Snowfall: జమ్మూ కశ్మీర్‌ను కప్పేసిన మంచు దుప్పటి

Eenadu icon
By National News Team Updated : 21 Dec 2025 12:00 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తర భారతం చలికి వణుకుతోంది. జమ్మూకశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్‌లలో తాజా హిమపాతం (Kashmir snowfall) మొదలైంది. ఎత్తైన భూభాగాల్లో హిమపాతం పెరిగి లోయలోని పలు ప్రాంతాల కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఘనీభవన స్థానం కంటే దిగువకు పడిపోయాయి. జలవనరుల ఉపరితల భాగాల్లో పలుచని మంచు పొరలు కనిపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో సున్నా డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గుల్‌మార్గ్‌లోని స్కై రిసార్ట్‌, సోనామార్గ్‌, దూద్‌పత్రి సహా దక్షిణ, ఉత్తర కశ్మీర్‌లోని ఎత్తైన ప్రాంతాలలో భారీగా మంచు కురుస్తుండటంతో ఆ ప్రాంతాలు శ్వేతవర్ణంలోకి మారిపోయాయి.

కశ్మీర్‌ అంతటా పరుచుకున్న మంచు దుప్పటి ఓ వైపు పర్యాటకులను ఆకర్షిస్తుండగా.. మరోవైపు భారీగా మంచు పేరుకుపోయి పెద్ద సంఖ్యలో రోడ్లను మూసివేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం కారణంగా పలు చోట్ల కొండ చరియలు విరిగిపడటంతో జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. రహదారిపై అడ్డంకులను తొలగించి రాకపోకలను పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మంచు తీవ్రత ఎక్కువయ్యే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శీతాకాల సంసిద్ధతపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (CM Omar Abdullah) నేతృత్వంలో శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. భారీ హిమపాతాన్ని ఎదుర్కోవడానికి రోడ్ క్లియరెన్స్, నిరంతర విద్యుత్తు సరఫరా, తాగునీటి లభ్యత వంటి వాటిపై దృష్టి సారించినట్లు సీఎం పేర్కొన్నారు.


► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 11:32 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తెలంగాణలో రెండు స్థానాలకు.. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 10 రాష్ట్రాల్లోని 37 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం పూర్తికాబోతోంది.
  • కదులుతున్న వాహనాల డోర్లు తీస్తూ.. బైకర్‌ ప్రమాదకర స్టంట్లు రోడ్డుపై కదులుతున్న వాహనాల డోర్లను తీస్తూ.. ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన బైకర్‌ను దిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
  • కునో పార్కులో మూడు కూనలకు జన్మనిచ్చిన చీతా Cheetah: మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కు (Kuno National Park)లో ‘గామిని’ అనే దక్షిణాఫ్రికా చీతా మూడు కూనలకు జన్మనిచ్చింది.
  • సరిహద్దుల్లో ‘ఏఐ’తో చైనా కుట్రలు భగ్నం.. ఆర్మీ అధికారి Army-AI: దేశ రక్షణ రంగంలో కృత్రిమ మేధ కీలకంగా మారుతోందని స్ట్రాటజిక్‌ ఫోర్సెస్‌ కమాండ్‌ ఇన్ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ దినేశ్‌ సింగ్‌ రానా తెలిపారు.
  • రఫేల్‌లో 50% దేశీయ తయారీ పరికరాలు ఉండాలి : రాజ్‌నాథ్‌ సింగ్‌ Rafale jets: రఫేల్ ఫైటర్ జెట్‌లో 50 శాతం దేశీయ తయారీ పరికరాలు ఉండేలా చూడాలని ఫ్రాన్స్‌ను కోరారు.
  • తప్పు జరిగింది.. క్షమించండి: దిల్లీలో కారు ప్రమాదానికి కారణమైన బాలుడి తండ్రి Delhi: దిల్లీలో మైనర్‌ బాలుడు నిర్లక్ష్యంగా కారు నడిపి.. ఓ వ్యక్తి మృతికి కారణమైన సంగతి తెలిసిందే. దీనిపై బాలుడి తండ్రి స్పందిస్తూ.. మృతుని కుటుంబానికి క్షమాపణలు తెలిపారు.
  • కొంకణ్‌ తీర పర్యాటకులకు డాల్ఫిన్ల గుంపు కనువిందు మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లా పరిధిలో గల కొంకణ్‌ తీరంలో పర్యాటకులకు డాల్ఫిన్లు గుంపుగా కనిపించి కనువిందు చేశాయి.
  • వైద్యుడి ఫోన్‌ నంబరు కోసం గూగుల్‌లో వెదికితే.. ఖాతా ఖాళీ సైబర్‌ కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో ప్రజల ఖాతాలను గుల్ల చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని శహడోల్‌ జిల్లాలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది.
  • ఐఎన్‌ఎస్‌ కృష్ణ జలప్రవేశం తొలి స్వదేశీ కేడెట్‌ శిక్షణ నౌక (సీటీఎస్‌) ఐఎన్‌ఎస్‌ కృష్ణ జలప్రవేశం చేసినట్టు నేవీ వర్గాలు మంగళవారం తెలిపాయి. చెన్నైలోని కట్టుపల్లి వద్ద లార్సన్‌ అండ్‌ టుబ్రో యార్డులో ఈ కార్యక్రమం జరిగినట్లు వెల్లడించాయి.
  • కర్ణాటకలో హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌ కర్ణాటకలోని కోలారు జిల్లా వేమగల్‌లో భారత తొలి ప్రైవేటురంగ హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌ ‘ఫైనల్‌ అసెంబ్లీ లైన్‌’ (ఎఫ్‌ఏఎల్‌)ను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తో కలిసి ముంబయి నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.
  • నూరుకోట్లకు బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారుల సంఖ్య దేశంలో బ్రాడ్‌ బ్యాండ్‌ వినియోగదారుల సంఖ్య గత పదేళ్లలో ఆరు కోట్ల నుంచి వంద కోట్లకు చేరిందని కేంద్ర కమ్యూనికేషన్లశాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. 2014-2025 మధ్యకాలంలో ఈ గొప్ప మైలురాయిని దాటడం సాధ్యమైందని చెప్పారు.
  • శ్రీపెరుంబుదూర్‌లో అతిపెద్ద కార్మిక ఆసుపత్రి తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్‌లో కార్మికుల కోసం దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి నిర్మించనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి తంగం తెన్నరసు ప్రకటించారు. 18,720 పడకల ఈ ఆసుపత్రి నిర్మాణానికి రూ.706 కోట్లు కేటాయించారు.
  • ఫ్రాన్స్‌తో భాగస్వామ్యం ఇక ప్రత్యేకం తమ మధ్య సంబంధాలను ‘ప్రత్యేక ప్రపంచవ్యాప్త వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచాలని భారత్‌-ఫ్రాన్స్‌ నిర్ణయించాయి.
  • పిటిషన్లలో ఏఐ వినియోగం ఆందోళనకరం కృత్రిమ మేధ సాధనాల సాయంతో రూపొందించిన పిటిషన్లను న్యాయస్థానాలకు సమర్పించే వైఖరి న్యాయవాదుల్లో ప్రబలడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
  • కాంగ్రెస్‌ మనుగడకు మూలం అసమ్మతే అసమ్మతిని సహించలేని పరిస్థితిలో కాంగ్రెస్‌ ఉంటే అది ఆ పార్టీ వినాశనానికే దారి తీస్తుందని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు మణిశంకర్‌ అయ్యర్‌ అభిప్రాయపడ్డారు.
  • అదో తుగ్లకీయ కమిషన్‌ ఎన్నికల సంఘం ‘‘తుగ్లకీయ కమిషన్‌’’లా వ్యవహరిస్తోందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఆరోపించారు.
  • బెంగాల్, తమిళనాడుల్లో ఏప్రిల్‌లో ఎన్నికలు! నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలను ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అధికారులు మంగళవారం వెల్లడించారు.
  • రైళ్ల మరుగుదొడ్లలో జెట్‌ స్ప్రేలు రైలు బోగీల్లోని మరుగుదొడ్లలో కొళాయి, చైన్‌తో కూడిన స్టీలు మగ్గుల స్థానంలో జెట్‌ స్ప్రేలు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
  • ఆసక్తికరమైన ఏఐ ప్రాజెక్టులు ప్రదర్శించిన ఎల్‌పీయూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఇండియా-ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పోలో లవ్లీ ప్రొఫెషనల్‌ విశ్వవిద్యాలయ (ఎల్‌పీయూ) ప్రాజెక్టులు అందరి మన్ననలు పొందాయని వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
  • మాకు పెన్షన్లు వద్దు శ్రీలంక చట్టసభ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పదవీకాలం ముగిశాక పెన్షన్లు తీసుకోరాదని నిర్ణయించారు.

English Translation

Snowfall: Snow blankets Jammu and Kashmir

Eenadu icon
By National News Team Updated : 21 Dec 2025 12:00 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Internet Desk: North India is shivering with cold. Kashmir snowfall has started in Jammu and Kashmir and Himachal Pradesh. Snowfall has increased in higher elevations and minimum temperatures have dropped below freezing in many parts of the valley. Thin layers of ice are visible on the surface parts of water bodies. The Meteorological Department has revealed that the temperatures are below zero degrees Celsius in many places. Sky Resort in Gulmarg, Sonamarg, Doodpatri, etc., in the high areas of South and North Kashmir have turned white due to heavy snowfall.

While on one hand the blanket of snow spread across Kashmir is attracting tourists, on the other hand, people are facing difficulties due to heavy accumulation of snow and closure of a large number of roads. Officials said that traffic on the Jammu-Srinagar National Highway has been suspended due to landslides at several places due to heavy rain. He said that measures have been taken to restore traffic by removing the obstacles on the road. Officials are alerted as the intensity of snow is likely to increase in the coming days. A high-level review on winter preparedness was conducted on Saturday under the leadership of Chief Minister Omar Abdullah. The CM said that he has focused on road clearance, uninterrupted power supply and availability of drinking water to deal with the heavy snowfall. href="https://www.facebook.com/eenaduonline/" target="_blank" rel="noopener">Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 11:32 IST

Note:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Rajya Sabha election schedule released.. Rajya Sabha election schedule for two seats in Telangana has been released. The tenure of 37 Rajya Sabha members in 10 states is going to end in April this year. Delhi Police has arrested a biker who terrorized the passengers by removing the doors of moving vehicles on the road. 
  • Cheetah who gave birth to three cubs in Kuno Park Cheetah: A South African cheetah named 'Gamini' gave birth to three cubs in the Kuno National Park in Madhya Pradesh. Army officer Army-AI: Strategic Forces Command-in-Chief Lt. Gen. Dinesh Singh Rana said that artificial intelligence is becoming crucial in the field of national defense.
  • Rahale should have 50% indigenously manufactured equipment: Rajnath Singh Rafale jets: France asked to ensure 50 per cent indigenous components in Rafale fighter jets Delhi: It is known that a minor boy drove a car carelessly in Delhi and caused the death of a person. In response to this, the boy's father apologized to the deceased's family. Tourists were spotted by a group of dolphins on the Konkan coast of Sindhudurg district in Maharashtra.
  • If you search for the doctor's phone number on Google, the account is empty. Cyber crooks are constantly hacking people's accounts in new ways. Another incident came to light in Shahdol district of Madhya Pradesh.
  • INS Krishna water entry. Navy sources said on Tuesday that the first indigenous Cadet Training Ship (CTS) INS Krishna has entered the water. The event was held at the Larson and Toubro yard at Kattupally, Chennai.
  • A helicopter assembly unit in Karnataka. India's first private helicopter assembly unit 'Final Assembly Line' (FAL) at Vemagal in Kolaru district of Karnataka was inaugurated virtually from Mumbai on Tuesday by Prime Minister Narendra Modi and French President Emmanuel Macron. Union Minister of State for Communications Pemmasani Chandrasekhar said that the number of broadband users in the country has increased from six crore to one hundred crore in the last ten years. It is possible to cross this great milestone between 2014-2025.
  • Largest labor hospital in Sriperumbudur Finance Minister Thangam Thennarasu has announced that the country's largest hospital for workers will be built at Sriperumbudur in Kancheepuram district of Tamil Nadu. 706 crores have been allocated for the construction of this 18,720-bed hospital.
  • Partnership with France is now special. India-France have decided to elevate their ties to the level of a 'Special Global Strategic Partnership'.
  • Use of AI in petitions is a concern The Supreme Court has expressed deep concern over the prevailing attitude among lawyers to present petitions prepared with the help of artificial intelligence tools to the courts. Senior Congress leader Mani Shankar Iyer opined that if the Congress is in a situation where dissent cannot be tolerated, it will lead to the destruction of the party.
  • That is the Tughlaqiya Commission. West Bengal Chief Minister Mamata Banerjee on Tuesday accused the Election Commission of acting like a "Tughlaqiya Commission".
  • Elections in Bengal and Tamil Nadu in April! The Central Election Commission (EC) officials revealed on Tuesday that the assembly elections for four states and one union territory will be held in April.
  • Jet sprays in train toilets. The railway department has decided to install jet sprays in the toilets of train coaches instead of steel faucets with taps and chains.
  • LPU has demonstrated interesting AI projects. Lovely Professional University's (LPU) projects were well received at the India-AI Impact Expo inaugurated by Prime Minister Narendra Modi, the varsity said in a statement.
  • We don't want pensions. Sri Lankan lawmakers took a crucial decision. Decided not to draw pensions at the end of tenure.