హైదరాబాద్, డిసెంబర్ 20:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్టియన్ సోదరులకు ప్రభుత్వం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలను స్మరించుకుంటూ మానవ సేవయే మాధవ సేవగా భావించి ప్రేమను పంచాలని, ద్వేషించే వారిని కూడా ప్రేమించాలని ఆయన పిలుపునిచ్చారు.
డిసెంబర్ నెలను 'మిరాకిల్ మంత్'గా అభివర్ణించిన రేవంత్, ఇది క్రీస్తు ఆరాధకులకు మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి కూడా మిరాకిల్ మంత్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిసెంబర్‌లోనే జరిగాయని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏసుక్రీస్తు బోధనల స్పూర్తితో పనిచేస్తోందని చెప్పిన సీఎం, దుష్ప్రచారాలు, ఇబ్బందులు ఎదురైనా శాంతిని కాపాడుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 3.10 కోట్ల మందికి సన్న బియ్యం, రుణమాఫీతో పాటు రైతులకు 500 బోనస్ వంటి పథకాలను సీఎం ఉదహరించారు. క్రిస్టియన్ మిషనరీలు విద్య, వైద్య రంగాల్లో చేసిన సేవలను కొనియాడిన రేవంత్, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తామని స్పష్టం చేశారు. క్రిస్టియన్-ముస్లిం స్మశానవాటికల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు.
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ప్రకారం అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, క్రిస్టియన్ నేతలు పాల్గొన్నారు.
English Translation
Hyderabad, December 20:Telangana Chief Minister Revanth Reddy today participated in the Christmas celebrations at the LB Stadium and extended heartfelt greetings to the Christian brothers on behalf of the government. Remembering the teachings of Jesus Christ, he called upon people to spread love and love even those who hate them, considering human service as Madhava service.
Describing the month of December as 'Miracle Month', Revanth stated that it is a miracle month not only for the worshipers of Christ but also for the people of Telangana and the Congress Party. He reminded that the birthday of Congress leader Sonia Gandhi and the formation of Telangana state took place in December. The CM said that the government is working in the spirit of the teachings of Jesus Christ and expressed confidence that the welfare schemes are being implemented while maintaining peace despite the evil propaganda and difficulties.
The CM cited schemes like Indiramma houses, free bus travel for women, 200 units of free electricity for 50 lakh families, rice for 3.10 crore people, loan waiver and 500 bonus for farmers. Praising the services rendered by Christian missionaries in the fields of education and medicine, Revanth made it clear that all religions will be respected equally. He said that the problems of Christian-Muslim graveyards will be solved.
Revanth Dhima expressed that according to the Telangana Rising 2047 vision, we will make it number one in the country in terms of development and welfare. Ministers, MLAs and Christian leaders participated in the celebrations.