విడాకుల్లోనూ ట్రెండ్స్‌.. ఎందుకలా?

Eenadu icon
By Features Team Updated : 19 Dec 2025 16:13 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: విడాకులు అంటే చట్టబద్ధంగా న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకొని విడిపోవడం గురించే అందరికీ తెలుసు. కానీ, ఒకే దగ్గర కలిసి ఉంటూ వేర్వేరుగా జీవిస్తున్న జంటలు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ పద్ధతిని డివోర్స్‌ ట్రెండ్స్‌గా పిలుస్తున్నారు. వీటిలో కొన్ని.. బంధాన్ని తెంచి నిజంగానే విడాకులు తీసుకొనే పరిస్థితికి తీసుకొస్తే.. మరికొన్ని ట్రెండ్స్‌ బంధాలు నిలుపుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. మరి ఆ ట్రెండ్స్‌ ఏంటో చూద్దామా...!

దంపతులుగా దశబ్దాల పాటు జీవితాన్ని పంచుకొని 50 ఏళ్లు పైబడిన తర్వాత కొందరు విడాకులు తీసుకుంటున్నారు. దీన్నే ‘సిల్వర్‌ స్ల్పిట్టర్స్‌’అని కూడా వ్యవహరిస్తున్నారు. ఇన్నేళ్లు కలిసి ఉన్నా.. ఇద్దరిలో అసంతృప్తి ఉండటం, వ్యక్తిగత సంతోషాలు లభించకపోవడం, జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని కోరుకోవడం, జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురికావడం, ఆర్థిక స్వేచ్ఛ లభించడం వంటివి ఈ గ్రే డివోర్స్‌కు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. కన్న పిల్లలు ఎదిగి స్థిరపడటంతో ధైర్యం చేసి విడాకుల వరకు వెళ్తున్నారు.

కొంతమందికి నిద్రలో గురక వస్తుంటుంది. ఆ గురక వల్ల పక్కన ఉండేవారికి అసలు నిద్ర పట్టదు. ఈ సమస్య ఉన్న జంటలు ఒకే పడకపై నిద్రించడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. శృంగారంలోనూ సంతృప్తి ఉండదు. ఈ సమస్యల ప్రభావం దాంపత్య జీవితంపై పడకూడదనే కొంతమంది వేర్వేరు పడక గదుల్లో నిద్రించడానికి మొగ్గు చూపుతున్నారు. ఇలా దంపతులు వేర్వేరు గదుల్లో నిద్రించడాన్నే స్లీప్‌ డివోర్స్ అని పిలుస్తున్నారు. 

దీంట్లో దంపతులు చట్టబద్ధంగా విడాకులు తీసుకోరు. ఒకే ఇంట్లో ఉన్నా శారీరకంగా, భావోద్వేగాల పరంగా దూరంగా ఉంటారు. ఇంట్లో రోజువారీ చేయాల్సిన పనులు చేసుకుంటూనే విడిగా జీవిస్తారు. ఒకరితోఒకరు మాట్లాడుకోరు. కుటుంబసభ్యులకు, బంధువులకు మాత్రం కలిసిఉన్నట్లు కనిపిస్తారు. విడాకులు తీసుకునే ధైర్యం చేయలేక, ఒంటరిగా జీవించలేక, పిల్లల భవిష్యత్తును దృష్టిలోపెట్టుకొని ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతుంటారు. 

ఇది కూడా బంధాన్ని నిలుపుకోవడానికి ఉపయోగపడే ట్రెండే. ఏదైనా ట్రిప్‌కి వెళ్తున్నప్పుడు ఎయిర్‌పోర్టుకి కొన్ని గంటల ముందుగానే వెళ్లాల్సి ఉంటుంది. చెక్‌ ఇన్‌ అయిన తర్వాత ఇద్దరూ విడిపోయి తిరిగి విమానంలో కలుసుకుంటారు. ఎందుకలా అంటే.. ఎయిర్‌పోర్టులో వేచి చూసే సమయంలో ఇద్దరు వ్యక్తిగత సమయాన్ని కోరుకుంటున్నారు. షాపింగ్‌ చేస్తూ నచ్చిన వస్తువుల్ని కొనుగోలు చేయడం, నచ్చిన ఆహారం తినడం చేస్తున్నారు. ఇద్దరూ కలిసి ఉంటే అభ్యంతరాలు తలెత్తి ట్రిప్‌ సజావుగా సాగకపోవచ్చు. అందుకే, ఎయిర్‌పోర్టు ట్రెండ్‌ బాగా వైరల్ అవుతోంది. 

ఇది మహిళల్లో పెరుగుతోన్న ఆలోచన వల్ల మొదలైన ట్రెండ్‌. మధ్య వయసుకొచ్చాక మహిళల్లో మెనోపాజ్‌ మొదలవుతుంది. ఆ సమయంలో మహిళలు తమ వైవాహిక జీవితాన్ని సమీక్షించుకుంటున్నారట. ఏమాత్రం అసంతృప్తిగా ఉన్నా భర్త నుంచి విడిపోవాలని భావిస్తున్నారు. మహిళా సాధికారత కోసం పనిచేసే నూన్‌ అనే సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో ప్రతి ముగ్గురిలో ఒకరు.. భర్తకు విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తేలిందట. మెనోపాజ్‌కు, ఈ విడాకులకు కచ్చితమైన సంబంధం లేకపోయినా.. మెనోపాజ్‌ రాగానే మహిళలు విడాకుల గురించి ఆలోచిస్తుండటంతో దానికి ఆ పేరొచ్చింది.

► Read latest Explained Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Dec 2025 13:48 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • పేరుకే పెద్దమనిషి.. భారత్ అంటే నిలువెల్లా విద్వేషమే! ఆయన చేసింది బ్యాంకు వ్యాపారం.. గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీలు ఇచ్చి అయినకాడికి వసూలు చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి.
  • ప్రేమికుల రోజు సరదాలా?ఖర్చే లేకుండా రొమాంటిక్‌ అనుభవాలు పొందొచ్చు! ప్రేమికుల రోజు.. కేవలం ప్రేమ జంటలే కాదు, భార్యాభర్తలూ చేసుకోదగ్గ వేడుక. సాధరణంగా ఈ రోజున ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.
  • టెండర్లపై ‘ఏఐ’ నిఘా.. అక్రమాలు, సిండికేట్‌లు ఇకపై కుదరవు! రహదారులు, రైల్వే ప్రాజెక్టులు సహా అభివృద్ధి పనులు.. ఇలా ప్రభుత్వంలో ప్రధాన నిర్మాణ ప్రాజెక్టులకు టెండర్లు తప్పనిసరి.
  • విహారయాత్ర సరే.. బడ్జెట్‌ మాటేంటి? నెలవారీ ఖర్చులు, భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికల మధ్య విహారయాత్రకు ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయించడం కష్టమే. అయితే, చేసే ఖర్చుల్లోనే కొంత మొత్తం పొదుపు చేస్తే విహారానికి బడ్జెట్‌ పెద్ద సమస్యే కాదంటున్నారు ఆర్థిక నిపుణులు. మరి దానికి ఏం చేయాలంటే..
  • వద్దన్నా వస్తున్నారు.. యూరప్‌లో ట్రావెల్‌ ఓవర్‌క్రౌడింగ్‌! చాలా దేశాల ప్రభుత్వాలు తమ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ.. మా దేశంలో పర్యటించాలని ప్రకటనలు, ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. 
  • ‘మని’ ద్వీపకల్పం.. అక్కడ అంతా ఒకే సమూహం గ్రీసులో ఉన్న ఓ మానవ సమూహం తరతరాలుగా అనేక దాడులను ఎదుర్కొని నిలిచింది.
  • పిల్లల్ని కనబోతున్నారా.. మరి వీటి గురించి ఆలోచించారా? పెళ్లి చేసుకున్న యువజంటలతో బంధువులు అనే మొదటి మాట..‘పిల్లల్ని ఎప్పుడు కంటారు? తొందరగా కనేయండి’అని. వైవాహిక జీవితానికి తల్లిదండ్రులు అనే హోదానే పరిపూర్ణత ఇస్తుందని సమాజం నమ్ముతుంది.
  • మాటలెందుకు? మీమ్స్‌ ఉండగా.. జెన్‌ జీ లైఫ్‌స్టైల్‌ ఇదీ! ఎవరైనా బొద్దుగా ఉన్న వ్యక్తి తారసపడితే ‘ఒడియమ్మా బంటీ’ అంటున్నారు.. ఏదైనా పనిని ఆశ్చర్యపరిచేలా వేగంగా చేసినా, ఎవరూ చేయలేని పనిని చేసి చూపించినా ‘ఫ్లాష్‌మ్యాన్‌’ అని పిలుస్తున్నారు. ఎందుకు అంటారా? ఇటీవల సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అయినా మీమ్స్‌ అవి.
  • టైమ్‌కి పని అవ్వాలంటే.. ఈ టెక్నిక్స్‌ తెలిసుండాలి! అనుకున్న పనులు సమయానికి పూర్తి కావాలంటే సమయ పాలన చాలా ముఖ్యం. దీన్ని పట్టించుకోకపోతే పనులన్నీ గందరగోళంగా, అసంపూర్తిగా ఉంటాయి.
  • జిప్ కోడింగ్.. గల్లీ దాటని ప్రేమ! గతంలో ప్రేమ కోసం సప్తసాగారాలు దాటిన కథలు విన్నాం. ఈ టెక్నాలజీ యుగంలో ఎంత దూరమున్నా మొబైల్‌లో మాట్లాడుతూ, వీడియో కాల్స్‌తో నెట్టుకొస్తున్న లాంగ్‌ డిస్టెన్స్‌ ప్రేమలనూ చూస్తున్నాం. కానీ, ఇప్పుడు కాలంతోపాటు యువత ఆలోచనలూ మారుతున్నాయి.
  • గ్రీన్‌లాండ్‌లో స్థలాన్ని కొనలేం.. ఇల్లు కావాలంటే పదేళ్లు వేచి చూడాలి! గ్రీన్‌లాండ్‌.. డెన్మార్క్‌కు చెందిన స్వయంప్రతిపత్తి గల ప్రాంతం. ఇక్కడి భూచట్టాల ప్రకారం.. భూమి అనేది ఇక్కడి ప్రజల సామూహిక వనరు. అందుకే, వ్యక్తిగతంగా ఎవరికీ యాజమాన్య హక్కులుండవు.
  • నదిలో బంగారం.. అదే వారికి జీవనాధారం! హరియాణాలోని యమునానగర్‌ జిల్లాలో బోలి నది ప్రవహిస్తుంటుంది. ఆ నదీతీర ప్రాంతంలో నివసించే ప్రజలకు అది కేవలం నీటి వనరే కాదు.. జీవనాధారం కూడా. ఎందుకంటే ఆ నదీలో బంగారం ఉంది.
  • ఊరు మొత్తానికి ఒక్కటే వంటశాల.. వృద్ధుల కోసం వినూత్న ఆలోచన! చందంకి.. గుజరాత్‌లోని మారుమూల చిన్న గ్రామం. అన్ని ఊర్లలో ఉన్నట్టుగానే ఇరుకైన వీధులు, సాధారణ ఇళ్లు, గుడి, బడి అన్ని ఉంటాయి. కానీ, ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది.
  • పొట్ట నిండినా ఆహారంపైనే ధ్యాస.. పెరుగుతోన్న ఫుడ్‌ నాయిస్‌ ఆకలి వేస్తే భోజనం చేస్తాం. ఎప్పుడైనా అనుకోకుండా మంచి ఫుడ్‌ కనిపిస్తే జిహ్వా కోరికని తీర్చేస్తాం. కానీ, కొంతమందికి ఆకలి తీరినా, ఎన్ని రకాల రుచులు చూసినా ఇంకా ఏం తినాలి? ఎప్పుడు తినాలి? అని ఆహారం గురించే ఆలోచిస్తుంటారు.
  • ఇజ్రాయెల్‌ ఆర్మీలో అందమైన భామలు! Israeli Army: ప్రపంచంలోనే శక్తిమంతమైన ఆర్మీ కలిగిన దేశాల్లో ఇజ్రాయెల్‌ ఒకటి. అత్యాధునిక ఆయుధ, సాంకేతిక సంపత్తి ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (IDF) సొంతం.
  • ఇతరుల్ని అర్థం చేసుకునేవారు ఇలా ఉంటారట! మనుషులంతా ఒకేలా ఉండరు. కొందరికి ఎంత చెప్పినా అర్థం కాదు. మరికొందరు చెప్పకుండానే అర్థం చేసుకుంటారు. కానీ, చాలా కొంత మందికే ఇతరులను పూర్తిగా చదవగలిగే సామర్థ్యం ఉంటుంది.
  • ఈ ఆలయంలో మొక్కుకుంటే జుట్టు రాలదట! ఏ దేవాలయానికి వెళ్లినా సుఖఃసంతోషాలు కలిగించమని, ఆరోగ్యం కాపాడమని, సంపద పెరగాలని దేవుళ్లకు ప్రార్థించడం సహజం. వాళ్లు కరుణిస్తే మొక్కులు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అయితే, జపాన్‌లో ఓ విచిత్రమైన ఆలయం ఉంది. అక్కడ భక్తులు కేవలం తమ జుట్టు రాలిపోకూడదని, జుట్టు సమస్యలు తొలగిపోవాలని మాత్రమే ప్రార్థిస్తారు.
  • ఎగిరే గాలిపటం.. మెరుగయ్యే జీవనం! గాలిపటాలు ఎగరవేయడం అనేది కేవలం సంప్రదాయం, సరదా మాత్రమే కాదు.. మనుషులకు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాదు, ఎన్నో లాభాలు చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
  • ఒంటరితనానికి కారణం ఇతరులు కాదు, మన అలవాట్లే! కొంత మంది ఒంటరిగా మిగిలిపోయామని మథనపడుతుంటారు. తనకంటూ ఎవరూ లేరని, చుట్టూ ఉన్నవారు దూరం చేస్తున్నారని భావిస్తారు. నిజానికి మనలోని అలవాట్లు, ఆలోచన తీరు, మనస్తత్వాలే మనుషుల్ని మనకు దూరం చేస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.
  • అనగనగా ఓ గ్రామం.. అక్కడ ఒకే ఒక్క ఇల్లు! నిర్మానుష్య ప్రాంతంలో కాసేపు ఉండాలంటేనే భయంతో వణుకు వచ్చేస్తుంటుంది. అలాంటిది, కనుచూపుమేరలో మనుషులే కనిపించని ఓ మారుమూల గ్రామంలో ఓ కుటుంబం కొన్నేళ్లుగా నివసిస్తోంది.

English Translation
my-3">

Trends in divorce too.. why?

Eenadu icon
By Features Team Updated : 19 Dec 2025 16:13 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

Internet Desk: Everyone knows that divorce is legal separation with the permission of the court. But, more and more couples are living apart from each other. This method is called Divorce Trends. Some of these.. break the relationship and actually take it to the point of divorce.. some other trends are useful to maintain the relationship. And let's see what are the trends...!

After sharing life as a couple for decades, some are getting divorced after more than 50 years. This is also known as 'Silver Slippers'. Even after being together for many years.. Dissatisfaction between the two, lack of personal happiness, wanting to start life anew, spouse falling ill, getting financial freedom are the main reasons for this gray divorce. As the younger children grow up and settle down, they dare to divorce.

Some people get snoring in their sleep. Because of that snoring, the people next to you don't get any real sleep. Couples with this problem find it extremely difficult to sleep in the same bed. There is no satisfaction in romance. Some people prefer to sleep in separate bedrooms so that these problems do not affect their married life. This is called sleep divorce when the couple sleeps in different rooms. 

Physically and emotionally distant even if they live in the same house. They live separately while doing their daily chores at home. They don't talk to each other. To family members and relatives, they appear to be together. Unable to get a divorce, unable to live alone, keeping in mind the future of children, they follow this trend. 

This is also a trend that can be used to maintain a bond. Going on any trip requires getting to the airport a few hours in advance. After checking in, the two separate and meet back on the plane. Why? Both want personal time while waiting at the airport. They are shopping and buying the things they like and eating the food they like. If both are together, objections may arise and the trip may not go smoothly. Hence, the airport trend is becoming very viral. 

This is a trend started by the growing mindset of women. Menopause begins in women after reaching middle age. At that time women are reviewing their married life. She is expected to separate from her husband even if she is unhappy. In a survey conducted by Noon, an organization working for women's empowerment, it was found that one out of every three women is ready to divorce their husband. Menopause, though there is no exact relation to this divorce.. It got its name because women think about divorce after menopause.

► Read latest Explained Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Dec 2025 13:48 IST

Note:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

more

  • Gentleman in the name.. India is constant hatred! What he did was bank business.. There are allegations that he gave interest in rural areas and collected it. Valentine's Day is a celebration not only for couples but also for husband and wife. Usually on this day they exchange gifts to each other.
  • AI surveillance on tenders..Irregularities and syndicates are no longer possible! Development works including roads and railway projects...Tenders are mandatory for major construction projects in the government. Between monthly expenses and future financial plans, it can be difficult to budget specifically for a vacation. However, financial experts say that the vacation budget is not a big problem if you save some amount in the expenses. And what to do about it..
  • Vaddanna is coming.. Travel overcrowding in Europe! Governments of many countries are developing their tourism sector and are making advertisements and campaigns to visit our country. 
  • ‘Mani’ peninsula.. there everything is one group A human group in Greece has faced many attacks for generations.
  • Are you going to have children.. and have you thought about these? The first word of relatives with the married couple..'When will the children be born? Hurry up.' Society believes that the status of parenthood is what makes a married life perfect.
  • Why? While there are memes.. This is the lifestyle of Jen Z! If someone is chubby, they say 'Odiamma bunty'. Why do you say? Memes are the latest trend in social media.
  • If you want to work on time.. you should know these techniques! Time management is very important to complete the planned tasks on time. If you don't pay attention to this, all the work will be confused and incomplete.
  • Zip Coding.. Love that does not cross the street! In the past we have heard stories of crossing the seven oceans for love. In this age of technology, we are seeing long-distance love through video calls and talking on mobile phones. But, now the youth's thoughts are changing along with the times.
  • Can't buy land in Greenland.. If you want a house, you have to wait ten years! Greenland is an autonomous region of Denmark. According to the land laws here.. land is the collective resource of the people here. That is why, no one has ownership rights individually.
  • Gold in the river.. that is their livelihood! Boli river flows in Yamunanagar district of Haryana. It is not only a source of water for the people living in that riverside area, but also a source of livelihood. Because there is gold in that river.
  • Only one kitchen for the whole town.. An innovative idea for the elderly! Chandanki.. a remote small village in Gujarat. As in all towns, there are narrow streets, simple houses, temples and schools. But, this village has something special.
  • Dhyasa on food even if stomach is full. If we are hungry, we will eat. Whenever we find good food by chance, we satisfy the desire of Jihwa. But, even if some people are hungry, what else should they eat, no matter how many different flavors they see? When to eat? They think about food.
  • Beautiful women in the Israeli army! Israeli Army: Israel is one of the countries with the most powerful army in the world. Israel Defense Force (IDF) owns the latest weapons and technology.
  • People who understand others are like this! All people are not the same. No matter how much you say to some, it doesn't make sense. Others understand without being told. But, very few people have the ability to read others completely.
  • If you plant in this temple hair will fall! It is natural to pray to the gods to bring happiness, health and wealth to any temple. Devotees believe that if they show mercy, their prayers will be fulfilled. However, there is a strange temple in Japan. There the devotees only pray that their hair does not fall and hair problems get rid of it.
  • Flying Kite.. Better Life! Flying kites is not just a tradition, it is not just fun.. Experts say that it not only improves the physical and mental health of people, but also brings many benefits.
  • The cause of loneliness is not others, but our habits! Some people say that they are left alone. He feels that there is no one like him and that those around him are alienating him. In fact, psychologists say that it is our habits, thinking and mentality that keep people away from us.
  • A village is like a village. Staying in a deserted area for a while makes you shiver with fear. For example, a family has been living for years in a remote village where there are no people in sight.