ఆసిఫాబాద్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): నిరుపేదల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పనులను లబ్ధిదారులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో శనివారం ఎన్‌ఐసీ వీసీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్‌లు దీపక్ తివారి, డేవిడ్, గృహ నిర్మాణ శాఖ పీడీ ప్రకాషరావులతో కలిసి వీసీ ద్వారా జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలు, గృహ నిర్మాణ శాఖ ఏఈలు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేసి పురోగతి సాధించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ఎంపీడీవోలు, ఎంపీవో లు, కార్యదర్శులు తమ పరిధిలో ఇళ్ల్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఇంకా ప్రారంభం కాని ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి తప్పని సరిగా నిర్మాణాలు ప్రారంభించేలా చూడాలన్నారు. ప్రతి రోజు క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్మాణాలపై పర్యవేక్షించి పనులు వేగవంతం చేసేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, డీఎల్‌పీవో ఉమర్ హుస్సేన్, డీఈఈలు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఫౌండేషన్ సేవలు అభినందనీయం
ఆసిఫాబాద్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): దృష్టి లోపం ఉన్న వారికి భారత డైనమిక్ లిమిటెడ్ (భారత రక్షణ మంత్రిత్వ శాఖ), బ్ల్లైండ్ విజన్ ఫౌండేషన ఆధ్వర్యంలో స్మార్ట్ విజన్ కళ్ల జోడు అందించడం అభిందనీయమని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఏఆ్పటు చేసిన కార్యక్రమానికి ఎస్పీ నితికా పంత్, అదనప కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా సంక్షేమాధికారి భాస్కర్‌లతో కలిసి 26 మంది దృష్టి లోపం ఉన్న వారికి స్మార్ట్ విజన్ కళ్ల జోళ్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ రక్షణ రంగంలో ఎంతో అనుభవం ఉన్న భారత్ డైనమిన్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో బ్లైండ్ విజన్ ఫౌండేషన్ వారు సామాజిక బాధ్యతలో భాగంగా దృష్టి లోపం ఉన్న వారికి కళ్ల జోడులు అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బ్లైండ్ డిజైన ఫౌండేషన ప్రతినిధులు చలపతి, సాగర్, ఆకాంక్షిత, జిల్లా బ్లాక్ సమన్వయకర్త బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలలను గుర్తింపు సాధించడం గర్వకారణం
ఆసిఫాబాద్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ్ ఎవం హరిత్ విద్యాలయ రేటింగ్ 2025-26 కార్యక్రమంలో జిల్లాలోని పాఠశాలలు ప్రతిష్టాత్మకంగా గుర్తింపు సాధించడం గర్వకారణమని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్‌లో ప్రత్యేక గుర్తింపు పొందిన పాఠశాలల ప్రతినిధులకు అదనపు కలెక్టర్, ఇనచార్జి డీఈవో దీపక్ తివారితో కలిసి శనివారం ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర విద్యా శాఖ నిర్వహించిన రేటింగ్ కార్యక్రమంలో జిల్లాలోని సావరఖేడ గ్రామ ప్రధాన మంత్రి శ్రీ మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాల, చిన్నరాస్పెల్లి గ్రామంలోని ప్రధాన మంత్రి శ్రీ జిల్లా పరిషత ఉన్నత పాఠశాల, రెబ్బెన, కౌటాల మంలాల్లో కేజీబీవీ, దహెగాం మండలం రాంపూర్ గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, కాగజ్‌నగర్ పట్టణంలోని అరుణోదయ ఉన్నత పాఠశాలలు ప్రత్యేక గుర్తింపు సాధించాయని తెలిపారు. విద్యా సంస్థలు కేవలం విద్యాబోధనకే పరిమితం కాకుండా పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, హరిత జీవన విధానాలపై విద్యార్థులలో అవగా హన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో బాధ్యతాయుత పౌరులుగా మారే లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. వీటి వినియోగంలో మిత వ్యయం, మరుగుదొడ్లు నిర్వహణ, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, ప్రవర్తన మార్పు, మిషన్ లైఫ్ కార్యక్రమాల అమలులో పాఠశాల అత్యుత్తమ ప్రమాణాలు సాధించి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి జీఎంవో మధుకర్, తదితరులు పాల్గొన్నారు.
English Translation
Asifabad, December 20 (Andhra Jyoti): Collector Venkatesh Dotre said that the beneficiaries should complete the works of Indiramma houses undertaken by the government on time as part of the welfare of the poor. On Saturday in the Collectorate building complex in the district center, NIC VC conference hall along with District Additional Collectors Deepak Tiwari, David and Housing Department PD Prakasha Rao conducted a review with MPDOs, MPOs, Housing Department AEs and Panchayat Secretaries through the VC. On this occasion, the Collector said that the government should speed up and make progress in the construction of houses, which is being undertaken with great ambition. He said that since the election process is over, MPDOs, MPOs and secretaries should pay special attention to the construction of houses in their area. He wants to talk to the beneficiaries of houses that have not yet started and ensure that the construction starts properly. It is advised to visit the field level every day and monitor the constructions and work hard to speed up the work. District Rural Development Officer Datta Rao, DLPO Umar Hussain, DEEs Venugopal and others participated in the program.
Foundation services appreciated
Asifabad, December 20 (Andhra Jyoti): Smart for the visually impaired under the auspices of India Dynamic Limited (Ministry of Defence), Blind Vision Foundation. Collector Venkatesh Dotre said that providing a pair of vision eyes is appreciable. SP Nitika Pant, Additional Collector Deepak Tiwari and District Welfare Officer Bhaskar handed over smart vision goggles to 26 visually impaired people in a program organized in the conference hall of the Integrated Collectorate building in the district center on Saturday. On this occasion, the Collector said that the Blind Vision Foundation under the auspices of Bharat Dynamin Limited, which has a lot of experience in the field of national defense, is appreciative of providing pairs of eyes to the visually impaired as part of their social responsibility. Blind Design Foundation representatives Chalapathy, Sagar, Akankshita, District Block Coordinator Balaraju and others participated in the program.
Recognition of schools is a source of pride
Asifabad, December 20 (Andhra Jyoti): Schools in the district were selected for the Swachh Evam Harith Vidyalaya Rating 2025-26 program conducted across the country under the auspices of the Central Education Department. Collector Venkatesh Dotre said that it is a matter of pride to achieve prestigious recognition. Additional Collector, In-Charge DEO Deepak Tiwari handed over the certificates to the representatives of the specially recognized schools at the Collector's Chamber in the Integrated Collectorate building complex in the district center on Saturday. On this occasion, the Collector said that in the rating program organized by the Central Education Department, Pradhan Mantri Shree Mandal Parishad Primary School in the district, Pradhan Mantri Shree Zilla Parishad High School in Chinnarapelli village, KGBV in Rebbena, Kautala Mall, Rampur Gram Mandal Parishad Primary School in Dahegam Mandal and Arunodaya High School in Kagajnagar town have received special recognition. He said that there is a need for educational institutions to create awareness among the students about cleanliness, environmental protection and green lifestyles rather than just teaching. He said that through the Swachh Vidyalaya program, the qualities of becoming responsible citizens will be developed in the students. He said that the school has achieved the best standards in the use of these, maintenance of toilets, personal hygiene, environmental cleanliness, behavior change and implementation of mission life programs. In charge GMO Madhukar and others participated in the program.