Allu Arjun: సమయం ఆసన్నమైందా?

Eenadu icon
By Cinema Desk Updated : 21 Dec 2025 05:50 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ల్లు అర్జున్‌ సినిమాల చుట్టూ ప్రస్తుతం చర్చ నడుస్తోంది. సెట్స్‌పై ఉన్న సినిమా గురించి కొంచెమైతే, ఆయన చేయనున్న కొత్త సినిమాల గురించి మరికొంచెం ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నాయి పరిశ్రమ వర్గాలు. అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న అల్లు అర్జున్, ఆ తర్వాత చేయనున్న సినిమాపై ఇంకా స్పష్టత రాలేదు. పలువురు దర్శకుల పేర్లు వినిపించినా, ఆయన ఎవరితో జట్టు కడతారనేది మాత్రం ఇంకా తేలలేదు. అయితే కొత్త సినిమాపై నిర్ణయం తీసుకొనే సమయం మాత్రం దగ్గరికొచ్చిందని, కొత్త ఏడాది ఆరంభంలోనే ఆ సినిమాని ప్రకటించే అవకాశాలున్నట్టు సమాచారం. అట్లీ దర్శకత్వంలో ప్రస్తుతం చేస్తున్న సినిమా వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

దాంతో అల్లు అర్జున్‌ ఈమధ్యే పలువురు దర్శకులతో కథాచర్చలు సాగించినట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ... ఇలా మూడు భాషలకు చెందిన దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. మరి బన్నీ నిర్ణయం ఏమిటనేది త్వరలోనే తెలుస్తుంది. ఇలా ఈ చర్చంతా ఒకెత్తైతే, అల్లు అర్జున్‌ - అట్లీ కలయికలో రూపొందుతున్న సినిమా ఒక భాగంగా వస్తుందా లేక రెండు భాగాలుగానా అనేది ఇంకో చర్చ. రెండు భాగాలుగా సినిమాని తీసుకు రావాలనేది అట్లీ నిర్ణయమని, అందుకే తొలి భాగాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని ప్రచారం సాగుతోంది.  

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 03:10 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • అదే బాధగా అనిపిస్తుంది ‘‘మంచి వినోదంతో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన సినిమా ‘హే బల్‌వంత్‌’’ అన్నారు హీరో సుహాస్‌. ఇది తన కెరీర్‌లోనే చాలా వేగంగా పూర్తి చేసిన చిత్రమని.. దీనితో తాను ఎదురు చూస్తున్న విజయం అందుకుంటాననే నమ్మకముందని ధీమా వ్యక్తం చేశారు.
  • ప్రియమణి.. ఇండో-హాలీవుడ్‌ చిత్రం తెరపై వైవిధ్యమైన పాత్రలతో భావోద్వేగాలను పంచడంతోపాటు.. యాక్షన్‌ సన్నివేశాలతోనూ అదరగొడుతుంది నటి ప్రియమణి. ఇప్పుడామె ఖాతాలో ఓ హాలీవుడ్‌ నిర్మాణసంస్థ రూపొందించనున్న కొత్త ప్రాజెక్ట్‌ చేరింది.
  • బాలీవుడ్‌ వైపు తొలి అడుగు? గతేడాది ‘మదరాసి’, ‘కాంతార 2’ లాంటి చిత్రాలతో మంచి విజయాన్ని అందుకుంది కథానాయిక రుక్మిణీ వసంత్‌. చిత్రపరిశ్రమకు వచ్చిన తక్కువ రోజుల్లోనే భాషతో సంబంధం లేకుండా అవకాశాల్ని అందుకుంటోన్న ఈ భామ..
  • జోడీ కుదిరేనా! గతేడాది ‘జాక్‌’, ‘తెలుసు కదా’ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడు మరో కొత్త సినిమాని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
  • మరకతమణి 2కి శ్రీకారం ఆది పినిశెట్టి నుంచి వచ్చిన ఫాంటసీ కామెడీ థ్రిల్లర్‌ ‘మరకతమణి’ 2017లో విడుదలై.. ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా ‘మరకతమణి 2’ని పట్టాలెక్కించారు ఆది.
  • ఆ పాటలు వాడొద్దు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. సరిగమ సంగీత సంస్థకు, ఆయనకు కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ కేసుకు సంబంధించి దిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
  • వెబ్‌సిరీస్‌ కోసం! ‘క’, ‘కె-ర్యాంప్‌’ విజయాలతో జోరు మీదున్నారు యువ హీరో కిరణ్‌ అబ్బవరం. ఇప్పుడాయన ఓటీటీలోకి తొలి అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘డియర్‌ కామ్రేడ్‌’ ఫేమ్‌ భరత్‌ కమ్మ దర్శకత్వంలో ముస్తాబు
  • గ్రామీణ కథ ‘సెయాన్‌’ ‘సెయాన్‌’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు శివ కార్తికేయన్‌. ‘అమరన్‌’ విజయం తర్వాత ఆయన.. కమల్‌హాసన్‌ సొంత నిర్మాణ సంస్థలో చేస్తున్న రెండో చిత్రమిది. శివకుమార్‌ మురుగేశన్‌ తెరకెక్కిస్తున్నారు.
  • అలియాకు బాఫ్టా గౌరవం ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక అలియా భట్‌కు మరోసారి అంతర్జాతీయ గౌరవం దక్కింది. బాఫ్టా(బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌) 79వ ఎడిషన్‌ పురస్కారాలను అందించే ప్రెజెంటర్ల జాబితాను ప్రకటించింది.
  • సంక్షిప్త వార్తలు (5) ప్రముఖ హిందీ సినీ రచయిత, నటుడు, సల్మాన్‌ఖాన్‌ తండ్రి సలీం ఖాన్‌(90) అనారోగ్య పరిస్థితుల కారణంగా మంగళవారం ముంబయిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. జావేద్‌ అక్తర్‌తో కలిసి ఆయన రచన చేసిన ‘షోలే’, ‘దీవార్‌’, ‘డాన్‌’ చిత్రాలు భారతీయ చిత్రసీమలో నిలిచిపోయాయి.

English Translation
Allu Arjun: Is it time? class="my-2">
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
  • 1 min read

    Acurrent discussion around Allu Arjun movies running If only a little about the movie on the sets, the industry sources are talking a little more interestingly about the new movies he is going to do. Allu Arjun is doing a film under the direction of Atlee, and the next film is not yet clear. Although the names of many directors have been mentioned, it is not yet clear who he will team up with. However, it is reported that the time to decide on the new movie is near and it is possible to announce the movie at the beginning of the new year itself. The film currently under the direction of Atlee will hit the screens next year.

    It seems that Allu Arjun has been in discussions with many directors. Telugu, Tamil, Malayalam... the names of directors from three languages ​​are being heard. And what will be Bunny's decision will be known soon. If all this discussion comes together, whether the Allu Arjun - Atlee combination movie will come in one part or two parts is another discussion. It is said that Atlee's decision was to bring the film in two parts, so the first part will be completed as soon as possible and it will be released next year.  

    ► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 03:10 IST

    Note:Advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no need for correspondence in this matter. "Hey Balwant is a movie full of good entertainment and strong emotions," said hero Suhas. Dhima confidently expressed that this is the fastest film she has completed in her career. She is confident that she will get the success she is waiting for. Apart from sharing emotions with various roles on screen, actress Priyamani also entertains with action scenes. Now a new project to be made by a Hollywood production company has been added to her account.

  • First step towards Bollywood? Last year, heroine Rukmini Vasant got good success with films like 'Madrasi' and 'Kanthara 2'. This Bhama who is getting opportunities regardless of language within few days of entering the film industry..
  • Jodi Kudirena! Last year, protagonist Sidhu Jonnalagadda greeted the audience with the films 'Jack' and 'Telusu Kada'. Now they are gearing up for another new movie.
  • Marakatamani 2 starts It is known that Adi Pinishetti's fantasy comedy thriller 'Marakathamani' was released in 2017 and entertained the audience. Now Adi has released 'Marakatamani 2' as a sequel to the movie.
  • Don't use those songs. Noted music director Ilayaraja was arrested in the court. For Sarigama Music Company, he has a dispute going on in the court. The Delhi High Court has issued an interim order in this case.
  • For the webseries! Young hero Kiran Abbavaram is on a roll with the success of 'Ka' and 'K-Ramp'. Now he is preparing to take his first step into OTT. Mustabu
  • rural story 'Sean' directed by Bharat Kamma of 'Dear Comrade' fame. Protagonist Siva Karthikeyan is preparing to entertain the audience with the movie 'Seyan'. After the success of 'Amaran', this is Kamal Haasan's second film under his own production house. Sivakumar Murugesan is directing.
  • BAFTA honor for Alia Popular Bollywood actress Alia Bhatt has once again received international recognition. BAFTA (British Academy of Film and Television Arts) has announced the list of presenters for the 79th edition of the awards.
  • News in Brief (5) Famous Hindi film writer, actor, Salman Khan's father Salim Khan (90) was admitted to a private hospital in Mumbai on Tuesday due to health conditions. His films 'Sholay', 'Deewar' and 'Don', which he wrote with Javed Akhtar, became a hit in the Indian cinema.