

స్వేదం లేని.. సేద్యం

- A
- A+
- A++
ఈనాడు,హైదరాబాద్: నేల ఏ పంటకు అనుకూలంగా ఉంది..వాతావారణం ఎలా ఉంది..పంటలకు చీడపీడలేవైనా వ్యాపించాయా..నివారణకు ఎలాంటి పురుగుమందులు వాడాలి...ఉత్పత్తుల అమ్మకానికి మార్కెట్ అనుకూలంగా ఉందా? లేదా...తదితర పనులన్నీ సెన్సర్లు అమర్చిన యంత్రాలే చక్కబెడితే ఎలా ఉంటుంది. కృత్రిమ మేధ, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) సాంకేతిక పరిజ్ఞానంతో సేద్యానికి సంబంధించిన సమస్త పనులన్నీ శారీరక శ్రమ లేకుండా వాటికవే జరిగిపోతే అన్నదాతకు ఎంత హాయిగా ఉంటుంది. అలాంటివన్నీ సాకారం చేసే దిశగా అడుగుపడింది. తెలంగాణలో ‘స్మార్ట్ సేద్యం’ లక్ష్యంగా హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం.. భారతీయ స్టేట్‌బ్యాంక్ ఆర్థిక సహకారంతో దేశంలో తొలిసారిగా అధునాతన ఏఐ, రోబోటిక్స్, ఐవోటీ ఆధారిత (అరిసా ల్యాబ్) ప్రయోగశాలను ఏర్పాటుచేసింది. అగ్రి వర్సిటీ అందుకు ప్రణాళిక రూపొందించి ఇవ్వగా..వర్సిటీ పూర్వ విద్యార్థి, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ చల్లా శ్రీనివాసులుశెట్టి.. కార్పొరేటు సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)కింద రూ.15 కోట్ల ఆర్థిక సాయం అందజేశారు. తొమ్మిది నెలల వ్యవధిలోనే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. వాతావరణ మార్పులు, భూసారం దెబ్బతినడం, పంటలకు తెగుళ్లు, అధిక ఎరువులు, దిగుబడుల లోపం, అన్నదాతలకు అధిక వ్యయాలు, కూలీల కొరత వంటి సవాళ్లకు తక్కువ ఖర్చుతో కూడిన శాస్త్రీయ పరిష్కారాలను చూపించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. రైతుల సగటు వయసు పెరుగుతుండడం..యువత వ్యవసాయంపై ఆసక్తి కోల్పోతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని..ఆధునిక శిక్షణలు, సాంకేతికతలను అందుబాటులోకి తేవడం ద్వారా యువతను సేద్యం వైపు ఆకర్షించి..ఆ రంగాన్ని సుస్థిరంగా భవిష్యత్ తరాలకు అందించడం దీని ఉద్దేశం.
ఏమేమి చేస్తారంటే..
- పరిశోధన, శిక్షణ: విద్యార్థులు, పరిశోధకులు, రైతులు, ఆవిష్కర్తలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తారు. కృత్రిమ మేధ, ఐవోటీ, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి కచ్చితమైన, సమర్థ వ్యవసాయ పద్ధతులకు ప్రోత్సాహం అందిస్తారు.
- రైతులు, వ్యవసాయ ఆవిష్కర్తలు, స్టార్టప్‌లకు ప్రయోగాత్మక శిక్షణ అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, క్షేత్రస్థాయి పరిశోధన ప్రాంతాలు ఏర్పాటుచేస్తారు.
- కేంద్రీకృత డేటా నిర్వహణ వేదికను ఉపయోగించి వ్యవసాయ సాంకేతికతల అభివృద్ధి, అమలు, ఉత్తమ పద్ధతులను ప్రోత్సహిస్తారు.
- వ్యవసాయం, దాని సాంకేతికతల్లో ఉన్న నైపుణ్య లోటును తగ్గించడంతోపాటు అవసరమైన విజ్ఞానాన్ని రైతులు, వ్యవసాయ భాగస్వాములు, ఇతర సంబంధిత వర్గాలకు చేరవేస్తారు.
- ఏఐ వేదిక: పంటల పర్యవేక్షణ, నిర్ణయాత్మక సహాయక వ్యవస్థ, తెగుళ్ల గుర్తింపునకు ఏఐ ఆధారిత పరిశోధన వ్యవస్థలున్నాయి.
- స్వయంచాలక వాతావరణ కేంద్రం: ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలి వేగం, దిశ, వాతావరణ పీడనం వంటి సమాచారాన్ని సేకరించే స్వయంచాలక(ఆటోమేటిక్) వాతావరణ కేంద్రం ఉంది. ఎరువుల వినియోగం, పంట నిర్వహణకు సంబంధించి రైతులు సరైన నిర్ణయాలు తీసుకునేలా మార్గదర్శనం చేస్తుంది. సమగ్ర చీడపీడల పర్యవేక్షణ వ్యవస్థతో తెగుళ్ల దాడి ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి..రైతులకు హెచ్చరికలు, సూచనలు అందించే వ్యవస్థ కూడా ఉంది.
- నేలకు సెన్సర్ల అనుసంధానం: నేలలో తేమ, పోషకాలు, రసాయన ప్రమాణాలను తక్షణమే కొలిచే ఆధునిక సెన్సర్లు.. ఆటోమేటిక్ డ్రిప్ సాగు విధాన వ్యవస్థతో అనుసంధానమై పనిచేస్తాయి. తేమస్థాయి తగ్గిన వెంటనే డ్రిప్ దానికదే తడులను అందిస్తుంది. తద్వారా నీటి వినియోగం 40% వరకు తగ్గుతుంది.
- సూక్ష్మ వాతావరణ పరిశీలన వ్యవస్థ: నెట్‌హౌస్‌లో ఉష్ణోగ్రత, తేమ తదితరాలను సెన్సర్ల నుంచి లభించే డేటా ఆధారంగా ఆటోమేటిక్‌గా డ్రిప్, ఫాగింగ్ వ్యవస్థలు నియంత్రిస్తాయి. ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు ఫాగర్ యంత్రాలు వాటికవే పనిచేస్తూ తేమను సమతుల్యం చేస్తాయి. పంట పెరుగుదలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.
- రోబోటిక్స్ విభాగం: వ్యవసాయానికి అనువైన డ్రోన్లు, రోబోలు తదితర యంత్రాల రూపకల్పన చేస్తుంది. వీటిల్లో ఏఐ కెమెరాలు, సెన్సర్లు.. పంటలపై తెగుళ్ల దాడి, నీటి కొరత, పోషకాల లోపం వంటిని ముందుగానే గుర్తించి హెచ్చరికలు అందజేస్తాయి.
ప్రత్యక్ష ప్రదర్శన స్థలం
ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను ప్రత్యక్షంగా వీక్షించి స్పష్టంగా అర్థం చేసుకునేలా నెట్‌హౌస్, అగ్రి-ఫొటోవోల్టాయిక్ యూనిట్లను ఏర్పాటుచేశారు. ప్రధానంగా కూరగాయల పంటల్లో సెన్సర్లు, ఆటోమేటిక్ డ్రిప్ సాగు వ్యవస్థలను అనుసంధానిస్తారు. వీటిపై శిక్షణ ఇస్తారు.
నెట్ హౌస్ డెమో యూనిట్
ఇక్కడ ఏర్పాటుచేసిన నెట్‌హౌస్‌లో వాతావరణ పర్యవేక్షణకు..ఉష్ణోగ్రత, తేమను కొలిచే సెన్సర్లు అమర్చారు. ఇవి డ్రిప్, ఫాగర్ వ్యవస్థలతో అనుసంధానమై వాతావరణ మార్పుల ఆధారంగా నీటిపారుదల, ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ పంటకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి.

రైౖతులు పొలాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే పంటలు సాగుచేసే(స్మార్ట్ వ్యవసాయం) దిశగా రాష్ట్రాన్ని నిర్మించడమే లక్ష్యంగా ఈ ల్యాబ్‌ను ప్రారంభించాం. వచ్చే ఐదేళ్లలో సంబంధిత వ్యవసాయ యంత్ర పరికరాలను తయారుచేసి, చౌక ధరలతో సరఫరా చేస్తాం. రాష్ట్రంలోని రైతులకు అత్యున్నత సాంకేతికత అందించడం ద్వారా రైతులకు సేవలందిస్తాం.
అగ్రి వర్సిటీలోని డిజిటల్ వ్యవసాయ కేంద్రంలో 4 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును చేపట్టారు. 3,000 చదరపు అడుగుల భవనం నిర్మించి.. ల్యాబ్, శిక్షణ కేంద్రాలు, మానిటరింగ్ వ్యవస్థ తదితరాల నిర్వహణకు వినియోగించారు. దాదాపు మూడు ఎకరాల స్థలాన్ని పంట క్షేత్రాలు, ప్రయోగాల నిర్వహణకు వినియోగిస్తున్నారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- స్టాండింగ్‌లోనే.. సిట్.. ముందుకు కదలని బెట్టింగ్ యాప్‌ల కేసు దర్యాప్తు అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న బెట్టింగ్ యాప్‌లకు ముకుతాడు వేసేందుకు ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పేరుకే పరిమితమైంది.
- భారతీయ ప్రతిభా సామర్థ్య వేదిక ఆలోచనలు, ఆవిష్కరణలు, సంకల్పాల శక్తిమంత కలయిక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో-2026’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
- సినీ నటి ప్రత్యూష మృతి కేసులో.. సిద్ధార్థరెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డికి తెలంగాణ హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది.
- సినీనటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో సినీనటుడు, మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) ఛాన్స్‌లర్ మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
- తీరంలో యుద్ధ నౌకల జాతర ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి విశాఖ ఈఎన్‌సీ ఆఫీసర్స్ మెస్‌లో విందు (ప్రెసిడెన్షియల్ బాంక్వెట్) ఇచ్చారు.
- హంగ్‌లో అదృష్ట హస్తం ఛైర్‌పర్సన్ ఎన్నికలు వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో మంగళవారం 8 చోట్ల ఆ ప్రక్రియను పూర్తిచేశారు.
- బయో వరల్డ్‌గా తెలంగాణరాష్ట్రం ‘బయో ఆసియా తన పేరును దాటి.. బయో వరల్డ్‌గా మారుతోంది. ఈ సభను చూస్తుంటే.. బయో వరల్డ్‌గా తెలంగాణ ఎదుగుతుందనే విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను.
- రూ.1,700 కోట్ల పెట్టుబడులు బయో ఆసియా 2026 సదస్సు వేదికగా మంగళవారం తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
- విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ అన్నారు.
- మీ టాయిలెట్టే మీ డాక్టర్ వైద్యఆరోగ్య రంగంలో సాంకేతికంగా పెను మార్పులు వస్తున్నాయి. వైద్య నిర్ధారణ పరీక్షలు సులభతరం అవుతున్నాయి.
- 70 ఇంజినీరింగ్ కళాశాలల్లో పాత ఫీజులే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) షాక్ ఇవ్వనుంది.
- డాన్.. సింబా.. లియో డాన్.. సింబా.. లియో.. చార్లీ.. టైసన్.. రాణా.. విరాట్.. పోలీసు సాయుధబలగాల్లో చేరేందుకు సిద్ధమైన సుశిక్షిత జాగిలాలివి.
- చెత్త కనిపిస్తే సహించేది లేదు రాజధాని పరిధిలోకి వచ్చే మూడు నగరపాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
- ఎప్‌సెట్ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు ఎప్‌సెట్ దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా, రిజిస్ట్రేషన్ సంఖ్యను పోగొట్టుకున్నప్పటికీ మళ్లీ పొందేలా కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు కన్వీనర్ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి వెల్లడించారు.
- రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భాజపానే పురపాలిక ఎన్నికల్లో భాజపా కరీంనగర్ కార్పొరేషన్, నారాయణపేట మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని, భవిష్యత్తులో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా శ్రేణులు శ్రమించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పిలుపునిచ్చారు.
- ప్రతి ముగ్గురిలో ఒక చిన్నారికి భారతీయ టీకాలు ప్రపంచంలోని ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరికి భారత్ నుంచి టీకాలు సరఫరా అవుతున్నాయని భారత్ బయోటెక్ చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ రేచస్ ఎల్ల తెలిపారు.
- నా బిడ్డకు పూర్తి న్యాయం జరగలేదు తన బిడ్డకు వందశాతం న్యాయం జరిగిందని భావించట్లేదని ప్రత్యూష తల్లి సరోజినీదేవి అన్నారు. ఆమె మంగళవారం ఇక్కడ ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు.
- మాటలు.. మంటలు.. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్ ఛైర్‌పర్సన్లు, వైస్‌ఛైర్‌పర్సన్ల ఎన్నిక ప్రక్రియ సందర్భంగా కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
- మున్సిపల్ ఎన్నికల్లో.. ముందూ.. వెనకా పంపకాలే మున్సిపల్ ఎన్నికల్లో ఆద్యంతం.. కాసుల హవాయే నడిచింది. పోలింగ్ వరకు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచిన రాజకీయ పార్టీలు.. కౌంటింగ్ తర్వాత బలసమీకరణలో భాగంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆకట్టుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి.
- పొత్తు కొనసాగేది.. లేనిది కాంగ్రెస్ చేతిలోనే కొత్తగూడెం కార్పొరేషన్‌గా ఏర్పడ్డ మొదటి ఎన్నికల్లోనే సీపీఐ అపూర్వ విజయం సాధించిందని, కాంగ్రెస్‌తో పొత్తు లేకున్నా సత్తాచాటామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
English Translation

- A
- A+
- A++
Today,Hyderabad: Which crop is the soil suitable for..what is the weather like..are the crop pests spread? Or...what if all other tasks are handled by sensor-equipped machines. With the help of artificial intelligence, robotics and Internet of Things (IoT) technology, all the work related to cultivation can be done without physical labor, how much more comfortable it will be for the farmer. All such steps have been taken towards realization. Aiming at 'smart farming' in Telangana, Prof. Jayashankar Agricultural University, Hyderabad has set up the country's first advanced AI, Robotics, IoT-based laboratory (Arisa Lab) with the financial support of the State Bank of India. Agri University has prepared a plan for that...Challa Srinivasulushetti, an alumnus of the University and Chairman of State Bank of India, has given financial assistance of Rs.15 crore under Corporate Social Responsibility (CSR). The project was designed within nine months. The main objective of the project is to show cost-effective scientific solutions to the challenges of climate change, soil erosion, crop pests, excess fertilizers, yield deficits, high costs to farmers and labor shortages. The average age of farmers is increasing..keeping in mind the situation where young people are losing interest in agriculture..the aim is to attract the youth towards agriculture by making available modern trainings and technologies..to provide that sector sustainably to the future generations. Skill development training is provided to innovators. Using advanced technologies like artificial intelligence, IoT, robotics will promote precision and efficient farming practices.
Net House Demo Unit
In the net house set up here, sensors for measuring temperature and humidity are installed for weather monitoring. These are connected with drip and fogger systems and control irrigation and temperature based on climate change to create a suitable climate for the crop. We have started this lab with the aim of building the state towards cultivation (smart agriculture). In the next five years, we will manufacture the relevant agricultural machinery and supply it at cheap prices. We will serve the farmers of the state by providing them with the latest technology.
The project was undertaken in 4 acres at the Digital Agriculture Center of Agri University. A building of 3,000 square feet was constructed and used for the maintenance of lab, training centers, monitoring system etc. About three acres of land is used for crop fields and experiments.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Standing.. Sit.. Investigating the case of betting apps not moving forward The Special Investigation Team (SIT), which was set up with much fanfare to crack down on betting apps that are taking innocent lives, is limited to the name. Prime Minister Narendra Modi said that 'India AI Impact Expo-2026' is a powerful combination of ideas, innovations and determination.
- Cinema actress Pratyusha death case.. Siddharth Reddy was sentenced to two years in prison The Supreme Court has upheld the two-year jail sentence imposed by the Telangana High Court on Gudipalli Siddharth Reddy, the accused in the case of actress Pratyusha's death, which created a sensation in the united Andhra Pradesh two decades ago. Actor and Chancellor of Mohanbabu University (MBU) Mohanbabu has faced a setback in the AP High Court in the kidnapping case of student leaders. On the occasion of the International Fleet Review (IFR), President Draupadi Murmu hosted a presidential banquet at the ENC Officers' Mess, Visakhapatnam on Tuesday night.
- Hand of fortune in Hung Out of the 11 municipalities where the chairperson elections were postponed, the process was completed in 8 places on Tuesday.
- Telangana State as Bio World 'Bio Asia is going beyond its name.. becoming Bio World. Looking at this meeting, I can proudly say that Telangana will grow as a bio world.
- Rs. 1,700 crore investment Telangana received an investment of Rs.1,700 crore on Tuesday as the venue of the Bio Asia 2026 conference.
- Family members should be clear about values and policies. When all the family members have a clear understanding of the policies to be followed and the values to be followed in the construction of business enterprises.. Shailaja Kiran, MD, Margadarshi Chitfunds said that family businesses can survive for a long time.
- Your toilet is your doctor. Technological changes are coming in the field of medicine and health. Medical diagnostic tests are getting easier.
- Old fees in 70 engineering colleges The Telangana Admissions and Fees Control Committee (TAFRC) will give a shock to some private engineering colleges in the state.
- Dan.. Simba.. Leo Dan.. Simba.. Leo.. Charlie.. Tyson.. Rana.. Virat..
- Police are ready to join the armed forces. Chief Minister Revanth Reddy has directed the officials to focus on cleanliness in the three municipal corporations under the capital. Convener Acharya K.Vijayakumar Reddy revealed that new facilities have been made available to keep track of the status of APSET application and get it again even if the registration number is lost.
- BJP is the alternative to Congress in the state. BJP state president N. Ramachander Rao has called upon the ranks to work hard to bring the party to power in the state in the future. Dr. Rechus Ella, Chief Development Officer of Bharat Biotech, said that one in every three children in the world is supplied with vaccines from India.
- My child did not get full justice. Pratyusha's mother Sarojini Devi said that she does not feel that justice has been done to her child 100%. She spoke to 'Eenadu-ETV' here on Tuesday.
- Words..fires..Tense situations arose in some places during the process of election of municipal chairpersons and vice-chairpersons in joint Warangal and joint Adilabad districts on Tuesday. Can't be sent back Throughout the municipal elections.. Kasula Hawaii ran. The political parties who distributed large amounts of money to the voters before the polling. After the counting, they spent crores of rupees to impress the corporators and councilors. State secretary of the party and MLA of Kothagudem Koonanneni Sambasivarao stated that the CPI won an unprecedented victory in the first election when Kothagudem was formed as a corporation.