ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో కొంతమంది మగాళ్లు ఆడవాళ్లను వేధిస్తున్న సంఘటనలు బాగా పెరిగిపోయాయి. తాజాగా, పల్నాడు జిల్లాలో దారుణమైన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధించటం మొదలెట్టారు. ప్రేమించకపోతే చంపేస్తామని కూడా బెదిరించారు. వారి వేధింపులు తట్టుకోలేకపోయిన యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కీచక యువకులు జైలు పాలయ్యారు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. పల్నాడులోని సత్తెనపల్లికి చెందిన ఓ బాలిక స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.
ఆ బాలికపై అదే ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల కోటేశ్వరావు, 21 ఏళ్ల కోటయ్యల కన్నుపడింది. ప్రేమ పేరుతో ఆమెను వేధించటం మొదలెట్టారు. కోటేశ్వరావు అనే యువకుడు మరింత దారుణంగా ప్రవర్తించాడు. తనను ప్రేమించకపోతే యాసిడ్ పోసి చంపేస్తానంటూ హెచ్చరించాడు. ఇద్దరు యువకుల వేధింపులు రోజురోజుకు పెరిగిపోసాగాయి. వారి టార్చర్ భరించలేకపోయిన బాలిక ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో కోటేశ్వరావు, కోటయ్యలపై ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిపై ఫోక్సో కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దర్నీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది.
ఇవి కూడా చదవండి
English Translation
In recent times, incidents of some men harassing women in the name of love have increased. Recently, a terrible incident has come to light in Palnadu district. Two youths started harassing a minor girl in the name of love. They also threatened to kill me if I didn't love them. Unable to bear their harassment, the girl told her parents. Keechaka youths were jailed after their parents complained to the police. If we go into the full details of the incident given by the police... a girl from Sattenapalli in Palnadu is studying in the 9th standard in a local school. 20-year-old Koteshwarao and 21-year-old Kotayyala from the same area set their sights on that girl. They started harassing her in the name of love. A young man named Koteswarao behaved even worse. He warned that if he does not love him, he will kill him with acid. The harassment of the two youths increased day by day. Unable to bear their torture, the girl told her parents about this. They immediately approached the police. A complaint was filed against Koteshwarao and Kotayya at the local police station. The police have registered a case against them under FOXO and are investigating. Both were arrested and produced in court. The court remanded them for 14 days.
Also Read