Hyderabad: హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

హైదరాబాద్: తెలంగాణలో ఫిల్మ్, టెలివిజన్ ఎకో సిస్టమ్‌ను మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Komatireddy Venkat Reddy) తెలిపారు. సులభంగా, సౌకర్యవంతంగా సినిమాల నిర్మాణానికి తెలంగాణ ఎంతో అనుకూలంగా మారిందన్నారు. సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు సహా పలువురు సినీ ప్రముఖులు, విశ్లేషకులతో కలిసి హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్‌లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మొదటి ఎడిషన్‌ను లాంఛనంగా ప్రారంభించారు.
ఎఫ్‌డీసీ, దాదా సాహెబ్ పాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్, తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఐమ్యాక్స్‌లో రేపు, ఎల్లుండి ఇంటర్నేషల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చిత్రాలను ప్రదర్శించనున్నారు. సుమారు 10 దేశాల నుంచి 700కుపైగా లఘు చిత్రాలు ప్రదర్శనకు రాగా.. వాటిలో ఉత్తమ చిత్రాలను జ్యూరీ సభ్యులు ఎంపిక చేసి ప్రదర్శించనున్నారు. హైదరాబాద్‌లో ఇంటర్నేషల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించడం తెలంగాణకు మైలురాయిగా పేర్కొన్న మంత్రి కోమటిరెడ్డి.. యువ ప్రతిభావంతులను వెలికితీసేందుకు, కొత్త ఆలోచలనకు అంకురార్పణ చేసేందుకు లఘు చిత్రాలు ఎంతో దోహదపడతాయన్నారు. సినిమాల్లో ప్రజల సంస్కృతి, జీవన విధానాన్ని ప్రతిబింబించాలని మంత్రి జూపల్లి.. ఔత్సాహిక దర్శక నిర్మాతలకు సూచించారు.
► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :