పీఎస్సీలకు నిష్పాక్షికతే పునాది

Eenadu icon
By Telangana News Desk Published : 21 Dec 2025 04:10 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

ఈనాడు, హైదరాబాద్‌: పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లకు నిష్పాక్షికతే నైతిక పునాది అని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ తెలిపారు. వికసిత్‌ భారత్‌ 2047 లక్ష్యానికి.. వినూత్న ఆలోచనలు, నైతికత, ప్రజల పట్ల సానుకూల దృక్పథం కలిగిన సివిల్‌ సర్వెంట్లు అవసరమన్నారు. సుపరిపాలనలో.. ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థలను నడిపించే వ్యక్తుల నైతికత అత్యంత నిర్ణయాత్మకమన్నారు. దేశసేవ చేసేందుకు నైతిక విలువలు కలిగిన వ్యక్తులను ఎంపిక చేసే బాధ్యత రాజ్యాంగబద్ధ సంస్థలైన పీఎస్సీలపై ఉందని పేర్కొన్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో రెండు రోజుల పాటు జరిగిన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్‌పర్సన్ల 26వ జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, యూపీఎస్సీ సభ్యులు లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజ్‌ శుక్లా, దినేశ్‌ దాసా, రాష్ట్రాల పీఎస్సీల స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ అలోక్‌వర్మ, టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం, ఉత్తర్‌ప్రదేశ్‌ పీఎస్సీ ఛైర్మన్‌ సంజయ్‌ శ్రీనేత్, మరికొన్ని రాష్ట్రాల పీఎస్సీల ఛైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. ‘‘దేశభవిష్యత్తును నిర్ణయించే వ్యక్తులతో కూడిన సమావేశమే ఈ సదస్సు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిష్పక్షపాతంగా జరగాలి. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, రహస్య మూల్యాంకనం వంటి విధానాలతో పక్షపాత ధోరణులను నివారించవచ్చు. నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు సమన్యాయం జరగాలి. యూపీఎస్సీ నియామక విధానంపై ఇప్పటికే విదేశాల్లోని నియామక సంస్థలు ఆరా తీస్తున్నాయి. అంతగా ఆ సంస్థ పరపతి సాధించింది. సుపరిపాలన పునాదులను బలోపేతం చేసేలా వికసిత్, ఆత్మనిర్భర్‌ దిశగా భారత్‌ సాగిస్తున్న ప్రయాణంలో పీఎస్సీలు కీలకపాత్ర పోషించాలి. డిజిటల్‌ గవర్నెన్సు, సామాజిక సమ్మిళితం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వాతావరణ మార్పులపై కార్యాచరణ, ఆర్థిక సంస్కరణల అమలు వంటి కీలక బాధ్యతలు.. కొత్తగా ఎంపికవుతున్న అధికారులపై ఉన్నాయి. ప్రభుత్వ పోటీ పరీక్షల్లో అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదు. వీటి నివారణకు పకడ్బందీ విధానాలను అమలు చేయాలి. అభ్యర్థుల్లో నైతికత, ప్రవర్తన సామర్థ్యాలను అంచనా వేయడానికి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నిర్మాణాత్మక పద్ధతులు అన్వేషించాలి’’ అని సూచించారు.

పారదర్శకతే కీలకం: డిప్యూటీ సీఎం భట్టి 

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు దేశ పరిపాలన వ్యవస్థకు వెన్నెముక వంటివని, పారదర్శక నియామక విధానాలతో ప్రతిభకు సరైన స్థానం లభిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సదస్సులో ఆయన ప్రసంగిస్తూ.. ‘‘సర్వీస్‌ కమిషన్లు స్పష్టమైన కాలపరిమితితో వార్షిక క్యాలెండర్లు ప్రకటించి, వాటికి కట్టుబడి ఉండాలి. మరిన్ని సంస్కరణలు అమలు చేయాలి. సమానత్వంతో కూడిన ప్రతిభను ప్రోత్సహించి ప్రజల్లో నమ్మకం పెంచాలి. రాజకీయ ప్రభావాలకు లోనుకాకుండా పనిచేయాలి. సామాజికన్యాయం, సమానావకాశాలు అందించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, అవసరమైన చోట ప్రత్యేకంగా అర్హత నిబంధనల సడలింపు, సమాన ప్రాతినిధ్యం లభించేలా పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ముందస్తు జాగ్రత్తలు, నిష్పక్షపాతంగా వ్యవహరించడం ద్వారా న్యాయవివాదాలను తగ్గించవచ్చు. నోటిఫికేషన్ల రూపకల్పనలో న్యాయనిపుణుల సలహాలు తీసుకోవాలి. ఏటా పోటీ పరీక్షలకు లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారు. ప్రతి విషయంలోనూ స్పష్టతతో వ్యవహరించాలి. ప్రశ్నపత్రం తయారీ నుంచి మూల్యాంకనం వరకు.. షార్ట్‌లిస్టు నుంచి తుది ఎంపిక వరకు ఎక్కడా అనుమానాలకు తావివ్వకూడదు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని వెల్లడిస్తూ పక్షపాతరహితంగా వ్యవహరించాలి. ప్రశ్నపత్రాల లీకేజీ అంటే.. ప్రజాసేవ విలువలకు, సర్వీస్‌ కమిషన్ల నైతికతకు ద్రోహం చేయడమే. ఇలాంటివి జరగకుండా కమిషన్లు రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలి. డిజిటల్‌ ప్లాట్‌ఫాం నుంచి సిబ్బంది వరకు తనిఖీలకు అత్యాధునిక పద్ధతులు ఉపయోగించాలి. ఇంటర్వ్యూ ప్రక్రియను మరింత మెరుగుపరచాలి. సదస్సులో చేసిన తీర్మానాలు అమలు చేయాలి’’ అని సూచించారు.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • స్టాండింగ్‌లోనే.. సిట్‌.. ముందుకు కదలని బెట్టింగ్‌ యాప్‌ల కేసు దర్యాప్తు అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న బెట్టింగ్‌ యాప్‌లకు ముకుతాడు వేసేందుకు ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) పేరుకే పరిమితమైంది.
  • భారతీయ ప్రతిభా సామర్థ్య వేదిక ఆలోచనలు, ఆవిష్కరణలు, సంకల్పాల శక్తిమంత కలయిక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పో-2026’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
  • సినీ నటి ప్రత్యూష మృతి కేసులో.. సిద్ధార్థరెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డికి తెలంగాణ హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు ఖరారు చేసింది.
  • సినీనటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ విద్యార్థి నాయకుల కిడ్నాప్‌ కేసులో సినీనటుడు, మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) ఛాన్స్‌లర్‌ మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
  • తీరంలో యుద్ధ నౌకల జాతర ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి విశాఖ ఈఎన్‌సీ ఆఫీసర్స్‌ మెస్‌లో విందు (ప్రెసిడెన్షియల్‌ బాంక్వెట్‌) ఇచ్చారు.
  • హంగ్‌లో అదృష్ట హస్తం ఛైర్‌పర్సన్‌ ఎన్నికలు వాయిదా పడిన 11 మున్సిపాలిటీల్లో మంగళవారం 8 చోట్ల ఆ ప్రక్రియను పూర్తిచేశారు.
  • బయో వరల్డ్‌గా తెలంగాణరాష్ట్రం ‘బయో ఆసియా తన పేరును దాటి.. బయో వరల్డ్‌గా మారుతోంది. ఈ సభను చూస్తుంటే.. బయో వరల్డ్‌గా తెలంగాణ ఎదుగుతుందనే విషయాన్ని నేను గర్వంగా చెప్పగలను.
  • రూ.1,700 కోట్ల పెట్టుబడులు బయో ఆసియా 2026 సదస్సు వేదికగా మంగళవారం తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
  • విలువలు, విధానాలపై కుటుంబ సభ్యులకు స్పష్టత ఉండాలి వ్యాపార సంస్థల నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, పాటించాల్సిన విలువలపై కుటుంబ సభ్యులందరికీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే.. కుటుంబ వ్యాపారాలు దీర్ఘకాలం మనగలుగుతాయని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజా కిరణ్‌ అన్నారు.
  • మీ టాయిలెట్టే మీ డాక్టర్‌ వైద్యఆరోగ్య రంగంలో సాంకేతికంగా పెను మార్పులు వస్తున్నాయి. వైద్య నిర్ధారణ పరీక్షలు సులభతరం అవుతున్నాయి.
  • 70 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పాత ఫీజులే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ) షాక్‌ ఇవ్వనుంది.
  • డాన్‌.. సింబా.. లియో డాన్‌.. సింబా.. లియో.. చార్లీ.. టైసన్‌.. రాణా.. విరాట్‌.. పోలీసు సాయుధబలగాల్లో చేరేందుకు సిద్ధమైన సుశిక్షిత జాగిలాలివి.
  • చెత్త కనిపిస్తే సహించేది లేదు రాజధాని పరిధిలోకి వచ్చే మూడు నగరపాలక సంస్థల పరిధిలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
  • ఎప్‌సెట్‌ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు ఎప్‌సెట్‌ దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా, రిజిస్ట్రేషన్‌ సంఖ్యను పోగొట్టుకున్నప్పటికీ మళ్లీ పొందేలా కొత్త సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు కన్వీనర్‌ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి వెల్లడించారు.
  • రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భాజపానే పురపాలిక ఎన్నికల్లో భాజపా కరీంనగర్‌ కార్పొరేషన్, నారాయణపేట మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని, భవిష్యత్తులో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా శ్రేణులు శ్రమించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పిలుపునిచ్చారు.
  • ప్రతి ముగ్గురిలో ఒక చిన్నారికి భారతీయ టీకాలు ప్రపంచంలోని ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరికి భారత్‌ నుంచి టీకాలు సరఫరా అవుతున్నాయని భారత్‌ బయోటెక్‌ చీఫ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రేచస్‌ ఎల్ల తెలిపారు.
  • నా బిడ్డకు పూర్తి న్యాయం జరగలేదు తన బిడ్డకు వందశాతం న్యాయం జరిగిందని భావించట్లేదని ప్రత్యూష తల్లి సరోజినీదేవి అన్నారు. ఆమె మంగళవారం ఇక్కడ ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు.
  • మాటలు.. మంటలు.. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో మంగళవారం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు, వైస్‌ఛైర్‌పర్సన్ల ఎన్నిక ప్రక్రియ సందర్భంగా కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
  • మున్సిపల్‌ ఎన్నికల్లో.. ముందూ.. వెనకా పంపకాలే మున్సిపల్‌ ఎన్నికల్లో ఆద్యంతం.. కాసుల హవాయే నడిచింది. పోలింగ్‌ వరకు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచిన రాజకీయ పార్టీలు.. కౌంటింగ్‌ తర్వాత బలసమీకరణలో భాగంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆకట్టుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి.
  • పొత్తు కొనసాగేది.. లేనిది కాంగ్రెస్‌ చేతిలోనే కొత్తగూడెం కార్పొరేషన్‌గా ఏర్పడ్డ మొదటి ఎన్నికల్లోనే సీపీఐ అపూర్వ విజయం సాధించిందని, కాంగ్రెస్‌తో పొత్తు లేకున్నా సత్తాచాటామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.

English Translation

Impartiality is the foundation of PSCs

alt="Eenadu icon" class="img-fluid rounded">By Telangana News Desk Published : 21 Dec 2025 04:10 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

Today, Hyderabad: Vice President CP Radhakrishnan said that impartiality is the moral foundation of Public Service Commissions. He said that the goal of Vikasit Bharat 2047.. requires civil servants with innovative ideas, ethics and positive attitude towards people. In good governance, the morality of the people who lead the government institutions and systems is the most decisive. He said that the responsibility of selecting people with moral values ​​to serve the country is on the constitutional bodies, PSCs. The Vice President was the chief guest at the concluding program of the 26th National Conference of Public Service Commission Chairpersons held at Ramoji Film City for two days. Deputy CM Bhatti Vikramarka, UPSC members Lt. Gen. Raj Shukla, Dinesh Dasa, State PSC Standing Committee Chairman Alok Varma, TGPSC Chairman Burra Venkatesham, Uttar Pradesh PSC Chairman Sanjay Sreeneth, and other state PSCs chairmen were present in this meeting. High officials participated. Speaking on this occasion, the Vice President said, "This conference is a meeting of people who decide the future of the country. Government job recruitment should be done impartially. Bias tendencies can be avoided with procedures like transparency and secret evaluation in the conduct of examinations. There should be equality for SC and ST communities in appointments. Recruitment agencies abroad are already inquiring about the UPSC recruitment process. That's how leveraged the company was. PSCs should play a vital role in India's journey towards development and self-reliance to strengthen the foundations of good governance. Key responsibilities like digital governance, social inclusion, infrastructure development, action on climate change, implementation of economic reforms are on the newly elected officials. Irregularities in government competitive examinations should not be tolerated under any circumstances. Preventive measures should be implemented. He suggested that public service commissions should explore structured methods to assess the moral and behavioral abilities of the candidates. Bhatti

Deputy CM Bhatti Vikramarka said that public service commissions are like the backbone of the country's administration system and with transparent recruitment procedures, talent gets the right place. Addressing the conference, he said, "Service commissions should announce annual calendars with clear deadlines and stick to them. More reforms should be implemented. Equality of talent should be encouraged and people's confidence should be increased. Work without political influence. Special training programs to provide social justice and equal opportunities, relaxation of eligibility criteria where necessary, monitoring systems to ensure equal representation should be established. Litigation can be minimized by taking precautions and acting impartially. Advice of legal experts should be taken in drafting notifications. Lakhs of people apply for competitive exams every year. Be clear in everything. From question paper preparation to evaluation, from shortlisting to final selection, there should be no room for doubt. Disclose information from time to time and act impartially. Leakage of question papers means.. betraying the values ​​of public service and ethics of service commissions. Commissions should strengthen safeguards to prevent such occurrences. State-of-the-art methods should be used for inspections from digital platform to personnel. The interview process needs to be improved. He suggested that the resolutions made in the conference should be implemented.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Standing.. Sit.. Investigating the case of betting apps not moving forward The Special Investigation Team (SIT), which was set up with much fanfare to crack down on betting apps that are taking innocent lives, is limited to the name. Prime Minister Narendra Modi said that 'India AI Impact Expo-2026' is a powerful combination of ideas, innovations and determination.
  • Cinema actress Pratyusha death case.. Siddharth Reddy was sentenced to two years in prison The Supreme Court has upheld the two-year jail sentence imposed by the Telangana High Court on Gudipalli Siddharth Reddy, the accused in the case of actress Pratyusha's death, which created a sensation in the united Andhra Pradesh two decades ago. Actor and Chancellor of Mohanbabu University (MBU) Mohanbabu has faced a setback in the AP High Court in the kidnapping case of student leaders. On the occasion of the International Fleet Review (IFR), President Draupadi Murmu hosted a presidential banquet at the ENC Officers' Mess, Visakhapatnam on Tuesday night.
  • Hand of fortune in Hung Out of the 11 municipalities where the chairperson elections were postponed, the process was completed in 8 places on Tuesday.
  • Telangana State as Bio World 'Bio Asia is going beyond its name.. becoming Bio World. Looking at this meeting, I can proudly say that Telangana will grow as a bio world.
  • Rs. 1,700 crore investment Telangana received an investment of Rs.1,700 crore on Tuesday as the venue of the Bio Asia 2026 conference.
  • Family members should be clear about values and policies. When all the family members have a clear understanding of the policies to be followed and the values to be followed in the construction of business enterprises.. Shailaja Kiran, MD, Margadarshi Chitfunds said that family businesses can survive for a long time.
  • Your toilet is your doctor. Technological changes are coming in the field of medicine and health. Medical diagnostic tests are getting easier.
  • Old fees in 70 engineering colleges The Telangana Admissions and Fees Control Committee (TAFRC) will give a shock to some private engineering colleges in the state.
  • Dan.. Simba.. Leo Dan.. Simba.. Leo.. Charlie.. Tyson.. Rana.. Virat..
  • Police are ready to join the armed forces. Chief Minister Revanth Reddy has directed the officials to focus on cleanliness in the three municipal corporations under the capital. Convener Acharya K.Vijayakumar Reddy revealed that new facilities have been made available to keep track of the status of APSET application and get it again even if the registration number is lost.
  • BJP is the alternative to Congress in the state. BJP state president N. Ramachander Rao has called upon the ranks to work hard to bring the party to power in the state in the future. Dr. Rechus Ella, Chief Development Officer of Bharat Biotech, said that one in every three children in the world is supplied with vaccines from India.
  • My child did not get full justice. Pratyusha's mother Sarojini Devi said that she does not feel that justice has been done to her child 100%. She spoke to 'Eenadu-ETV' here on Tuesday.
  • Words..fires..Tense situations arose in some places during the process of election of municipal chairpersons and vice-chairpersons in joint Warangal and joint Adilabad districts on Tuesday. Can't be sent back Throughout the municipal elections.. Kasula Hawaii ran. The political parties who distributed large amounts of money to the voters before the polling. After the counting, they spent crores of rupees to impress the corporators and councilors. State secretary of the party and MLA of Kothagudem Koonanneni Sambasivarao stated that the CPI won an unprecedented victory in the first election when Kothagudem was formed as a corporation.