అనకాపల్లి, డిసెంబర్ 21:సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు భారీ తిమింగలం చిక్కింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకకు చెందిన మత్స్యకారులు శనివారం సముద్రంలో వల వేయగా బాగా బరువు అనిపించింది. దీంతో వలలో పెద్దఎత్తున చేపలు పడినట్లు మత్స్యకారులు భావించారు. వలను కొద్ది దూరం లాక్కొచ్చాక అందులో తిమింగలం పడినట్లు గుర్తించారు. వెంటనే దాన్ని ఒడ్డుకు తీసుకొచ్చి, వల నుంచి విడిపించారు. స్థానికుల సాయంతో తిరిగి సముద్రంలోకి తిమింగలాన్ని పంపించారు. అప్పటికే అది కొన ఊపిరితో ఉన్నట్లు మత్స్యకారులు తెలిపారు. అయితే అది మృతి చెందినట్లు మరికొందరు చెబుతున్నారు. దీని బరువు రెండున్నర టన్నుల వరకు ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం పై వీడియోను వీక్షించండి.


ఇవి కూడా చదవండి

Updated at - Dec 21 , 2025 | 11:27 AM


English Translation

Anakapalli, December 21:A huge whale got caught in the net of fishermen who went hunting in the sea. Fishermen from Pudimadaka, Achyutapuram mandal of Anakapalli district cast their nets in the sea on Saturday and felt heavy. The fishermen thought that a large number of fish had fallen in the net. After dragging the net a short distance, it was found that a whale had fallen into it. They immediately brought it to the shore and freed it from the net. With the help of the locals, the whale was sent back to the sea. The fishermen said that it was already suffocating. But others say that it is dead. Fishermen say it can weigh up to two and a half tons. Watch the video above for complete information about this.


Also Read

Updated at - Dec 21 , 2025 | 11:27 AM