
Brain: మెదడుకు మైక్రాన్ చికిత్స!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

మానవ శరీరంలోని గుండె, కళ్లను అత్యంత సూక్ష్మస్థాయిలోనూ వైద్యులు చూడగలుగుతున్నారు.. చికిత్సలు చేస్తున్నారు. మరి.. మెదడును అంతే సూక్ష్మ స్థాయిలో చూడగలుగుతున్నారా..? అంటే లేదనే సమాధానం వస్తోంది. కపాలంలో ఉండే ఈ భాగంపై విస్తృతస్థాయి సూక్ష్మ పరిశోధనలు లేకపోవడమే అందుకు కారణం. దీన్ని ఐఐటీ మద్రాస్ సవాల్‌గా తీసుకుని పరిశోధనలు సాగిస్తూ.. పురోగతి సాధిస్తోంది.

ఐఐటీ మద్రాస్‌లోని సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్ (ఎస్‌జీబీసీ) కీలక పరిశోధనల దిశగా అడుగులు వేస్తోంది. మెదడు లోపలి పొరల్లో కణజాల ఆకృతి ఎలా ఉంది? సాధారణ వ్యక్తుల్లో, జబ్బుపడిన వారిలో వస్తున్న మార్పులేంటనేది అత్యంత సూక్ష్మంగా పరిశీలన చేస్తున్నారు. 3డీ ఇమేజీల్ని తీస్తున్నారు. అమెరికాకు చెందిన పరిశోధకులతో పాటు వేలూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, బెంగళూరు నిమ్‌హాన్స్, చెన్నై సవిత మెడికల్ కాలేజీ, మెడిస్కాన్ తదితర సంస్థలతో కలిసి ఈ పరిశోధనల్ని విస్తృతం చేశారు.

450 మెదడుల సేకరణ
ఎస్‌జీబీసీ పరిశోధకుల ప్రకారం.. ప్రస్తుతం మెదడులోని భాగాల్ని ఎంఆర్‌ఐ ద్వారా చూడగలుగుతున్నారు. ఇందులో మిల్లీమీటర్ల స్థాయి వరకే చూడొచ్చు. మెదడులోని కణజాలాల్ని బాగా చూడాలంటే మైక్రాన్ల సైజుకు వెళ్లాలి. ఒక్కో కణజాలం 5-10 మైక్రాన్లు ఉంటుంది. అంటే మానవుని వెంట్రుకలో 5-10వ వంతు. ఆ స్థాయిలో కణజాలాన్ని, అందులోని మార్పుల్పి వైద్యులు చూడగలిగినప్పుడే మెదడుకు కచ్చితమైన చికిత్స ఇవ్వగలరని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఎస్‌జీబీసీలో అధునాతన యంత్రాలతో ఇమేజింగ్ వ్యవస్థ తెచ్చారు. దీనిపై ఇంజినీరింగ్, వైద్య, సాంకేతిక, ల్యాబొరేటరీ తదితర విభాగాలకు చెందిన నిపుణులు పనిచేస్తున్నారు. పరిశోధన కోసం ఇప్పటివరకు 450 మంది వివిధ వయసుల మృతులకు చెందిన మెదడుల్ని సేకరించారు. వీటిలో పిండం దశ నుంచి 60 ఏళ్ల వయసు వరకు ఉన్నవారివి ఉన్నాయి. వాటిని అధునాతన యంత్రాల్లో నిల్వ ఉంచి సూక్ష్మంగా పరిశోధిస్తున్నారు.

పరిశోధనల్లో భాగంగా తల్లి గర్భంలో ఉన్న పిండం వివిధ వారాల్లో మెదడు లోపలి భాగాలు ఎలా ఉంటాయనేది సూక్ష్మంగా కణజాలస్థాయిలో 3డీ మ్యాప్‌ల్ని ఈ ఏడాది విడుదల చేశారు. ఈ ప్రయత్నం ప్రపంచంలోనే తొలిసారి అని అక్కడి పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం పుట్టిన బిడ్డ నుంచి పెద్ద వయసుల వారి వరకు మెదడు లోపలి భాగాలకు 3డీ ఇమేజీల్ని తీస్తున్నారు. సాధారణ వ్యక్తుల్లో కణజాల స్థాయిలో మెదడు ఎలా ఉంది.. రేబిస్, కొవిడ్, అల్జీమర్స్ వంటి వ్యాధులున్న వారిలో మెదడు కణజాలస్థాయిలో వచ్చిన మార్పుల్ని అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ ఫలితాల్ని విడుదల చేసేందుకు ముందుకెళ్తున్నారు.

ఒక మనిషి మెదడు 2.5 పెటాబైట్స్ (పీబీ) సామర్థ్యంతో ఉంటుందని అంచనా. అంటే.. 2.5 కోట్ల గిగాబైట్ల సామర్థ్యం. ఇంత డేటాను మెదడు ఎలా దాచుకోగలుగుతోంది? మనిషి మెదడులోని అమరిక దీనికి ఎలా సహకరిస్తోందనేది ఎస్‌జీబీసీ చేస్తున్న మరో ఆసక్తికర పరిశోధన. ఈ పరిశోధనల తర్వాత అతితక్కువ స్థలంలో ఎక్కువ స్టోరేజీ సాంకేతికతపై దృష్టి సారించే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందులో వేగవంతమైన ఫలితాల్ని చూసేందుకు కృత్రిమమేధ (ఏఐ) సాంకేతికతనూ వాడుతున్నారు.
న్యూరాలజీ, అనుబంధ విభాగాలకు సంబంధించి ఇదో కీలక పరిశోధన. మెదడును మరింత క్షుణ్నంగా చూడగలిగితే వైద్యంలో అద్భుతాలు జరగొచ్చు. మా పరిశోధన ద్వారా భవిష్యత్తులో వైద్యవిధానాల్లో పెనుమార్పులు రావడానికి అవకాశాలున్నాయి. కొత్త ఔషధాల ఉత్పత్తికి ఆస్కారముంది. ఫలితంగా కొన్ని కోట్ల మందికి మంచి జరగొచ్చు. వాణిజ్యపరంగా కొత్తమార్గాలు తెరచుకోవడంతో పాటు బ్రెయిన్ ఇమేజింగ్‌లో డేటా సెట్స్ అనలైజర్లు పెరగడంతో పాటు మెదడుపై క్లినికల్ రీసెర్చి, క్లినికల్ ట్రయల్స్ జరిగేందుకు ఊతమిస్తుంది.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- మేక పాలతో సబ్బులు మేకపాలతో సబ్బులు తయారు చేస్తూ గ్రామీణ ప్రాంత మహిళలు ఉపాధి పొందుతున్నారు.
- ఈ శివలింగం పెరుగుతోంది.. జరుగుతోంది! బిహార్‌లోని నిరంజన నదిలో ఉన్న శివలింగం ఏటా అత్యంత స్వల్పంగా పెరుగుతోందని.. కదులుతోందని స్థానికులు చెబుతున్నారు.
- నేను రాహుల్‌వాదిని కాదు.. కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి రాదు కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్‌డీఎఫ్) విజయం సాధిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
- కర్ణాటకలో రూ.400 కోట్ల దారి దోపిడీ కట్టుకథే ఓ ట్రక్కులో హవాలా సొమ్ము తరలిస్తుండగా రూ.400 కోట్ల నగదు దోపిడీ జరిగిందంటూ ఆ వాహన డ్రైవర్ చేసిన ఫిర్యాదు బోగస్ అని తేలింది.
- ఏఐ ప్రయాణంలో ముందున్నాం కృత్రిమ మేధ (ఏఐ) రంగంపై విస్తృతంగా చర్చించేందుకు, అత్యాధునిక ఆవిష్కరణలపై అవగాహన కల్పించేందుకు భారత్ ఆతిథ్యమిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో-2026, సమిట్‌లు సోమవారం దిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
- తొలి దఫా బోర్డు పరీక్షలకు ‘పది’ విద్యార్థుల హాజరు తప్పనిసరి పదో తరగతి విద్యార్థులు మంగళవారం నుంచి నిర్వహించే మొదటి దఫా బోర్డు పరీక్షలు తప్పనిసరిగా రాయాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) స్పష్టం చేసింది.
- పెళ్లికి ముందు ఎవరినీ నమ్మవద్దు పెళ్లికి ముందే శారీరక సంబంధాలు ఏర్పరచుకునే విషయంలో అబ్బాయిలు, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు సోమవారం హెచ్చరించింది.
- ‘పరిశ్రమ’ నిర్వచనాన్ని తేల్చేందుకు 9 మంది జడ్జీలతో విస్తృత ధర్మాసనం ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ‘పరిశ్రమ’ నిర్వచనం వివాదంపై 9 మంది జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం విచారణ జరపనుంది.
- 25-26 తేదీల్లో మోదీ ఇజ్రాయెల్ పర్యటన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 25-26 తేదీల్లో రెండ్రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు.
- దేశంలోనే అత్యంత పొడవైన తొండ మహారాష్ట్రలోని కొల్హాపుర్ జిల్లాలో నిర్వహించిన వ్యవసాయ ప్రదర్శనలో దేశంలోనే అత్యంత పొడవైన తొండ(ఇగ్వానా) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
- ముచ్చటగా మూడోసారి.. ఐఏఎస్‌తోనే మనువు మధ్యప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అవీ ప్రసాద్ తన పెళ్లితో తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు.
- సంక్షిప్తవార్తలు (3) ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ మంగళవారం భారత్ పర్యటనకు రానున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబయిలో ఆయనతో సమావేశం అవుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
- ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు.. ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు మీకు ఉన్న అన్ని రకాల వ్యాధులను నిజాయతీగా వెల్లడించండి.
- ఉన్నత పదవుల్లో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి త్రిష ఇంటి నుంచి నటుడు విజయ్ బయటకు రావాలంటూ భాజపా తమిళనాడు అధ్యక్షుడు, ఆ పార్టీ శాసనసభా పక్షనేత నయినార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలను నటి త్రిష ఖండించారు.
- వేలాడే తీగల మార్గమే దిక్కు! ఉత్తరాఖండ్‌లోని ఘరూధి, మాన్‌కోట్ గ్రామాలకు ఇంకా తీగల మార్గమే దిక్కుగా ఉంది. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పిల్లలు, పెద్దలు ఈ తీగల ద్వారా గోరి నదిని దాటాల్సిందే.
- ఒకే ఊళ్లో కాలేయ సంబంధిత వ్యాధులతో ఏడుగురి మృతి హరియాణాలోని పల్వల్ జిల్లాలోని ఛాయాంసా గ్రామంలో కాలేయ సంబంధిత వ్యాధులతో గత పదిహేను రోజుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో నలుగురు హెపటైటిస్ బి సోకి చనిపోయారని స్థానిక వైద్య యంత్రాంగం సోమవారం పేర్కొంది.
- 22 ఏళ్ల క్రితం అదృశ్యమై… మళ్లీ కుటుంబం చెంతకు! మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 22 ఏళ్ల క్రితం అదృశ్యమై... 44 ఏళ్ల వయసులో కుటుంబాన్ని కలుసుకున్నారు.
English Translation

Brain: Micron treatment for the brain!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Doctors are able to see the heart and eyes of the human body at the smallest level.. they are doing treatments. And.. are you able to see the brain at such a subtle level..? The answer is no. The reason for this is the lack of extensive microscopic research on this part of the skull. Taking this as a challenge, IIT Madras is conducting research and making progress.
What is the texture of the tissue in the inner layers of the brain? The changes occurring in normal people and in sick people are being observed very minutely. Taking 3D images. Along with researchers from America, Vellore Christian Medical College, Bangalore Nimhans, Chennai Savita Medical College, Medicon and other institutions have expanded this research. class="mt-4 mb-2">Collection of 450 brainsAccording to SGBC researchers.. Currently, parts of the brain can be seen through MRI. It can be seen down to the millimeter level. To get a good look at brain tissue, you have to go down to the micron size. Each tissue is 5-10 microns. That is 5-10th of a human hair. Experts say that only when doctors can see the tissue and the changes in it at that level, they can give accurate treatment to the brain. For this, an imaging system with advanced machines has been brought in SGBC. Experts from engineering, medical, technical, laboratory and other departments are working on this. So far 450 brains of dead people of different ages have been collected for research. These include people from the fetal stage to the age of 60. They are being stored in sophisticated machines and are being meticulously researched.

As part of the research, 3D maps of the inner parts of the brain of the fetus in the mother's womb at different weeks have been released this year. Researchers there say that this attempt is the first in the world. Currently, 3D images are being taken of the inner parts of the brain from the newborn to the elderly. How is the brain at the tissue level in normal people.. The changes in the brain tissue level are being assessed in people with diseases like rabies, covid, Alzheimer's. The results are going to be released next year.
That is.. a capacity of 2.5 crore gigabytes. How is the brain able to store so much data? Another interesting piece of research being done by SGBC is how the arrangement of the human brain contributes to this. Scientists say that after these researches there are opportunities to focus on more storage technology in less space. In this, artificial intelligence (AI) technology is also used to see fast results.This is a key research related to neurology and related departments. If we can see the brain more thoroughly, miracles can happen in medicine. Our research has the potential to bring about major changes in medical practices in the future. There is scope for the production of new drugs. As a result, good will happen to a few crore people. With the opening of new commercial avenues and the growth of data set analyzers in brain imaging, clinical research and clinical trials on the brain are encouraged. News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags : Note:Business advertisements appearing on Eenadu.net are different
It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/
OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no need for correspondence in this matter.More