వాపోతున్నారు. ఇప్పటికైనా హైకమాండ్ పట్టించుకోని నేతల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించాలని ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.


చిత్తూరులో భగ్గుమన్న వర్గ విభేదాలు

జగన్ జన్మదిన వేడుకల నేపథ్యంలో చిత్తూరు వైసీపీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. రెండు వర్గాలు విడిపోయి పోటాపోటీగా వేడుకలు నిర్వహించారు. అసంతృప్తి వర్గానికి డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ అండదండలు ఉన్నాయని సమాచారం. ఆయనకు మద్దతుగా పలువురు కీలక నాయకులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కార్పొరేషన్‌లో వైసీపీకి ప్రాతినిధ్యం ఉన్న డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గిరింపేట వద్ద జగన్ పుట్టినరోజు సంబరాలు జరిగాయి.


అసంతృప్తి వాదులు మొత్తం చిత్తూరు జిల్లా వైసీపీ అగ్రనేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విధేయులే ఉండటం గమనార్హం. గిరింపేట వద్ద చంద్రశేఖర్ ఏర్పాటు చేసిన బ్యానర్‌లలో చిత్తూరు వైసీపీ ఇన్‌చార్జ్ విజయానంద రెడ్డి ఫొటో ఎక్కడ కనిపించలేదు. ఇప్పటివరకు తమ పార్టీలో వర్గాలు లేవని.. సమన్వయకర్త తమకు ప్రాధాన్యం ఇవ్వకపోతే వర్గాలుగా ఏర్పడిన ఆశ్చర్య పోవాల్సిన పని లేదని డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Read LatestAP NewsAndTelugu News


English Translation

Kurnool, December 21 (Andhra Jyothi):YCP (YSRCP) once again had deep differences and fights among the leaders. The YCP leaders are organizing the 53rd birthday celebrations of YCP leader and former Chief Minister YS Jagan Mohan Reddy. In this order, the birthday celebrations held in Emmiganoor constituency became a topic of discussion. The dispute in Emmiganoor constituency has become a hot topic among YCP ranks. The reason for this seems to be that Jagan's birthday celebration was held separately.


YCP Mmiganoor Constituency In-charge Rajeev Reddy, Kurnool Parliament Coordinator Butta Renuka and senior party leader Rudra Goud held separate birthday celebrations. This dispute has now become the beginning of internal differences in YCP. The tussle between the Fan Party leaders raises many questions. The YCP workers are also confused by these clashes.


The party workers are protesting that the top leaders of the party are holding different birthday celebrations. YCP leaders complain that such incidents will damage the party's ability. The fan party workers want to resolve the differences between the leaders who are still ignored by the high command.


Community differences in Chittoor

Communal differences in Chittoor YCP suddenly split in the wake of Jagan's birthday celebrations. The two factions split up and held rivalries. It is reported that Deputy Mayor Chandrasekhar has the support of the disgruntled group. There are many key leaders supporting him. Jagan's birthday celebrations were held at Girimpeta under the leadership of deputy mayor Chandrasekhar, who represents YCP in the corporation.


It is noteworthy that all the dissidents are the loyalists of Chittoor district YCP leader and former minister Peddireddy Ramachandra Reddy. Chittoor YCP in-charge Vijayananda Reddy's photo was not found in the banners arranged by Chandrasekhar at Girimpet. Deputy Mayor Chandrasekhar said that so far there are no factions in his party.. If the coordinator does not give priority to them, there is no need to be surprised that factions have formed. href="https://www.andhrajyothy.com/" target="_blank" rel="noopener">Telugu News