కార్లతో మభ్యపెట్టి.. అక్రమాలకు తెరతీసి

Eenadu icon
By Crime News Desk Updated : 21 Dec 2025 09:11 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

నరసరావుపేటసెంట్రల్, న్యూస్‌టుడే: చిలకలూరిపేట వద్ద ఇటీవల జరిగిన రోడ్డుప్రమాదంలో ఐదుగురి మృతికి కారణమైన కేసులో ఏఎస్సై కుమారుడు వెంకటనాయుడితో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్‌లో ఉన్న నిందితులను ఈ నెల 22 వరకు పోలీస్‌ కస్టడీకి పంపేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. వీరితోపాటు మరో ఇద్దరు అంజి, భానుప్రకాష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా నిందితులు విక్రయించిన 22 కార్లను గ్రామీణ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకొన్నారు.

అక్రమ కార్యకలాపాలు ఇలా

నిందితుడు వెంకటనాయుడు బృందంతో పాటు మరో ఇద్దరు నిందితులు అంజి, భానుప్రకాష్‌లు ఫైనాన్స్‌ కింద తాకట్టు పెట్టుకున్న కార్లతో పాటు అపహరించిన కార్లను పోలీసు, రాజకీయ నాయకులకు తక్కువ ధరకు ఇచ్చి మభ్యపెట్టేవారు. ఈ క్రమంలో వెంకటనాయుడి తండ్రి పోలీసుశాఖలో కొందరు ఉన్నతాధికారులకు తక్కువ ధరకు కార్లు ఇప్పించి తాను చేయాలనుకున్న పనులు చక్కబెట్టుకునేవారు. వారి అండతో వెంకటనాయుడు ఇష్టానుసారం వ్యవహరించేవాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న కార్లలో పోలీసులు, రాజకీయ నాయకులకు అమ్మినవి లేవు. అవేమయ్యాయో తెలియాల్సి ఉంది. స్వాధీనం చేసుకున్న కార్లలో విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, నకరికల్లు, చిలకలూరిపేట, మాచర్ల, గురజాల ప్రాంతాలకు చెందినవాటిలో.. ఈఎంఐ చెల్లించనివి ఉన్నాయి. ఒంగోలులో కొందరికి కార్లు విక్రయించారన్న సమాచారం మేరకు దర్యాప్తు బృందం ఒంగోలు వెళ్లగా అక్కడ కార్లు లభించలేదు.

విచారణకు సహకరించని నిందితుడు

పల్నాడు జిల్లాలో ఓ ప్రజాప్రతినిధికి నాలుగు కార్లను అమ్మినట్లు తొలుత చెప్పిన వెంకటనాయుడు విచారణలో ఎవరికీ కార్లు అమ్మలేదని తెలిపారు. ఎన్ని కార్లు ఫైనాన్స్‌లో తీసుకున్నారు, ఎన్ని.. ఎవరికి విక్రయించారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులకు అతడు సహకరించట్లేదని సమాచారం.

► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 09:10 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • 4 గ్రాముల బంగారం కోసం వృద్ధుడి దారుణ హత్య! శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పశువులను మేపేందుకు వెళ్లిన వృద్ధుడి చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని తస్కరించేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను దారుణంగా హతమార్చారు.
  • కల్వర్టును ఢీకొన్న వాహనం..ముగ్గురి దుర్మరణం నాగర్‌కర్నూల్‌ జిల్లా ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి గ్రామ శివారులో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో కర్ణాటకకు చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.
  • కత్తులతో పొడిచి న్యాయవాది దారుణ హత్య ఓ న్యాయవాదిని తన సొంత బావమరుదులే కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చిన ఘటన హైదరాబాద్‌లో శనివారం చోటు చేసుకుంది.
  • దిగుబడి రాక.. అప్పులు తీర్చలేక పంట దిగుబడి రాక.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఓ రైతు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలంలో చోటు చేసుకుంది.
  • విద్యార్థిపై వార్డెన్ల దాష్టీకం.. ఓ విద్యార్థిని తీవ్రంగా గాయపరిచిన ముగ్గురు వార్డెన్లపై ఖమ్మం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణ కథనం ప్రకారం...
  • భార్యతో గొడవ.. కత్తెరతో పసికందు హత్య రక్షించాల్సిన తండ్రే రాక్షసుడిగా మారాడు. భార్యతో జరిగిన చిన్న గొడవకు అభం శుభం తెలియని పసికందును బలి తీసుకున్నాడు. కన్నకూతురు అని కూడా చూడకుండా, అత్యంత కిరాతకంగా కత్తెరతో పొడిచి చిన్నారిని హతమార్చాడు.
  • కారులోనే ప్రేయసిని కాల్చేసి.. తనూ కాల్చుకుని.. ప్రేమికుల రోజున ప్రేయసిని హత్యచేసి, ఓ వ్యక్తి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన నొయిడాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దాద్రీ రోడ్డులో ఓ కారు చాలా సమయం నుంచి నిలిచి ఉందని పోలీసులకు సమాచారం శనివారం అందింది.
  • విమానంలో ఆత్మాహుతి బాంబర్లు ఉన్నారని బెదిరింపులు ‘ప్రయాణికుల మాటున దిల్లీ విమానంలో ఐదుగురు ఆత్మాహుతి బాంబర్లు ప్రయాణిస్తున్నారు.. శంషాబాద్‌లో ల్యాండింగ్‌ కాగానే ఆ విమానాన్ని పేల్చివేస్తాం’ అంటూ గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆర్జీఐఏ ఈ-మెయిల్‌కు సందేశం పంపించాడు.

English Translation

Camouflage with cars.. Open to illegalities

Eenadu icon
By Crime News Desk Updated : 21 Dec 2025 09:11 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Nara Raopet Central News Today: ASI's son Venkatanaiudi along with four others have been arrested by the police and produced in the court in the case of the recent road accident at Chilakaluripet that caused the death of five people. The court allowed the remand accused to be sent to police custody till 22nd of this month. Along with them, two others, Anji and Bhanuprakash, have been detained by the police. Based on the information given by them, the rural police seized 22 cars sold by the accused on Saturday.

Illegal activities

Accused Venkatanaidu's team along with two other accused Anji and Bhanuprakash used to sell stolen cars to police and politicians at a low price along with the cars pledged under finance. In this order, Venkatanayadu's father used to give cars to some high-ranking officials in the police department at a low price to arrange the work he wanted to do. Venkatanaidu used to deal with their eggs as per his will. None of the cars seized by the police were sold to policemen or politicians. We need to know what happened. Among the seized cars are those belonging to Vijayawada, Hyderabad, Visakhapatnam, Nakarikallu, Chilakaluripet, Macharla and Gurjala areas, which have not paid EMI. According to the information that the cars were sold to some people in Ongole, the investigation team went to Ongole and found no cars there.

Accused who did not cooperate with the investigation

Venkatanaidu, who initially said that he sold four cars to a public representative in Palnadu district, said during the investigation that he did not sell the cars to anyone. The police are investigating how many cars were taken on finance and how many were sold to whom. It is reported that he did not cooperate with the police.

► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 09:10 IST

Note:Advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • The brutal murder of an old man for 4 grams of gold! An atrocity took place in Sripottisriramulu Nellore district. Unidentified persons brutally killed an old man who had gone to graze cattle to steal his gold ring.
  • Vehicle collided with culvert. Three persons from Karnataka were killed in a fatal road accident in the suburbs of Timmannapalli village of Oorkonda mandal of Nagarkarnool district.
  • Lawyer brutally stabbed to death An incident where a lawyer was stabbed to death by his own brother-in-law took place in Hyderabad on Saturday. The incident of a farmer committing suicide by drinking pesticide due to lack of crop yield has taken place in Bela mandal of Adilabad district. Wardens assault on a student.. A case was registered in Khammam second town police station on Saturday against three wardens who seriously injured a student. According to the story of Inspector Balakrishna...
  • Argument with wife.. Baby girl killed with scissors The father he was supposed to save turned into a monster. Abham sacrificed an unknown baby due to a small quarrel with his wife. Without even seeing that she was his daughter, he killed the child by stabbing him with a scissor.
  • A man committed suicide by shooting his girlfriend in the car... on Valentine's Day. According to the police report.. On Saturday, the police received information that a car had been parked on Dadri Road for a long time.
  • There were threats of suicide bombers in the plane. An unidentified person sent a message to the RGIA e-mail saying, 'According to the passengers, there are five suicide bombers traveling on the Delhi flight...we will blow up the flight when it lands in Shamshabad'.