అమరావతి:వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్( Former MLA Vallabhaneni Vamsi)కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు( AP High Court) షాక్ ఇచ్చింది. వంశీ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్( Anticipatory Bail Petition)పై అత్యవసర విచారణ జరిపేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. 2024 జులైలో వంశీ, అతని అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారని సునీల్ అనే వ్యక్తి మాచవరం పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు డిసెంబర్ 18న పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే, అరెస్టు భయంతో హైకోర్టును మాజీ ఎమ్మెల్యే వంశీ ఆశ్రయించారు. పోలీసులు తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్‌ను లంచ్ మోషన్‌గా విచారణ చేయాలని అభ్యర్థించారు. అయితే, పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేసేందుకు నిరాకరించిన హైకోర్టు.. మాచవరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు వివరాలను తమ ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం కేసు తదుపరి విచారణను 29వ తేదీకి వాయిదా వేసింది.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో నకిలీ ఇళ్ల పట్టాల కేసులో అరెస్టయిన వంశీ దాదాపు 137 రోజులపాటు జైలులో ఉన్నారు. అనంతరం ఎట్టకేలకు బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో రాజకీయంగా అంతగా యాక్టివ్‌గా లేరు. అయితే, తాజాగా కేసు నమోదు కావడంతో వంశీపై మరో పిడుగు పడినట్లు అయ్యింది.
English Translation
Amaravati:Andhra Pradesh High Court (AP High Court) gave a shock to YCP leader, former MLA Vallabhaneni Vamsi Mohan(Former MLA Vallabhaneni Vamsi). The High Court refused to conduct an urgent hearing on the anticipatory bail petition filed by Vamsi. In this regard, the next hearing has been postponed to 29th of this month. In July 2024, a man named Sunil approached the Machavaram police alleging that Vamsi and his followers attacked him. Police registered a case on December 18 based on the victim's complaint.
However, fearing arrest, former MLA Vamsi approached the High Court. The police asked the court to order them not to arrest him. It is requested that this petition be heard as a lunch motion. However, the High Court refused to investigate the petition on an urgent basis and ordered the police to place before them the details of the case registered at Machavaram Police Station. Later, the case was adjourned for further hearing on the 29th.
However, Vamsi, who was arrested in the case of fake house title deeds in February this year, has been in jail for about 137 days. Later he was finally released on bail. After that he was not very active politically due to health problems. However, with the latest case being registered, another thunderbolt has fallen on Vamsi.