నేడు

నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

పాపన్నపేట(మెదక్‌):మండల పరిధిలో శనివారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్‌ ఏఈ నర్సింలు తెలిపారు. మిన్‌పూర్‌ 132 కేవీ సబ్‌స్టేషన్‌లో మరమ్మతు లు చేయనున్నట్లు చెప్పారు. దీంతో ఉద యం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

జనవరిలో సర్టిఫికెట్‌

కోర్సు పరీక్షలు

మెదక్‌ కలెక్టరేట్‌:వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 13వ తేదీ వరకు టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సుల పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ విజయ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కో ర్సుల్లో భాగంగా డ్రాయింగ్‌ లోయర్‌ గ్రేడ్‌, హయ్యర్‌ గ్రేడ్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షలన్నీ జిల్లా కేంద్రంలో గుర్తించబడిన పరీక్ష కేంద్రంలో ఉంటాయని చెప్పారు.

వెబ్‌సైట్‌లో మెరిట్‌ లిస్ట్‌

మెదక్‌ కలెక్టరేట్‌:జిల్లాలోని పలు కేజీబీవీలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అభ్యర్థుల మెరిట్‌ లి స్ట్‌ విద్యాశాఖ సైట్‌లో పొందుపర్చినట్లు డీఈఓ విజయ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. ఖాళీగా ఉన్న అకౌంటెంట్‌ (4), ఏఎన్‌ఎం (5) ఉద్యోగాల భర్తీ కోసం మహిళా అభ్యర్థుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. అభ్యర్థులను మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేసి జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచినట్లు చెప్పారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం సవరణ మెరిట్‌ లిస్ట్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి వెబ్‌సైట్‌ httpr:// medakdeo.comలో ఉంచినట్లు ఆమె వివరించారు.

ఆయిల్‌పామ్‌ సాగుతో

అధిక లాభాలు

చిన్నశంకరంపేట(మెదక్‌):ఆయిల్‌పామ్‌ సాగు తో అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యాన అధికారి ప్రతాప్‌సింగ్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని సూరారంలో సత్యనారాయణ అనే రైతు సాగు చేసిన ఆయిల్‌పామ్‌ మొక్కలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 2 వేల ఎకరాల్లో రైతులు ఆయిల్‌పామ్‌ సాగు చేశారని తెలిపారు. అవసరమైన రక్షణ, పంట పెరుగుదలకు అవసరమైన సహాయం అందిస్తామని చెప్పారు. ప్రత్యామ్నాయ పంటల వైపు ఆలోచించే రైతులు ఆయిల్‌పామ్‌ సాగుకు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో అయిల్‌పామ్‌ డైరెక్టర్‌ రంగనాయకులు, మేనేజర్‌ కృష్ణారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

పంచాయతీ ముస్తాబు

అల్లాదుర్గం(మెదక్‌):ఈనెల 22న నూతన సర్పంచ్‌లు ప్రమాణ స్వీకారం చేయనున్నా రు. ఇందుకోసం పంచాయతీ కార్యాలయాలు ము స్తాబు చేస్తున్నారు. మండల పరిధిలోని అప్పాజీపల్లి పంచాయతీకి కొత్తగా రంగులు వేసి కార్యాలయానికి మరమ్మతులు చేస్తున్నారు.

వణికిస్తున్న చలి పులి

చేగుంట(తూప్రాన్‌):చలి పులి ప్రజలను వణి కిస్తోంది. జిల్లాలో వారం రోజులుగా తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు చలి తీవ్రతను త ట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఏడు గంటల వరకూ చలి తగ్గకపోవడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. వృద్ధులు, పిల్లలు, వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పొగ మంచు ఉండడంతో వాహనదారులు ఇబ్బందు లు పడుతున్నారు.

నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం 
1
1/2

నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం 
2
2/2

నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం


English Translation
>>> Disruption in supply

Papannapet (Medak):Electricity AE Narsimlu said that there will be a disruption in power supply in Mandala area on Saturday. He said that repairs will be done in Minpur 132 KV substation. Due to this, the power supply will be stopped from 10 am to 2 pm. Consumers have been requested to cooperate.

Certificate

Course Examinations in January

Medak Collectorate:DEO Vijaya stated in a statement on Friday that examinations for technical certificate courses will be held from January 10 to 13 next year. Drawing lower grade and higher grade exams will be conducted as part of the courses, he said. He said that all the examinations will be held at the examination center identified in the district center.

Merit list on the website

Medak Collectorate:Deo Vijaya said in a statement on Friday that the merit list of candidates for filling the vacant posts in various KGBVs in the district has been included on the website of the Education Department. He said that applications have already been received from female candidates for the vacant posts of Accountant (4) and ANM (5). He said that the candidates were selected on the basis of merit and the list was put online. She explained that after consideration of the objections, the modified merit list has been placed on the website of the district education officer http://medakdeo.com. On Friday, the oil palm plants cultivated by a farmer named Satyanarayana at Suraram in the mandal were inspected. On this occasion, he said that farmers have cultivated oil palm in 2 thousand acres in the district so far. They said that they will provide necessary protection and help for crop growth. Farmers thinking towards alternative crops were asked to come forward for oil palm cultivation. Ailpam Director Ranganayakulu, Manager Krishna Rao and other officials participated in the program.

Panchayati Mustabu

Alladurgam (Medak):On 22nd of this month new Sarpanches will take oath Rs. Panchayat offices are being restructured for this purpose. Appajipalli Panchayat under the mandal is being repainted and the office is being repaired. The intensity has increased in the district for a week. Temperatures are dropping day by day. Due to this, people are facing severe difficulties as they cannot withstand the extreme cold. As the cold did not subside till seven o'clock in the morning, people were eager to come out of the house. Doctors advise the elderly, children and sick people to take precautions. Motorists are facing problems due to smoke and snow.

Power supply disruption today 
1
1/2

Power supply disruption today

Power supply disruption today 
2
2/2

Power outage today