- లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) :అర్హులందరికీ ఇం దిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి హామీ ఇచ్చారు. అ ర్హుల జాబితాను సిద్ధం చేసి తనకు నివేదిస్తే సీఎంతో మాట్లాడి ఇళ్ల మంజూరుకు కృషిచేస్తానని పేర్కొ న్నారు. కల్వకుర్తి పట్టణంలోని ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 66 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూ రు పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అం తకు ముందు రూ.3 కోట్ల 20 లక్షలతో కల్వకుర్తి నుంచి కుర్మిద్దతండా వరకు నిర్మించే బీటీ రోడ్డు నిర్మాణానికి, పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల, విద్యానగర్ స్కూల్, బాలికల హైస్కూల్, ప్రభు త్వ పాఠశాల జడ్పీ బాలుర స్కూళ్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమా వేశంలో ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి మా ట్లాడారు. కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు ఠాకూర్ బాలాజీసింగ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బృంగి ఆనంద్‌కుమార్, మునిసిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్, మా ర్కెట్ కమిటీ డైరెక్టర్లు పసుల రమాకాంత్‌రెడ్డి, మసూద్, పట్టణ అధ్యక్షుడు చిమ్ముల శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితీ విజయ్ కుమార్‌రెడ్డి, నాయకులతో పాటు శంకుస్థాపన కార్యక్రమంలో పీఆర్ డిప్యూటీ ఈఈ బసవ లింగం, పలువురు అధికారులు ఆయా గ్రామా ల సర్పంచ్ ఆంజనేయులు, భీమ్లానాయక్ పా ల్గొన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లను ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో సత్కరించారు.
English Translation
- MLA Kashireddy Narayana Reddy in distribution of Indiramma houses to the beneficiaries
Kalvakurti, December 20 (Andhra Jyoti): Kalvakurti MLA MLA Kashireddy Narayana Reddy has promised to grant Indiramma houses to all the deserving ones. He said that if he prepares a list of eligible people and reports to him, he will talk to the CM and work for the grant of houses. The MLA distributed the approval documents to 66 beneficiaries of Indiramma houses at the MLA camp office in Kalvakurti town. Before that, foundation stones were laid for the construction of the BT road from Kalvakurti to Kurmiddathanda at a cost of Rs.3 crore 20 lakhs, development works in the town's Government School, Vidyanagar School, Girls High School and Prabhu Twa School ZP Boys School. Later, MLA Kashireddy Narayana Reddy addressed us in a meeting held at MLA's camp office. Pollution Control Board Member Thakur Balajeesingh, Congress Party State Leader Bringi Anand Kumar, Municipal Commissioner Mohammed Sheikh, Market Committee Directors Pasula Ramakanth Reddy, Masood, Town President Chimmula Srikanth Reddy, Block Congress President Kaithi Vijay Kumar Reddy along with other leaders were present in the foundation laying ceremony. PR Deputy EE Basavalingam, several officials, Sarpanch Anjaneyulu and Bhimlanayak of the respective villages were present. Similarly, the MLA honored the newly elected Sarpanchs of the constituency in his camp office.