16 Epstein files Missing: ఎప్‌స్టీన్ కుంభకోణం.. ట్రంప్ ఫొటోతో సహా 16 ఫైళ్లు మాయం..!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన పత్రాలను అమెరికా న్యాయశాఖ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి దాదాపు 16 ఫైళ్లు మాయమయ్యాయి. (16 Epstein files Missing). అమెరికా న్యాయశాఖ వెబ్‌పేజీ నుంచి అదృశ్యమైన ఈ ఫైళ్లలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
ఎప్‌స్టీన్‌కు చెందిన పలు పత్రాలను అమెరికా న్యాయశాఖ శుక్రవారం (అమెరికా కాలమానం ప్రకారం) విడుదల చేసింది. అందులో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ వంటి ప్రముఖుల ఫొటోలు ఉన్నాయి. ఇవి విడుదల చేసిన కొన్ని గంటల్లోనే.. కొన్ని ఫైళ్లు మాయంకావడం చర్చనీయాంశంగా మారింది. మాయమైన 468 నంబరు కలిగిన ఫైళ్లలో ట్రంప్ ( Donald Trump)తో పాటు మెలానియా, ఎప్‌స్టీన్, ఆయన సన్నిహితురాలు గిస్లైన్ మాక్స్‌వెల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు బాధితుల నుంచి ఎఫ్‌బీఐ తీసుకున్న వాంగ్మూలాలు, అంతర్గత న్యాయశాఖకు మెమోలు వంటి కేసుకు సంబంధించిన సున్నితమైన అంశాలు ఉన్నట్లు సమాచారం.
- ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బిల్‌క్లింటన్, మైఖేల్ జాక్సన్
వీటిని ఉద్దేశపూర్వకంగానే తొలగించారా? అనుకోకుండా జరిగిందా? అనే విషయాన్ని న్యాయశాఖ స్పష్టం చేయలేదు. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. అదృశ్యమైన ఫైళ్ల గురించి నెట్టింట చర్చ మొదలైంది. హౌస్ ఓవర్‌సైట్ కమిటీలోని డెమోక్రాట్లు ఈ విషయంపై తీవ్రంగా మండిపడ్డారు. అటార్నీ జనరల్ పామ్ బోందీ పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ‘ఇంకేం కప్పిపుచ్చాలనుకుంటున్నారు? అమెరికన్ ప్రజలకు, మాకు పారదర్శకత అవసరం’ అని ఎక్స్‌లో ఓ పోస్టులో రాసుకొచ్చారు.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 08:44 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- శ్రీలంక సర్కారు కీలక నిర్ణయం.. ఎంపీల పెన్షన్లు రద్దు SriLanka: పొరుగు దేశం శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీల పెన్షన్లను పూర్తిగా రద్దు చేసింది. దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంట్‌లో మంగళవారం ఆమోదం పొందింది.
- ఆ యుద్ధ నౌకలు మునిగిపోవచ్చు! ట్రంప్‌నకు ఖమేనీ హెచ్చరికలు అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు.
English Translation
16 Epstein files Missing: Epstein scandal.. 16 files including Trump's photo are missing..!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Internet Desk: It is known that the US Department of Justice is releasing the documents related to the Epstein sex scandal that created a sensation around the world. An unexpected development took place in this process. Around 16 files related to this case have gone missing. (16 Epstein files missing). It seems that President Donald Trump's photo is also included in these files that have disappeared from the website of the US Department of Justice. This has become a topic of discussion.
A number of documents belonging to Epstein were released by the US Department of Justice on Friday (US time). It includes photos of celebrities like former president Bill Clinton and pop star Michael Jackson. Within a few hours of their release, the disappearance of some files became a topic of discussion. It seems that Trump ( Donald Trump) as well as Melania, Epstein and his close friend Ghislaine Maxwell are among the missing files numbered 468. In addition, it is reported that there are sensitive material related to the case such as the statements taken by the FBI from the victims and memos to the internal justice department. Did it happen by accident? The Department of Justice has not clarified the matter. No announcement has been made so far. A nagging discussion about the missing files began. Democrats on the House Oversight Committee were furious over the matter. Attorney General Pam Bondi demanded transparency. What else do you want to cover up? To the American people, we need transparency,' he wrote in a post on X.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 21 Dec 2025 08:44 ISTNote:Advertisements appearing on Eenadu.net are various It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Key decision of the Sri Lankan government.. Cancellation of pensions of MPs SriLanka: The government of the neighboring country Sri Lanka has taken a crucial decision. Pensions of MPs have been completely cancelled. The bill in this regard was approved in Parliament on Tuesday.
- Those warships may sink! Khamenei's Warnings to Trump Ayatollah Ali Khamenei, the supreme leader of Iran, made important comments while the tension between America and Iran continues.