న్యూఢిల్లీ:బంగ్లేదేశ్ వరుస హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిపిస్తామని మహమ్మద్ యూనస్ సర్కారు హామీ ఇచ్చినా హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. గత ఏడాది ఆగస్టులో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఇంకిలాబ్ మోంచో యువనేత షరీఫ్ ఉస్మాన్ హదీ ఇటీవల అగంతకుని కాల్లుల్లో తీవ్రంగా గాయపడ్డారు. గురువారంనాడు సింగపూర్‌లో చికిత్స పొందుతూ అతను కన్నుమూయడంతో పరిస్థితి ఒక్కసారిగా దిగజారింది. శుక్రవారం సాయంత్రం హాదీ మృతదేహం ఢాకాకు చేరుకోవడం, శనివారం అంత్యక్రియలు జరగనున్నట్టు ప్రకటించడంతో ఢాకాలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. హాదీ హత్యకు బాధ్యులైన వారిని 24 గంటల్లో అరెస్టు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. గడువులోగా అరెస్టు చేయకుంటే పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామంటూ మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి ఆందోళనకారులు తాజాగా అల్టిమేటం ఇచ్చారు.


'సహనం నశించింది. అంత్యక్రియలు కూడా ముగిసాయి. నిందితులపై చర్యలకు ఇంకెంతో సమయం లేదు. 24 గంటల్లో హంతకులను అరెస్టు చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తాం' అని హాదీ మద్దతుదారులు హెచ్చరించారు. ఢాకాలో శనివారం మధ్యాహ్నం హాదీ అంత్యక్రియలకు ముందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల మేరకు హాదీ భౌతికకాయాన్ని బంగ్లా జాతీయ కవి ఖాజీ నజ్రుల్ ఇస్లాం సమాధి పక్కనే పూడ్చిపెట్టారు. ఉదయం నుంచే అంత్యక్రియలకు పెద్దఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఈ క్రమంలో పార్లమెంటు వెలుపల జనం కిక్కిరిసిపోయారు. హాదీని పొట్టనపెట్టుకున్న వారిని శిక్షించాలని, న్యాయం జరగాలని పెద్దఎత్తున ఆందోళనకారులు నినాదాలు చేశారు.


హాదీ మృతితో శనివారంనాడు దేశవ్యాప్తంగా సంతాప దినం పాటించారు. జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. ప్రార్థనా స్థలాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముందు జాగ్రత్తగా బంగ్లాదేశ్ సరిహద్దు గార్డులు, పోలీసు బలగాలను పార్లమెంటు భవనం వద్ద, ఢాకాలోని కీలక ప్రాంతాల్లో భారీగా మోహరించారు.


ఇవి కూడా చదవండి..


English Translation

New Delhi:Bangladesh is grappling with a series of violent incidents. The Muhammad Yunus government has promised to hold elections in February but the incidents of violence are not stopping. Sharif Usman Hadi, a youth leader of Inkilab Moncho, who played a key role in the student movement against the Sheikh Hasina-led Awami League government in August last year, was recently seriously injured in firing by a gunman. The situation took a turn for the worse when he passed away while undergoing treatment in Singapore on Thursday. After Hadi's body arrived in Dhaka on Friday evening and it was announced that the last rites would be held on Saturday, there were violent incidents in many places in Dhaka. There were demands to arrest those responsible for Hadi's murder within 24 hours. The agitators have recently given an ultimatum to the interim government of Muhammad Yunus saying that if they are not arrested within the deadline, they will go on a massive agitation.


'Patience is gone. The funeral is also over. There is no more time for action against the accused. If the killers are not arrested within 24 hours, the movement will intensify,' Hadi's supporters warned. Special prayers were held before Hadi's funeral in Dhaka on Saturday afternoon. According to family members, Hadi's body was buried next to the tomb of Bangladeshi national poet Qazi Nazrul Islam. A large number of people had gathered for the funeral since morning. In this order, people crowded outside the Parliament. A large number of protestors raised slogans to punish those who killed Hadi and justice should be done. The national flag was hoisted. Special prayers were conducted in places of worship. Bangladesh border guards and police forces have been deployed in large numbers at the parliament building and in key areas of Dhaka as a precaution.