బ్రహ్మగిరి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి):శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జ లవిద్యుత్‌ కేంద్రం పనితీరు అద్భుతమని సినీ నటులు రాకింగ్‌ రాకేశ్‌, జోర్దార్‌ సుజాత అన్నారు. శనివారం కుటుంబ సభ్యులతో కలిసి ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రాన్ని సందర్శించారు. విద్యుత్‌ కేంద్రం పనితీరు గురించి ఉద్యోగులు వారి కి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో భూగర్భంలో ఇంతటి అద్భుతమైన విద్యుత్‌ కేంద్రం ఉండటం ఎంతో గర్వకార ణమని, విద్యుత్‌ కేంద్రాన్ని తమకు ఎంతో ఆనందంతో పాటు ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొన్నారు. సందర్శనకు అనుమతిచ్చిన జెన్‌కో సీఈ కేవీవీ సత్య నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.


English Translation

Brahmagiri, December 20 (Andhra Jyoti):Cinema actors Rocking Rakesh and Zordar Sujatha said that the performance of Srisailam left bank underground hydroelectric power station is excellent. On Saturday, he visited the left bank power station along with his family members. The employees explained to them about the functioning of the power station. On this occasion, they said that they are very proud to have such a wonderful underground power station in the Telangana region, and that the power station was a source of great joy and surprise for them. He thanked Genco CEO KVV Satya Narayana for allowing the visit.